twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: జగతి ఎంట్రీతో మారిన సీన్.. పాపం దేవయాని ప్లాన్ తుస్.. అయినా తగ్గకుండా మరో ప్రయత్నం!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే సాగుతోంది. మిషన్ ఎడ్యుకేషన్ రద్దు విషయం నోటీసు బోర్డులో పెట్టడంతో స్టూడెంట్స్ అంతా నిరసనకు దిగుతారు. విషయాన్ని వాడుకోవడానికి దేవయాని మనుషులను దించడంతో గొడవను మరింత పెద్దది అయ్యేలా చేస్తారు. దేవయాని ప్లాన్ లో భాగమైన వారు కాలేజ్ లో పెద్ద దుమారం రేపుతారు. క్లాసులు కూడా జరగకుండా చేసి రచ్చ చేస్తారు.
    ఇక అలా మొదలైన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    త్వరగా రండి సార్ అని

    త్వరగా రండి సార్ అని

    దేవయాని సూచనలతో మీడియా రిపోర్టర్ కాలేజీలో పెద్ద దుమారానికి తెరతీయగా స్టూడెంట్స్ ఆందోళనకు కారణం వసుధారే అని రిషి ఫిక్స్ అవుతాడు. కాలేజీకి వచ్చిన ప్రెస్ వాళ్లు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రద్దుచేశారంట కదా అంటూ వరుస కాల్స్ చేస్తుంటారు. మహేంద్ర, జగతి ఇదంతా టీవీలో చూసి కంగారు పడతారు.

    జగతి మహేంద్రను కాలేజ్ కు వెళ్ళమని చెబుతుంది. ఈలోపు రిషికి కాల్ చేసిన దేవయాని మరింత రెచ్చగొడుతుంది. ఇదంతా కావాలనే ఆ జగతి, వసుధార చేస్తున్నారు, ఇప్పటికైనా వాళ్ళ నిజస్వరూపం తెలుసుకో అని ప్రేమ ఒలకబోసింది. మినిస్టర్ జగతికి కాల్ చేసి ఏంటమ్మా ఇదంతా, కాలేజీ పరువు, ప్రాజెక్ట్ పరువు పోతోంది కదా ఏదో ఒకటి త్వరగా చేయండని చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఈలోపు వసుధార మహేంద్రకి కాల్ చేసి ఇక్కడ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయ్ మీరు త్వరగా రండి సార్ అని అడుగుతుంది.

    మా నిర్ణయం అని

    మా నిర్ణయం అని

    ఆ తర్వాత రిషి సార్ తో మాట్లాడాలి అని వసుధార రిషి క్యాబిన్ కి వెళుతుంది. క్యాబిన్లో వసుధార ని చూసి మండిపడ్డాడు రిషి. చేసిందంతా చేసి ఏం మాట్లాడతావ్ గెటవుట్ అని అరుస్తాడు. వాళ్లతో మాట్లాడండి ప్లీజ్ అంటే...నువ్విక్కడ నుంచి వెళ్లిపో గెటవుట్ వసుధార అని ఫైర్ అవుతాడు. ఇంతలో ఫణీంద్ర, మహేంద్ర కాలేజీకి చేరుకుంటారు... ఎదురొచ్చిన వసుధారతో ఏమైందని అడిగితే మీరు వెళ్ళండి రిషి సార్ తో మాట్లాడండి అని చెబుతుంది.

    ఏంటి ఇదంతా పద బయటకు వెళ్లి మాట్లాడుదాం అని ఫణీంద్ర, మహేంద్ర రిషిని బయటకు తీసుకు వచ్చి అందరినీ సమావేశపరుస్తారు. డీబీఎస్టీ కాలేజీ పేరు ప్రతిష్టలు అందరికీ తెలుసు...కానీ..ఈ రోజు జరిగిన సంఘటన గురించి మాట్లాడేందుకు వచ్చాం. ఈ విషయంపై అందరికీ క్లారిటీ ఇచ్చేందుకే మన కాలేజీ ఎండీగారు వచ్చారని చెప్పడంతో రిషి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీబీఎస్టీ కాలేజీ మొదలుపెట్టింది...దీన్ని ఎలా తీసుకెళ్లాలనేది పూర్తిగా మా నిర్ణయం అని అంటాడు.

    ప్రశ్నిస్తూ ఉండగా

    ప్రశ్నిస్తూ ఉండగా

    రిపోర్టర్ ఇంకేదో అడగగా ఇది మా అంతర్గత వ్యవహారం....దీనిపై ఎవరి ప్రభావం ఉండకూడదు... అందరికీ విద్య ప్రాముఖ్యత తెలిపేందుకే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ రూపొందించాం...ఎందరికో స్ఫూర్తిగా నిలిచాం అని అంటాడు. ఇది మా కాలేజీకి మాత్రమే సంబంధించిన విషయం అని నా నమ్మకం...దీన్ని ఎందుకో మా స్టూడెంట్స్ అపార్థం చేసుకుంటున్నారు...కాలేజీ ఎండీగా వారి అపార్థాలు తొలగించడం నా బాధ్యత అంటాడు.

    రిపోర్టర్ ఈ ప్రాజెక్ట్ రూపకర్త అయిన జగతి మేడం ఇక్కడ కనిపించడం లేదని, జగతి మేడంని కాలేజీ నుంచి పంపించారంట కదా... జగతి మేడం ఇక్కడ ఎందుకు లేరు అని ప్రశ్నిస్తూ ఉండగా అదే సమయంలో ఎంట్రీ ఇస్తుంది జగతి. మిషన్ ఎడ్యుకేషన్ అన్నది డీబీఎస్టీ కాలేజీకి సంబంధించిన అంశం...మీరే ఎడినా ఊహించుకున్నారా, ఎవరైనా చెప్పారా అని మీడియాకు చురకలు అంటిస్తుంది. 24 గంటల్లోగా రిషి సార్ దీనిపై వివరణ ఇస్తారు..మీరంతా మీ పనులు చేసుకోండి అని స్టూడెంట్స్ కి చెబుతుంది.

    ఆమె మీద రిషి ఫైర్

    ఆమె మీద రిషి ఫైర్

    అందరికి వెళ్ళిపోయి రిషి, వసుధార మిగులుతారు. రిషి అన్నమాటలు గుర్తుచేసుకున్న వసుధార...సార్... మీరు నన్ను చాలా అన్నారు..నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు..కాలేజీలో జరిగిన గొడవకు నాకు ఎలాంటి సంబంధం లేదు.. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ గొడవకు నేను కారణం కాదని అంటుంది. ఆ తరువాత కూడా ఆమె మీద రిషి ఫైర్ అవుతాడు. ఇంటికి వెళ్లి ఆలోచనలో పడిన రిషి...కాలేజీలో జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటాడు. ఇదే అదనుగా అక్కడకు ఎంట్రీ ఇచ్చిన దేవయాని మరో డ్రామాకు తెరతీస్తున్నట్టు కనిపించింది.

    Recommended Video

    Puri Jagannath పంతం నెగ్గిచుకున్నాడు.. Vijay Devarakonda తో JGM | Filmibeat Telugu
    హోలీ సందడి

    హోలీ సందడి

    జగతిని వద్దన్నా నీ మంచితనంతో తనని కాలేజీలోకి తీసుకున్నావ్...కాలేజీకి వచ్చే గొప్ప పేరంతా వాళ్లే తీసుకెళ్లాలని ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు... మీటింగ్ చివర్లో వచ్చి ఏదో గొప్పగా మాట్లాడిందట కదా...ఇదే తన నిజస్వరూపం అంటూ రచ్చ గొడుతుంది.

    ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది..తరువాయి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దానై ప్రకారం రిషి చేయి పట్టుకుని థ్యాంక్స్ చెబుతుంది వసుధార ఏం అవసరం లేదని సైలెంట్ గా వెళ్లిపోతున్న రిషి చేయి పట్టుకుని ఈ రోజు మీరు నాతో పాటు రావాల్సిందే అంటూ ఓ చోటికి తీసుకెళ్తుంది..అక్కడ హోలీ సందడి నెలకొంది. అందులో రిషి, వసుధార దగ్గరయినట్టు కనిపిస్తోంది.

    English summary
    Guppedantha Manasu Episode 410: Jagathi answers the media and stops the riot at the college. On the other hand, Devayani manipulates Rishi against Jagathi and Vasudhara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X