twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చిన రిషి.. కక్కలేక మింగలేక గోతిలో పడ్డ నక్కలా మారిన దేవయాని

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. ప్రస్తుతానికి సీరియల్ మొత్తం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చుట్టూనే సాగుతోంది. మిషన్ ఎడ్యుకేషన్ రద్దు విషయం నోటీసు బోర్డులో పెట్టడంతో స్టూడెంట్స్ అంతా నిరసనకు దిగుతారు. విషయాన్ని వాడుకోవడానికి దేవయాని మనుషులను దించడంతో గొడవను మరింత పెద్దది అయ్యేలా చేస్తారు. కానీ జగతి ఎంట్రీ ఇచ్చి సమస్య అప్పటికప్పుడు సద్దుమణిగేలా చేస్తుంది. 24 గంటల్లో రిషి క్లారిటీ ఇస్తాడని చెబుతుంది. ఆ క్లారిటీ ఇచ్చేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇక అలా మొదలైన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    కాలేజీకి వెళతా

    కాలేజీకి వెళతా

    మహేంద్రకు కాలేజీలో జరిగిన దాని గురించి ఫోన్లో ఏమైనా ఇంటర్యూ ఇవ్వగలరా అంటూ జర్నలిస్ట్ కాల్ చేస్తే...అది కాలేజీ వ్యవహారం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మహేంద్ర దగ్గరకు వచ్చిన జగతి నాక్కూడా చాలా కాల్స్ వచ్చాయి మహేంద్ర అంటుంది. దీంతో రిషి ఎవరి ఆలోచనలకూ అందడు, ఎవరి మాటా వినడు..తనకు అనిపించింది చేస్తాడు...కాలేజీ ఎండీగా తనకు నచ్చిన నిర్ణయం తీసుకుంటాడని అంటూ ఉండగా జగతి నువ్వు మాత్రం రిషి మీద కోపం తెచ్చుకోవద్దు మహేంద్ర అంటుంది. అంతేకాక రేపు నువ్వు కాలేజీకి వెళ్లాలని అనడంతో నువ్వు చెప్పాక తప్పుతుందా..కాలేజీకి వెళతానని మహేంద్ర అంటాడు.

    మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు

    మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు


    కాలేజీలో రిషి క్లారిటీ ఇవ్వడం కోసమే పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తారు. మినిస్టర్ కూడా మీటింగ్ లో కూర్చుని ఏంటి మహేంద్ర గారు సమస్యను సాల్వ్ చేసుకోమంటే ఇంత దూరం తీసుకొచ్చారు ఏమిటి అని అడుగుతారు. అయితే మీటింగ్ గు ఆలస్యంగా వచ్చిన రిషి, అందరికీ నమస్కారం ఆలస్యంగా వచ్చినందుకు క్షమించండి అంటూ మీ అందరికీ క్లారిటీ ఇవ్వడానికే వచ్చానని చెబుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ ఎందుకు ఆపేశారో తెలుసుకోవచ్చా అని రిపోర్టర్ అడిగితె మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తాను, కాలేజీ స్టాఫ్ కి చాలా సందేహాలున్నాయి, స్టూడెంట్స్ లో ఆవేశం కొత్తగా చూస్తున్నాను...అన్నింటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు వచ్చాను.... డీబీఎస్టీ కాలేజీ ఎండీగా నాకున్న అధికారాలను ఉపయోగిస్తూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చేస్తున్నాను అని మరోసారి ప్రకటిస్తాడు.

    ప్రభుత్వానికి అంకితం

    ప్రభుత్వానికి అంకితం

    అందరూ షాకయినా దేవయాని మాత్రం సంతోషిస్తుంది. అయితే రిషి మాట్లాడుతూ ఇకపై మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ డీబీఎస్టీ కాలేజీ నిర్వహించడం లేదు...ఈ విషయంలో రెండో ఆలోచన లేదని తేల్చి చెబుతాడు..మిషన్ ఎడ్యుకేషన అనే ఆలోచన చాలా చిన్నగా మొదలైంది.. ఓ నాలుగు గోడల గదిగా కట్టి పైకప్పు వేసి విద్య ప్రాముఖ్యత తెలియజేస్తూ ఇల్లులా మారిందని అంటాడు. ఈ మిషన్ ఎడ్యుకేషన్ అనే చిన్న ఇంటిలో చాలా తక్కువ మందికే ఆశ్రయం ఇస్తున్నాం అందుకే దాన్ని కూల్చివేస్తున్నాను. దాని స్థానంలో ఓ పెద్ద ఏడు అంతస్తుల బంగ్లా కట్టాలని నా ఆలోచన అని అంటదు. డీబీఎస్టీ కాలేజీ అనే ఓ విద్యాసంస్థ నిర్వహిస్తేనే ఇంత గొప్ప పేరు వచ్చినప్పుడు అదే ప్రాజెక్ట్ ను ప్రభుత్వం తీసుకుని నిర్వహిస్తే ఇంకెంత గొప్ప ఫలితాలు వస్తాయో మీరే ఆలోచించండని చెబుతూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను డీబీఎస్టీ కాలేజీ ర్దదుచేసుకుని ప్రభుత్వానికి అంకితం చేస్తోందని అంటాడు.

    బిల్డప్ ఇవ్వడంతో

    బిల్డప్ ఇవ్వడంతో

    ఈ నిర్ణయం విన్న తర్వాత అందరూ సంతోషంగా ఉంటే దేవయాని ముఖం మాడిపోయింది. ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ కాలేజీ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకు వస్తుందని చెబుతారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇద్దరు డైరెక్టర్లు ఉంటారు... ఒకరు కాలేజీ తరపున ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మహేంద్ర భూషణ్ గారు వ్యవహరిస్తారు, రెండో డైరెక్టర్ గా నా మనసులో ఒకరున్నారు...ఆవిడంటే నాకెంతో గౌరవం అంటూ కొంత బిల్డప్ ఇవ్వడంతో దేవయాని నేనే అని అనుకుంటుంది.. ఇక ప్రభుత్వానికి-కాలేజీకి అనుసంధానంగా రెండో డైరెక్టర్ గా నేను ప్రకటిస్తున్నాను అంటూ మినిస్టర్ పర్మిషన్ తీసుకుని జగతి మేడం అని ప్రకటిస్తాడు.

    విషయం మొత్తం

    విషయం మొత్తం

    అప్పుడే వచ్చిన జగతి వసు ఏం జరిగింది అని అడిగితే...జరిగిన విషయం మొత్తం చెబుతుంది వసుధార. ఇక దేవయాని రిషి క్యాబిన్లో పంచాయతీ పెడుతుంది. దేవయాని ఇంటికెళ్దాం పద అంటే ఇంటికి-కాలేజీకి పెద్ద తేడా తెలియడం లేదని ఫైర్ అవుతుంది. చిన్నప్పుడు నిన్ను వదిలేసి వెళ్లిన జగతి లేదని మీనాన్న, పెదనాన్న బాధపడ్డారు కానీ నిన్ను పెంచింది నేనే కదా... అప్పుడు లేని జగతి ఇప్పుడు ఎలా మంచిగా మారిందని రిషిని టార్గెట్ చేస్తుంది. ఇక ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది..తరువాయి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దానై ప్రకారం రిషి చేయి పట్టుకుని థ్యాంక్స్ చెబుతుంది వసుధార ఏం అవసరం లేదని సైలెంట్ గా వెళ్లిపోతున్న రిషి చేయి పట్టుకుని ఈ రోజు మీరు నాతో పాటు రావాల్సిందే అంటూ ఓ చోటికి తీసుకెళ్తుంది..అక్కడ హోలీ సందడి నెలకొంది. అందులో రిషి, వసుధార దగ్గరయినట్టు కనిపిస్తోంది.
    .

    English summary
    Guppedantha Manasu Episode 412: Rishi addresses the media and tells his decision. Meanwhile, Devayani gets angry when he appoints Jagathi as the director for the new project.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X