For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: ఐలవ్యూ అంటూ రిషి మైండ్ బ్లాక్ చేసిన వసుధార.. మహేంద్ర చేతికి ప్రేమలేఖ?

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే నివసిస్తూ ఉంటుంది. రిషి అనేకసార్లు ఆమె రూం కి వచ్చి వెళుతూ ఉండటంతో ఆమెకు రూమ్ అద్దెకిచ్చిన యజమానులు సహా బస్తీవాసులు ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను అనుమానించి అవమానించి మాట్లాడతారు. మళ్లీ రిషి రూమ్కు వస్తున్న సంగతి తెలుసుకుని వాళ్ళు చూస్తే ఆయన ఎక్కడ మాటలు అంటారో అనే భయంతో ముఖం మీదే తలుపు వేసి మీరు వెళ్లిపోవాలని చెబుతుంది.

  బాధ పడిన తర్వాత రిషి గౌతమ్ ఆమెకు ప్రపోజ్ చేయాలని ఎంకరేజ్ చేస్తాడు. ఆమెకు ప్రపోజ్ చేయడం కోసం వెళ్లిన గౌతం ఆమెకు ప్రపోజ్ చేయడంతో ఆమె క్లాస్ పీకుతుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  గౌతంతో వెటకారం

  గౌతంతో వెటకారం

  తన లవ్‌ను వసుధార రిజెక్ట్ చేసిందని బాధలో ఉన్న గౌతమ్‌ను బిజీ కావాలని ఇంకా ఇంకా ఏడిపిస్తుంటాడు రిషి. తమ తండ్రితో త్వరలో ఒక పార్టీ ఇస్తున్నాను అని చెప్పడమే కాక ఆ పార్టీకి గౌతమ్‌ చీఫ్‌ గెస్ట్‌ అని కూడా చెబుతాడు రిషి. పాపం మహేంద్ర కు విషయం అర్ధం కాక ఇలాంటి వాటికి హ్యాపీగా ఫీల్ అవ్వలే కానీ డల్‌ అయిపోతావేంటని గౌతమ్‌ను ఉత్సాహ పరుస్తాడు.

  ఇంతలో గౌతమ్‌ బ్రేకప్ బాధలో ఉండి తాను పార్టీకి రానని.. చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి కూడా పార్టీ క్యాన్సిల్ చేసేస్తాను అని అంటాడు. అయితే తాను వస్తానని చెప్పే పార్టీ రిషి క్యాన్సిల్ చేశాడని జగతి అనుకుంటుంది. మరోపక్క బెడ్‌రూమ్‌కి వెళ్లి వసుధార కోసం రిషి ఆలోచిస్తాడు.

  రిషికి వసుధార మెసేజ్

  రిషికి వసుధార మెసేజ్

  ఇంతలో వసుధార నుంచి మెసేజ్ వస్తుంది. ఏమిటా అని కంగారు పడి చూస్తే ఆమె రిషి గీసిన బొమ్మ ఫోటో పెట్టడమే కాక ఎలా ఉంది అని అడుగుతుంది. బాగుంది, నీలాగే ఉంది అని సమాధానం చెప్తాడు రిషి. ఎవరు గీశారు అని రిషి ఏమీ తెలియనట్టు అడిగితే మీరే తెలుసుకోవాలని సమాధానం ఇస్తుంది వసుధార. మనం ఒకసారి కలవాలని కూడా అడుగుతుంది. కలవడానికి వస్తే మొహాన తలుపులు వేసేస్తావని గుర్తు చేస్తాడు రిషి.

  అయితే రెస్టారెంట్‌ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సమాధానం చెప్తుంది వసుధార. ఆ సమాధానానికి షాక్ తింటాడు రిషి. నేను అడిగిందానికి ఎంత తెలివిగా సమాధానం ఇచ్చింది కదా అనుకుంటాడు రిషి. వసుధార ఎదురుగా లేకుండా, ఫొటో చూడకుండా ఆ బొమ్మ ఇంత బాగా ఎలా గీయగలిగానో అనే ఆలోచన చేస్తూ ఉంటాడు.

  వసుధారను అవమానించిన సాక్షి

  వసుధారను అవమానించిన సాక్షి

  సీన్ కట్ చేస్తే ఇంటికి సాక్షి వచ్చి దేవయానిని కలుస్తుంది. ఏంటి ఇలా వచ్చావు అని అడిగితే మనసు బాగాలేదని అందుకే వచ్చి కలుద్దామని అనుకున్నాను అని చెప్తుంది. నిరాశ పడకుండా ఉండాలి అంటూ దేవయాని సాక్షికి హితబోధ చేస్తుంది. రిషి మనసులో ప్రేమ మొలకెత్తాలంటే చాలా టైం పడుతుంది. ఇలాంటి చిన్నచిన్న వాటిని భరించాలని ధైర్యం నూరిపోస్తూ ఉంటుంది.

  నీ మాటల్లో, లుక్స్‌లో అతనిమీద ప్రేమ కనిపించాలని ఆన్లైన్ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఇక వసుధారను కలవడానికి రెస్టారెంట్‌కు రిషి వెళ్తాడు. అప్పటికి వెయిటర్ డ్రెస్ లోనే ఉన్న వసుధారా మనం ఎక్కడికి వెళ్లాలి సార్ అని అడుగుతుంది వసుధార. చంద్రమండలానికి వెళ్లి వచ్చేద్దామని చెప్తాడు. దానికి నవ్వుతుంది. అయితే రిషిని ఫాలో అవుతూ వచ్చినా సాక్షి ఇదంతా చూస్తుంది.

  దీంతో ఇలాంటి చీప్ మనుషులతో రిషి తిరుగుతున్నాడని, ఇదేదో మాయ చేస్తుందని అనుమాన పడుతుంది. వసుధార అక్కడి నుంచి వెళ్లిన వెంటనే పర్మిషన్ కూడా అడగకుండా పక్కనే కూర్చుని రిషిని పలకరిస్తుంది సాక్షి. సీరియస్‌గా చూసిన రిషి... ముభావంగా హాయ్ చెప్పాడు. తను వచ్చింది కాఫీ కోసం కాదని.. నీకోసమే అని చెప్పింది సాక్షి. అది విన్నాక రిషి ఎందుకొచ్చిన గోల రా బాబు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  రిషికి వసుధార ప్రేమపాఠాలు

  రిషికి వసుధార ప్రేమపాఠాలు

  ఇంతలో అక్కడే కూర్చున్న సాక్షి చిటికేసి వసుధారను పిలుస్తుంది. పిలిచి పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తూ ఉండడంతో మర్యాద లేకుంటే ఇక్కడ నీకేమీ దొరకదు అని సాక్షికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. కాఫీ తీసుకు రమ్మంటే నా డ్యూటీ అయిపోయింది అని చెప్తుంది వసుధార. పొగరు చాలా ఎక్కువగా ఉంది అని సాక్షి అంటే అది పొగరు కాదని.. ఆత్మగౌరవం అని చెబుతుంది వసు.

  ఈసారి వచ్చినప్పుడు డబ్బులు పాటు కాస్త మర్యాద కూడా తీసుకురమ్మని చెప్పి వెళ్లిపోతుంది. ఇంతలో వసుకి రిషి నుంచి మెసేజ్ వస్తుంది. తరువాత వసుధారా రిషి ఒక చోట కలుస్తారు. అలా మాట్లాడుతూ సడెన్‌గా ఐల్‌వ్‌యూ చెబుతుంది. ఒక్కసారి అలా చెప్పేసరికి రిషికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

  వెంటనే విషయం అర్థం చేసుకున్నాను వసుధార... ఐలవ్‌యూ మేటర్ చెప్పాలని కవర్ చేస్తుంది. గౌతమ్‌ చెప్పిన లవ్‌ ప్రపోజల్‌ గురించి చెప్పడంతో అసలు గౌతమ్ ఎందుకు రిజెక్ట్‌ చేశావని అడుగుతాడు. చెప్పిన వెంటనే ప్రేమ పుట్టదు కదా అని ఎదురు ప్రశ్నిస్తుంది వసుధార.

  మరి ప్రేమ ఎప్పుడు పుడుతుందనీ అడిగితే. అది ఎప్పుడు ఎలా ఎవరిపై పుడుతుందో మనకు తెలియదని చెప్పేస్తుంది. నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని రిషి అడిగితే ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఒకవేళ ఉన్నా ఒక్కోసారి మనకే లేట్‌గా తెలుస్తుందని సమాధానం చెబుతుంది.

  రిషి ప్రేమలేఖను పట్టేసిన మహేంద్ర

  రిషి ప్రేమలేఖను పట్టేసిన మహేంద్ర

  మరి మీ మనసులో అని అడిగే సరికి నువ్వే చెప్పావుగా ఉన్నా తెలియదని... నేనూ చెక్‌ చేసుకోవాలని అంటాడు. వెళ్దామని ఇద్దరూ బయల్దేరబోతూ ఉండగా కారు బంపర్ కి వసుధార చున్నీ చిక్కుకుంటుంంది. తీస్తుంటే రాదు... చెప్పొచ్చు కదా అని వచ్చి దాన్ని తీస్తాడు రిషి. అ టైంలో రిషిని చూస్తూనే ఉండిపోయింది వసుధార. ఆ చున్నీ తీసే క్రమంలో ఆమె ఒంటి మీద ఉన్న చున్నీ కూడా డా లాగేస్తాడు.

  కాస్త సిగ్గుపడుతూ ఉండిపోతుంది వసుధార. సారీ చెప్పి ఆ చున్నీ ఇచ్చేస్తాడు. అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఇంటికి వెళ్ళిన తర్వాత రిషి అప్పట్లో రాసిన ప్రేమ లేఖ పట్టుకొని మాట్లాడుకుంటాడు. పక్కనే ఉన్న మహేంద్ర ఇదంతా చూసి అతను అలా వెళ్లగానే జగతిని తీసుకెళ్లి ఆ లెటర్ చూపిస్తాడు. ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత తన క్యాబిన్‌లో ఉన్న వసుధారతో మాట్లాడుతుంటాడు రిషి. కొన్ని ఫైల్స్ పడిపోతుంటే వసుధార పట్టుకుంటుంది. భలే క్యాచ్ చేశానంటున్న ఆమెతో వదులు కోవడం ఈజీ కానీ పట్టుకోవడం కష్టమంటాడు రిషి.

  English summary
  Guppedantha Manasu Episode 446: Sakshi gets worried as Rishi ignores her. Later, she warns Vasudhara to stay away from Rishi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X