Guppedantha Manasu: సాక్షి దెబ్బకు రిషి కొత్త ప్లాన్.. వసుతో ప్రేమ కథ?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే నివసిస్తూ ఉంటుంది. రిషి అనేకసార్లు ఆమె రూం కి వచ్చి వెళుతూ ఉండటంతో ఆమెకు రూమ్ అద్దెకిచ్చిన యజమానులు సహా బస్తీవాసులు ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను అనుమానించి అవమానించి మాట్లాడతారు. రిషి తన వల్ల బాధ పడినా అవమాన పడకూడదు అని ముఖం మీదే తలుపు వేసి మీరు వెళ్లిపోవాలని చెబుతుంది. తరువాత పరిస్థితుల్లో గౌతమ్ ఆమెకు ప్రపోజ్ చేయమని ఎంకరేజ్ చేస్తాడు. ఆమెకు ప్రపోజ్ చేస్తే ఆమె నో చెప్పి పంపుతుంది. ఆ తర్వాత ఆ ప్రపోజల్ విషయాన్ని రిషికి అర్థమయ్యేలాచెబుతుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దేవయాని స్కెచ్

దేవయాని స్కెచ్

అలా వసుధారతో మాట్లాడిన తర్వాత ఆమెను తన రూమ్ ఉన్న బస్తీలో డ్రాప్ చేసి
ఇంటికి వెళ్లిపోతాడు రిషి. ఇంటికి వెళ్ళాక ఏకాంతంగా కూర్చుని ఆలోచిస్తూ నాకెందుకు వసుధారతో ఉన్నంతసేపు ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అవుతుంది ఎందుకో అని భావిస్తాడు రిషి. వసుధార కూడా ఒంటరిగా కూర్చుని ఇదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది ఆమెకు కూడా దాదాపు అదే రకమైన ఫీలింగ్ కలుగుతుంది. ఇదిలా ఉండగా మరో పక్క బెడ్రూమ్‌లో జగతి, మహేంద్ర రిషి గురించి ఆలోచిస్తుంటారు. ఇప్పుడు సాక్షి వెనక్కి వచ్చింది, రిషికి ఏమో వసుధార మీద ఆసక్తి ఉంది ఈ విషయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే సాక్షి విషయంలో రిషితో మనం మాట్లాడితే దేవయానికి మనకు తేడా ఉండదని చెబుతుంది జగతి. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే దేవయాని ఎంట్రీ ఇస్తుంది.

ఏం చేయలేం అన్న మహేంద్ర

ఏం చేయలేం అన్న మహేంద్ర

వచ్చీరావడంతోనే నువ్వు ఈ ఇంటికి మహేంద్ర భారీగానే కాదు రిషి తల్లిగా కూడా వచ్చావ్ అని అంటూనే ఒకరకంగా నీ నీ 22 ఏళ్ల కల నెరవేరిందని, కానీ.. రిషి గురించి అసలు ఆలోచిస్తున్నారా లేదా అని అడుగుతుంది. అదే సమయంలో సాక్షి గురించి ఏం ఆలోచించారని కూడా అడుగుతుంది దేవయాని. దానిపై మాట్లాడకపోవడమే కరెక్టేనని అనుకుంటున్నట్టు, అది రిషి జీవితానికి సంబంధించిన విషయమని.. అందులో ఎవరి ప్రమేయం లేకుండా ఉంటే మంచిదని అంటుంది జగతి. ఆమె మాటలను మహేంద్ర సమర్ధిస్తాడు. ఎవరెవరి విషయంలో జోక్యం చేసుకుని రిషి విషయం పట్టించుకోరా అని దేవయాని వారిని రెచ్చ గొట్టేప్రయత్నంచేస్తుంది. దీంతో మహేంద్ర మాట్లాడుతూ గతంలో రిషి సాక్షి ఇద్దరికీ నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే అయితే వాళ్లిద్దరూ ఒకరి నొకరు వద్దనుకుని వెళ్లిపోయారు.

జగతి మాస్టర్ ప్లాన్

జగతి మాస్టర్ ప్లాన్


ఇప్పుడు ఆమె వెనక్కి వచ్చినంత మాత్రాన రిషి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు.అయితే రిషి మనసులో ఏముందో తెలియదు కానీ.. సాక్షికి ఈ ఇంటికి కోడలు అయ్యే అర్హత ఉందని మరోసారి నొక్కి వక్కాణిస్తుంది దేవయాని. పనిలో పనిగా వసుధారను రిషికి దూరంగా ఉంచమని జగతిని వార్నింగ్ కూడా ఇస్తుంది. సాక్షితో రిషికి పెళ్లి చేస్తానంటూ వాళ్ళిద్దరికీ చెప్పి వెళ్లిపోతుంది. రిషి, సాక్షి పెళ్లికి మనల్ని దేవయానికి వాడుకోవడానికి చూస్తోందని.. దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని చెబుతూనే జగతి, ఈ సమస్యను పరిష్కరించడానికి మహేంద్రకి ప్లాన్ చెబుతుంది. మరోపక్క బెడ్రూమ్‌లో వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. పక్కనే ఉన్న లవ్ లెటర్ చూస్తాడు. గౌతమ్ తన కోసం ఒక ప్రేమ లేఖ రాయాలని అడగడంతో, ఎప్పుడూ ఓ కవిత కూడా రాయని నేను ప్రేమ లేఖ ఎలా రాశానో అనుకుంటూ పాత సంగతులు అని గుర్తు చేసుకుంటాడు. అసలు ప్రేమ లేఖ ఇలానే రాస్తారా అని అనుకుంటాడు రిషి.

ఫణీంద్ర పంచాయితీ

ఫణీంద్ర పంచాయితీ

అక్కడే నిలబడి వింటున్న మహేంద్ర రిషి పక్కకు వెళ్ళగానే వెళ్లి ఆ లేఖ చూస్తాడు. జగతిని కూడా తీసుకొచ్చి ఆ లెటర్ చూపిస్తాడు. ఆ లెటర్ చూసిన జగతికి కాలేజీలో జరిగిన లవ్ లెటర్ సీన్ గుర్తుకు వస్తుంది. అంటే అది రిషి రాశాడా అని ఆశ్చర్యపోతుంది జగతి. ఉదయాన్నే రిషి రెడీ అయి బయటకు వెళ్తుంటాడు... ఫణీంద్ర ఆపి అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏమిటి అని అడిగితే కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయి కదా క్వశ్చన్ పేపర్లు సెట్ చేయాలి అంటూ వెళ్ళబోతాడు. దేవయాని కల్పించుకుని కాలేజీలో మహీంద్రా, జగతి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్లకి ఎందుకు ఇలాంటి పనులు అప్పగించవు, అని అడుగుతుంది. అదే సమయంలో పనిలో పనిగా సాక్షి వాళ్ల నాన్న గారు కాల్ చేశారు అని ఆమె విషయం ప్రస్తావిస్తాడు ఫణీంద్ర. ఆ టాపిక్‌లో ఏం మాట్లాడలేనని చెప్పి వెళ్లిపోతాడు రిషి. రిషి కాలేజ్ కు వెళ్ళేసరికి రిషి క్యాబిన్ సర్దుంటుంది వసుధార. ఏంటి ఈ పని చేస్తున్నావు అంటే, మీకు సంబంధించిన ఏ వర్క్‌ చేయాలన్నా ఆనందమే అనిఅంటుంది వసుధార.

సాక్షి కోసం రిషి కొత్త ప్లాన్

సాక్షి కోసం రిషి కొత్త ప్లాన్


సరే నేను కూడా హెల్ప్ చేస్తానంటూ లేస్తాడు. ఇంతలో ఫైల్స్ పడిపోతుంటే వసుధార పట్టుకుంటుంది, సరిగ్గా అదే టైంలో రిషి కూడా పట్టుకుంటాడు. వసుధార భలే క్యాచ్ చేశానంటూ మురిసిపోతుంది. వదులు కోవడం చాలా ఈజీ కానీ పట్టుకోవడం చాలా కష్టమనీ అంటాడు రిషి. ఇంతలో సాక్షి కాలేజీకి రావడాన్ని రిషి చూసి వసును చెయ్యి పట్టుకుని బయటకు తీసుకు వెళ్ళడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది. కమింగ్ ఎపిసోడ్ లో చూపిస్తున్న దాని ప్రకారం కాలేజీ నుంచి వసుధారను బయటకు తీసుకువెళ్లి నా అయిష్టాన్ని దూరం చేసేందుకు హెల్ప్ చేయమంటాడు రిషి. ముందు ఆమె కాస్త మొహమాట పడడంతో వెనక్కి వెళ్ళి పోతూ ఉండడంతో ఆమె రిషి చేయి పట్టుకుని మీ అయిష్టాన్ని దూరం చేయడానికి ఏమైనా చేస్తానంటుంది వసుధార.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X