twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Guppedantha Manasu: దుఃఖంలో ఉన్న వసుధార కోసం రిషి స్కెచ్.. దెబ్బకు కౌగిల్లో చేరిందిగా!

    |

    స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడే నివసిస్తూ ఉంటుంది. రిషి అనేకసార్లు ఆమె రూం కి వచ్చి వెళుతూ ఉండటంతో ఆమెకు రూమ్ అద్దెకిచ్చిన యజమానులు సహా బస్తీవాసులు ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను అనుమానించి అవమానించి మాట్లాడతారు. రిషి తన వల్ల బాధ పడినా అవమాన పడకూడదు అని ముఖం మీదే తలుపు వేసి మీరు వెళ్లిపోవాలని చెబుతుంది.

    తరువాత పరిస్థితుల్లో గౌతమ్ ఆమెకు ప్రపోజ్ చేయగా ఆమె నో చెప్పి పంపుతుంది. ఆ తర్వాత ఆ ప్రపోజల్ విషయాన్ని రిషికి చెప్పగా రిషి సాక్షి నుంచి తప్పించుకోవడం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా వసుధారను కోరతాడు. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    చదువు మీద దృష్టి

    చదువు మీద దృష్టి

    తన క్యాబిన్లో సహాయం చేయడానికి వచ్చిన వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి. ఇంతలోనే ఆమె తన క్యాబిన్ లో వస్తువులు సర్దుతూ ఉండడంతో ఈ పనులు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ చదువు మీద శ్రద్ధ పెట్టాలని అసలు చదువు ఎలా సాగుతుంది అంటూ ఆరా తీస్తాడు.

    అయితే ఆమె కూడా తాను అన్ని విషయాల కంటే ఎక్కువగా చదువు మీద దృష్టి పెడతానని, గాలి పీల్చుకోవడం అయినా మానతాను ఏమో కానీ చదువు సంగతి మాత్రం మర్చిపోను అని చెబుతోంది. ఇలా వారి మధ్య సంభాషణ జరుగుతున్న సమయంలోనే అసలు మనసులో నా గురించి వసుధార ఏమి అని ఆలోచిస్తుంది అని తెలుసుకోవాలనుకుంటాడు రిషి.

    వసుధార కౌంటర్

    వసుధార కౌంటర్

    అదే సమయంలో పై నుంచి ఒక హార్ట్ సింబల్ ఉన్న బొమ్మ కింద పడితే అది ఏంటని అడుగుతుంది వసుధార. అది హార్ట్ అని రిషి చెప్పడంతో, జాగ్రత్త మళ్లీ కింద పడిపోతుంది అని ఆమె కౌంటర్ వేస్తుంది. ఆ సమయంలో ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను అని చెబుతూ ఉండగా కాలేజీలోకి సాక్షి వస్తున్న విషయం అర్థం చేసుకుంటాడు.

    వెంటనే ఆమెను తీసుకుని కాలేజీలో ఉన్న లైబ్రరీకి తీసుకెళ్లి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. కాలేజీ లోపలికి వచ్చిన సాక్షి రిషి ఎక్కడ ఉన్నాడు అని కాలేజీ సిబ్బందిని ఆరా తీయగా కాలేజీలో లేడనే విషయం తెలుస్తుంది. వెంటనే కాల్ చేయడం తో మొదటి సారి కాల్ కట్ చేస్తాడు రిషి.

    ఒక జీవితం

    ఒక జీవితం

    ఆమె మళ్లీ వదలకుండా ఫోన్ చేయడంతో ఇక స్విచాఫ్ చేయడం బెటర్ అని భావించి ఫోన్ స్విచాఫ్ చేస్తాడు. సాక్షి మాత్రం నువ్వు ఎంత దూరం పెట్టాలని చూస్తే అంత దగ్గర అవుతాను అంటూ మనస్సులోనే అనుకుంటూ ఇంటికి బయలు దేరి వెళ్ళి పోతుంది. వసుధారను కారులో ఎక్కించుకుని బయటకు తీసుకు వెళ్ళిన రిషి ఒక చోట ఆపి కిందకు చెబుతాడు.

    దిగిన తర్వాత ఇష్టానికి, అయిష్టానానికి మధ్య తేడా ఏమిటి అని అడిగితే అందరూ ఒక అక్షరమే తేడా అనుకుంటారు కానీ అసలు తేడా ఒక జీవితం అని అంటుంది. అదేమిటి అంటే ఇష్టమైతే ఎంత కష్టమైన పనినైనా ఈజీగా చేస్తామని, ఇష్టం ఉంటే ఎంత చిన్న పని అయినా చేయలేము అని చెప్పుకొస్తుంది.

    సాయం చేసేందుకు సిద్దం

    సాయం చేసేందుకు సిద్దం

    అది విన్న రిషి చాలా గొప్పగా చెప్పావు వసుధార ఈ సమాధానం విన్న తరువాత నాలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయింది నీకు తెలియకుండానే ఒక గొప్ప ప్రశ్నకు అద్భుతమైన సమాధానం చెప్పావని చెబుతాడు. ఏంటి ఎందుకు అన్ని వివరాలు అడగకుండా నాకు ఒక మాట ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూనే కండిషన్ పెడతాడు.

    అలా అంటూనే నా అయిష్టాన్ని దూరం చేయడం కోసం నువ్వు సాయం చేస్తావా అని అడుగుతాడు. అయితే ఆమె ఆలోచించుకుంటూ ఉండడంతో ఇక కరెక్ట్ కాదని భావించి కార్లో కూర్చోవడం కోసం వెనక్కి తిరుగుతాడు. రిషి అలా వెళ్ళి పోతూ ఉండడంతో చేయి పట్టుకుని ఆపిన వసుధార అలాంటి పరిస్థితి రాకూడదని కోరుకుంటానని, ఒకవేళ మీ మనసుకు నచ్చనీ విషయాలు ఎదురైతే గనుక మీ అయిష్టాన్ని దూరం చేసే విషయంలో ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాను అని కూడా ఇస్తుంది.

    తనకు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడం కోసం పార్టీ చేసుకుందామని అంటే ఆమె తన బ్యాగ్ నుంచి ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ తీస్తుంది, అది రిషికి ఇవ్వడంతో రిషి థాంక్స్ చెప్తాడు.

    రిషి ప్రేమలేఖ

    రిషి ప్రేమలేఖ

    మరోపక్క జగతి మహేంద్ర ఇద్దరూ కలిసి వచ్చి వసుధార రూమ్ లో కూర్చుని ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆమె పుస్తకాలు కదిలిస్తూ ఉంటే అక్కడ కూడా ఒక లవ్ లెటర్ కనిపించడమే కాక రిషి రూమ్ లో కనిపించిన లవ్ లెటర్ లాగానే ఉండటంతో వాళ్లను ఇమిటేట్ చేసి సరదాగా కాసేపు నవ్విస్తాడు మహేంద్ర. ఆ తర్వాత రిషి గీసిన బొమ్మను గౌతమ్ వసుధారకు గిఫ్ట్ గా ఇస్తే అది కూడా చూసి ఇద్దరూ దొంగలే అనుకుంటూ జగతి సరదాగా మాట్లాడుతుంది.

    ఇంతలో వసు రావడంతో జగతి మహేంద్ర కాసేపు మాట్లాడుతారు. అదే సమయంలో తనకు గౌతమ్ ప్రపోజ్ చేసిన విషయాన్ని జగతికి చెబుతుంది వసుధార. నీకు దేవుడు తెలివి ఇచ్చాడని అదే నీకు బలమని వసుధారతో అంటుంది జగతి. తరువాత నీకు ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పి రిషి గదిలో ప్రేమలేఖ ఫోటో తీసి పంపిస్తుంది. దీంతో అది చూసిన వసుకు టెన్షన్ పెరుగుతుంది .

    మనసుకు దగ్గరైంది

    మనసుకు దగ్గరైంది


    తర్వాత బయలుదేరిన జగతి, మహీంద్రా వీరిద్దరి దాగుడుమూతలు ఇంకెంత కాలం ఎప్పుడో ఎవరో ఒకరు బయట పడాలి కదా అనుకుంటారు. ఇక అక్కడితో తాజా ఎపిసోడ్ ముగించారు. రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం వసుధార ఇంట్లో చదువు నేర్చుకోవడం కోసం వచ్చిన ఒక పిల్లవాడు ఆమె స్కెచ్ తీసుకువెళ్ళి అందరికీ చూపిస్తానని పరిగెట్టడంతో వెంట పడుతుంది వసుధార. కంగారులో ఆ స్కెచ్ చిరిగిపోవడంతో వసుధార బాధపడుతుంది. ఎవరో ఊరూపేరూ లేని వాళ్ళు గీసిన బొమ్మ చిరిగిపోతే ఎందుకంత బాధపడుతున్నావు అని అడిగితే, గీసింది ఎవరైనా కావచ్చు కానీ అది నా మనసుకు దగ్గరైంది అంటూ వసుధార చెబుతుంది.

    English summary
    Guppedantha Manasu Episode 449: Vasudhara gets emotional as the kids ruin her art. Later, she feels elated as Rishi surprises her with another sketch of her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X