For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: రిషికి వసుధార కౌగిలింతల షాక్.. సాక్షి గాలి తీసేసిన జగతి!

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ నివసిస్తూ ఉంటుంది. రిషి అనేకసార్లు ఆమె రూంకి వచ్చి వెళుతూ ఉండటంతో ఆమెకు రూమ్ అద్దెకిచ్చిన యజమానులు సహా బస్తీవాసులు ఇంటి దగ్గరకు వచ్చి ఆమెను అనుమానించి అవమానించి మాట్లాడతారు. దీంతో రిషిని ఇంటికి రావద్దని చెప్పేస్తుంది. ఆ తరువాత రిషి సాక్షి నుంచి తప్పించుకోవడం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా వసుధారను కోరతాడు. ఆమె అందుకు ఒప్పుకుంటుంది. ఇక ఒక బాబుతో రిషి తాను వేసిన స్కెచ్ వసుధారకు పంపిస్తాడు. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  వసుధార స్కెచ్ తెచ్చిన బాబు ఇక్కడే ఉన్నాడు, వాడిని అడిగితే ఎవరు తెచ్చి ఇచ్చారో తెలుస్తుంది అనుకుని అతనిని అడుగుదామని అంటుంది. రిషి ఆ బుడ్డోడు వెళ్ళిపోయాడు అనుకుంటాడు. కానీ విషయం అర్ధం కావడంతో ఇప్పుడు వీడు నన్ను చూశాడు అంటే కొంపముంచుతాడని భావించి వసుధారను అడ్డుకునే ప్రయత్నం చేసినా, ఎన్ని చెప్పినా వసుధార ఆగదు.. వెళ్లి అడుగుతుంది. వెంటనే రిషి కూడా వెళ్లి పక్కనే నిలబడడంతో చూసి ఆయనను విష్ చేస్తాడు ఆ బాబు. ఆ బాబుని ఏదో ఒకటి చెప్పి పంపించేయాలని విఫలయత్నం చేస్తాడు. ఇంతలో వసుధార ఆ బొమ్మ ఇచ్చిన వ్యక్తి నీకు తెలుసా అని అడుగుతుంది. వాడు చెప్పే లోపు వసుధారను టెన్షన్ పెట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆమె వచ్చే లోపు ఆ బాబుని కూడా పంపించేస్తాడు.

  Guppedantha Manasu Serial Today Episode May 14th

  మరోపక్క తన రూమ్ లో కుర్చుని ఆలోచిస్తూ ఉన్న జగతి వద్దకు సాక్షి వస్తుంది. రిషిని కలుద్దామని వచ్చానని అయితే అంతకు ముందు మిమ్మల్ని కలుద్దామని వచ్చానని చెప్తుంది. అయితే బాగానే అర్థం చేసుకున్నావని జగతి అనడంతో నేను అందర్నీ అర్థం చేసుకున్నాను కానీ... నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటుంది, దీంతో జగతి కూడా మనల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదంటే ఎదుటి వాళ్ల లోపం కంటే మనలో ఏదో లోపం ఉందని అంటుంది. ఇక మహేంద్ర గారిని మా పేరెంట్స్ కలుద్దామని అనుకుంటున్నారని... ఆ విషయాన్ని ఆయనతో చెప్పాలని సాక్షి చెప్పడంతో, ఏమీ అనుకోవద్దు నువ్వే చెప్పమని అంటుంది. నేను చెప్తే ఓ రకంగా ఉంటుంది, నువ్వు చెబితే మరో రకంగా ఉంటుంది. ఇలాంటివి నేరుగా వ్యక్తికి చెబితే బాగుంటుందని జగతి చెప్పేస్తుంది. రిషి కోసం ఇలా నైట్ రావద్దని అంటుంది.

  అదేంటి అంటే రిషి చిన్నపిల్లాడు కాదని.. కాలేజీ ఎండీ అని... తనకు ఎన్నో పనులు ఉంటాయని అలసిపోయి ఉంటాడని అందుకే ఈ టైంలో వచ్చి కలవడం బాగోదని, పొద్దున వచ్చి కలిస్తే బాగుంటుందని సలహా ఇస్తుంది జగతి. మరి పొద్దున్న వచ్చాక కలకపోతే ఏం చేయాలని సాక్షి అడుగుతుంది. అలా కలవడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు రావడం మానేయాలని అంటుంది జగతి. మరోపక్క వసు కోసం వెయిట్ చేస్తూ కారులో కూర్చొని వసుధార, స్కెచ్ గురించి ఆలోచిస్తుంటాడు రిషి. ఇంతలో పువ్వులు అమ్మే వ్యక్తి వచ్చి పువ్వులు కొనమంటుంది. నాకు పెళ్లి కాలేదు నాకెందుకు అంటే పెళ్లి కాకుంటే మనసులో ఉన్న వ్యక్తికి ఇవ్వండని సలహా ఇవ్వండి. మాటల్లో చెప్పలేనివి ఈ పువ్వులు చెప్తాయని వివరిస్తుంది.

  అయితే నాకు వద్దని అంటుంటే నాకు బేరాల్లేవని ఆమె అంటుంది. అయతే రిషి డబ్బులు ఇవ్వబోతాడు, కానీ ఆమె పువ్వులు తీసుకుంటేనే డబ్బులు తీసుకుంటానని చెబుతుంది. అయితే పూలు కేజీ ఇమ్మంటే నవ్వి, ఇవి మూరలు లెక్క ఇస్తామని చెప్పి ఇస్తుంది. ఇంతలో వసు వస్తూ రిషి సార్‌కి ఈ స్కెచ్ తో ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తు పైకి అనడంతో ఆ పక్కనే ఉన్న రిషి అందులో నాకేం సంబంధం లేదు అంటాడు. ఈ బొమ్మ తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు తిరగడం ఏంటి అని ముఖం మీద కాస్త కటవుగా అడుగుతాడు రిషి. దానికి ఆమె తనదైన శైలిలో సమాధానం చెబుతుంది.

  కన్విన్స్ అయిన రిషి ఈ బొమ్మ గీసిన వ్యక్తి ఎదురు పడితే ఏం చేస్తావు అని అడుగుతాడు. రిషిని గట్టిగా హగ్ చేసుకుని, థాంక్యూ సార్‌..నన్ను చూడకుండానే ఇంత బాగా గీశారు. అని చెప్తానని చెబుతుంది వసుధార. ఒకవేళ ఆ బొమ్మ గీసింది నేనే అయితే అని అడిగితే మీకంత సీన్ లేదన్నట్టు చెబుతుంది. ఇక అలా అంటూ ఉండగా నేటి ఎపిసోడ్ ముగుస్తింది. కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి కారులో వెళ్తున్న వసుధార.. మల్లెపూల సంగతి పసిగడుతుంది. కారు దిగుతూ ఆ పువ్వులు తీసుకుంటానని చెబుతుంది. ఆ పెద్దావిడ చెప్పినట్టు ఎవరికి చేరాలో వాళ్లకు చేరతాయనే మాటలు గుర్తు తెచ్చుకుని రిషి ఆశ్చర్యపోతాడు.

  English summary
  Guppedantha Manasu Episode 450: Rishi gets tensed as Vasudhara questions the kid about the artist. Later, Rishi and Vasudhara share a beautiful moment.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  Desktop Bottom Promotion