Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Guppedantha Manasu: రిషితో పంచాయతీ పెట్టించిన సాక్షి.. ఆ ఫొటోలతో ఇరికించడంతో షాక్.. ఇంతలో?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ యూత్ సహా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా సాగుతోంది. గత కొద్ది ఎపిసోడ్స్ నుంచి వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ బస చేస్తూ ఉంటుంది. రిషి అనేకసార్లు ఆమె రూంకి వచ్చి వెళుతూ ఉండటంతో ఆమెకు రూమ్ అద్దెకిచ్చిన యజమానులు ఆమెను అనుమానించి అవమానించి మాట్లాడతారు. దీంతో రిషిని ఇంటికి రావద్దని చెప్పేస్తుంది.
ఆ తర్వాత రిషి సాక్షి నుంచి తప్పించుకోవడం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా వసుధారను కోరతాడు. ఇలా సాగుతూ ఉన్న క్రమంలోనే వసుధారకు రిషి తాను వేసిన స్కెచ్ పంపిస్తాడు. అది ఎవరు గీశారో కనుక్కుంటానని వసుధార శపథం చేస్తుంది. ఆమె స్కాలర్ షిప్ టెస్ట్ గురించి జగతి మేడమ్ తో రిషి మాట్లాడుతూ ఉండగా సాక్షి నేరుగా రిషి కాబిన్ కు వస్తుంది. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

న్యూసెన్స్ చేయొద్దని
కాలేజీలో తన క్యాబిన్ కు ఇలా సాక్షి నేరుగా సాక్షి రావడం ఏమాత్రం ఊహించని రిషి ఆమె మీద తీవ్ర స్థాయిలో సీరియస్ అవుతాడు. అసలు లోపలకు ఎందుకు వచ్చావు? కాలేజీలోకి ఎందుకు వచ్చావని అడగడమే కాక అటెండర్ ను పిలిచి తన పర్మిషన్ లేకుండా ఎవరినీ లోనికి రానీయవద్దని రిషి చెప్పడంతో సాక్షి షాక్ అవుతుంది.
ఏంటి నన్ను ఇలా అవమానిస్తున్నావు అని అడిగితే ఆమె మీద సీరియస్ అయిన రిషి, జగతితో మాట్లాడుతూ వసుధార చదువు సంగతి చూడాలని చెప్పి తర్వాత అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. ఇక సాక్షి కూడా ఆయన వెనుకే వెళ్తుంటే... జగతి ఆమెను వెంటనే ఆపేస్తుంది.
రిషి కోపంగా ఉన్నాడని, నువ్వు అతని వెనుక వెళితే అది మరో తలనొప్పి అని వెళ్ళవద్దు అని అంటుంది. ఇది కాలేజీ దయచేసి ఇక్కడ న్యూసెన్స్ చేయొద్దని సాక్షికి చెబుతుంది జగతి. అయితే ఇక్కడ కలవడం ఎందుకు అంటే రిషి ఎక్కడా కలవడం లేదు, ఇంటికి వెళితే అక్కడా ఏదో ఒక వంక చెబుతున్నాడు.

స్కాలర్ షిప్ టెస్ట్ కోసం
నాకు రిషిని ఎక్కడ కలావాలో అర్థం కావడం లేదని జగతితో అంటుంది సాక్షి. ఇలా చేస్తున్నా మీరంతా రిషిని ఎవరి కోసం సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు అని అంటుంది సాక్షి. అలా అంటూ ఉన్న సమయంలోనే అక్కడికి మహేంద్ర వస్తాడు. ఏమైంది అని అడిగితే జరిగిన విషయం చెప్పి ఇంత చేస్తున్నా మీరు రిషినే సపోర్ట్ చేస్తారని తెలుసు.
అయినా సరే ఈ విషయంలో రిషిని ఎవరు సపోర్ట్ చేసినా.. తాను మాత్రం రిషిని వదులుకునే ప్రసక్తే లేదని సాక్షి తేల్చి చెబుతుంది. ఇవన్నీ కాలేజీలో ఎందుకని అన్నా సరే.. ఎవరు ఎన్ని చెప్పినా రిషిని కలుస్తూనే ఉంటానని, కలిసే ప్రయత్నం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక కట్ చేస్తే కాలేజీ క్లాస్ రూమ్‌లో కూర్చున్న వసుధార తన బుక్‌లో ఉన్న జగతి పంపిక లవ్ లెటర్ తీసి చదువుకుంటుంది. ఇంతలో వచ్చిన రిషితో తాను కొన్ని ప్రశ్నలు స్కాలర్ షిప్ టెస్ట్ కోసం ప్రిపేర్ అయ్యానని ఆమె చెబుతుంది. దీంతో రిషి వెంటనే నువ్వు ప్రిపేర్ అయిన బుక్ తీసుకురమ్మంటాడు.

లవ్ లెటర్ పడి
అదే సమయంలో కాస్త ఆనందంగా అనిపించడంతో సాక్షిని చూస్తే చిరాకుగా... వసుధారను చూస్తే ఆనందంగా ఎందుకు ఉంటుంది అని రిషి తన మనసులో తనను తానే క్వశ్చన్ చేసుకుంటాడు రిషి. నువ్వు నాకో రిలీఫ్ జోన్‌వని వసుధారను చూస్తూ అనుకుంటాడు. ఇంతలో ఇంటికి వెళ్లి కాలేజీలో జరిగిన వ్యవహారం గురించి దేవయానికి పూసగుచ్చినట్టు వివరిస్తుంది సాక్షి.
చాలా అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన ముందు వసుధార పరీక్ష గురించి జగతితో మాట్లాడిన సంగతి కూడా దేవయానితో చెబుతుంది. అయితే ఎన్ని అవమానాలు జరిగితే అంత పంతం పెరుగుతుంది, అంత పట్టుదల వస్తుంది అంటూ ఆమెను దేవయాని మరింత మోటివేట్ చేస్తుంది.
మరోపక్క రిషి తీసుకుంటున్న క్లాస్ అయిపోతుంది. అంతా వెళ్లిపోయాక రిషికి తాను ఇచ్చిన తన బుక్ తీసుకుటుంది వసుధార. అయితే అలా తీసుకుంటున్న సమయంలో అందులో పెట్టుకున్న లవ్ లెటర్ పడిపోతుంది.

బొమ్మ గీసింది ఎవరు?
ఆది ఏమిటా అని కిందకు వంగి తీసి మరీ రిషి చూస్తాడు. ఇదేంటి ఇది అని చూసిన వెంటనే షాక్ అవుతాడు. గతంలో అది జగతి మేడం చింపిన ప్రేమలేఖ అని అర్థం చేసుకుని ఏంటిది అని అడుగుతాడు. ఇది నీ వద్దకు ఎలా వచ్చింది అని అడుగుతాడు రిషి. అయితే వెంటనే వసుధారను జగతి మేడం మొబైల్ నుంచి పంపించారని, తాను దాన్ని ప్రింట్ తీసుకున్నట్టు చెబుతుంది.
అయితే తాను అతికించి తన రూమ్‌లో పెట్టుకున్న లెటర్ ఎలా వచ్చిందని ఆలోచిస్తాడు. ఈ క్రమంలో లెటర్ రాసింది ఎవరు? బొమ్మ గీసింది ఎవరు? అని కనిపెడతానంటుంది వసుధార. అయితే అవన్నీ తరువాత ముందు ఎగ్జామ్ ఉంది కదా దాని మీద దృష్టి పెట్టమని చెప్పి వెళ్లిపోయాడు రిషి. రిషి ఇంటికి వచ్చే సరికి సాక్షి వాళ్ల పేరెంట్స్ వచ్చి ఫణీంద్ర, మహేంద్ర, దేవయాని, జగతిలతో మాట్లాడుతూ ఉంటారు.
పెళ్లి చేయాలి, అలా చేయాలి అంటే ఏం చేయాలి? అసలు సమస్య ఏంటో? అని ఆలోచిస్తూ ఉండగా సమస్య బయటే ఉంది, ఇంట్లో లేదని చెబుతుంది సాక్షి. ఆ రోజు రిషిని కాదని నేను వెళ్లిపోయానని.. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ రిషి ప్రయార్టీ మారిపోయిందని సాక్షి అంటుంది.

రూమ్ లో కలిసి ఉన్నప్పుడు
రిషి కూడా మారిపోయాడని ఆమె అంటుంది. అప్పుడే వచ్చిన రిషి నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దని ఆమెతో అంటాడు. ఇక్కడెవరూ మారిపోలేదని, ఇప్పుడు అనవసరంగా ఈ చర్చ పెంచ వద్దు అని అంటాడు. మన విషయం మాట్లాడటానికి పెద్దలు వచ్చారు అని సాక్షి అంటే అసలు మన విషయంలో మాట్లాడడానికి ఏముందని ప్రశ్నిస్తాడు.
మాట్లాడటానికి కూడా టైం ఇవ్వడం లేదని సాక్షి అంటే నేను బిజీగా ఉంటాని.. అందుకే మాట్లాడటం లేదని రిషి అంటుండగా నాకు తప్ప ఎవరెవరికో టైం ఇస్తావని... వసుధార పేరు తెర మీదకు తెస్తుంది. ఇక ఆ మాట అనడంతో అక్కడ ఉన్న అందరూ షాక్ అవుతారు. దీంతో తాజా ఎపిసోడ్ ముగించారు. ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం నువ్వు వసుధార కోసం పరితపిస్తున్నావని... ఆమెను ప్రేమిస్తున్నావని సాక్షి అంటుండగా, అందరి ముందు చిన్నతనం ఫీలయిన రిషి, షట్ అప్ అని గట్టిగా అరిస్తే, తాను రిషి-వసుధారా రూమ్ లో కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటోలు చూపిస్తుంది సాక్షి. సరిగ్గా అదే సమయంలో సార్ అంటూ వసుధార వస్తుంది. ఈ సమయంలో వసుధార ఎందుకు వచ్చింది అని రిషి భావిస్తాడు.