For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: సాక్షికి జగతి షాకింగ్ కౌంటర్.. వసు- రిషి మధ్య దేవయాని చిచ్చు

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ యూత్ సహా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా ముందుకు వెళుతోంది. గత కొద్ది ఎపిసోడ్స్ నుంచి ఎక్కువగా వసుధార రిషి మధ్య ప్రేమను హైలైట్ చేస్తున్నారు. రిషి సాక్షి నుంచి తప్పించుకోవడం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా వసుధారను కోరతాడు. దానికి ఆమె సరే అంటుంది. వసుధార స్కాలర్ షిప్ టెస్ట్ గురించి జగతి మేడమ్ తో రిషి మాట్లాడుతూ ఉండగా సాక్షి నేరుగా రిషి కాబిన్ కు వస్తుంది. అలా రావడం కరెక్ట్ కాదని ఆమెను మందలించడంతో ఆమె రిషి ఇంట్లో తన తల్లితండ్రులతో పంచాయితీ పెడుతుంది. ఇక అలా గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

  పంచాయితీ పెట్టించి

  పంచాయితీ పెట్టించి

  తన తల్లిదండ్రులతో కలిసి రిషితో అసలు విషయం ఏమిటో తేల్చడాని కోసం పంచాయితీ పెట్టడంతో రిషి ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటాడు. అయితే ఇదే సమయంలో సాక్షి గొడవ మధ్యలో వసు విషయాన్ని ప్రస్తావిస్తుంది. 'నువ్వు ఆ వసుధార స్నేహం కోసం తహతహలాడుతున్నావ్.. నువ్వు ఆ వసుధరని ఇష్టపడుతున్నావ్.. కోరుకుంటున్నావ్.. ప్రేమిస్తున్నావ్' అంటూ సాక్షి అనడంతో 'షటప్ సాక్షి.. షటప్.. నీకు నేను దక్కనని తెలిసి పోయాక.. నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి ఇంకెవరినో బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. 'నేను మాట్లాడటం తప్పైతే మరి ఇవేంటీ?'అంటూ వసు, రిషి కలిసి ఉన్నప్పుడు దేవయానితో కలిసి తను తీసిన ఫొటోలు చూపిస్తుంది. ఇది చూశాక కూడా మీ ఇద్దరి మధ్యా ఏం లేదు అంటే మేము నమ్మాలా.?' అని సాక్షి అడుగుతుంది.

  ఫొటోలు బయట పెట్టడంతో

  ఫొటోలు బయట పెట్టడంతో

  అయితే ఆ ఫోటోలు చూశాక రిషి ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోతాడు. దీంతో జగతి కలుగజేసుకుంటుని సాక్షి ఇక ఆపుతావా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇన్నేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావా? ఇప్పుడు రిషి నీకు దక్కడం లేదని రిషి వ్యక్తిత్వాన్ని ఇలా తప్పుగా చిత్రీకరించవద్దు. ఇన్నాళ్లుగా నీకు గుర్తు రాని రిషి సడన్‌గా ఎందుకు గుర్తొచ్చాడు? రిషిని మిస్ అయ్యాను అంటావా? రిషిని మిస్ అయితే వారానికో నెలకో తెలుస్తుంది కదా ఆ విషయం.. సంవత్సరం తర్వాత మిస్ అయ్యానని తెలిసిందా? ఒకప్పుడు తనని కాదు అని వెళ్లిన నీకు తనని ప్రశ్నించే హక్కు లేదు అని అంటుంది జగతి కోపంగా ఆంటీ మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు?' అని సాక్షి అడిగితే, నేను రిషికి ఏం అవుతానో నీకు తెలుసు, నాకు మాట్లాడే హక్కు ఉంది. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడుతున్నానో నా అర్హతేంటో ఇక్కడ అందరికీ తెలుసు అంటుంది జగతి.

  జగతి ఫైర్

  జగతి ఫైర్

  మారింది రిషి కాదు.. నువ్వు.. నీ ఆలోచనలు మారాయి.. సడన్‌గా నీ గోల్ మారింది. అది ఎందుకో.. ఎవరి ప్రోత్సాహమో నాకు బాగా తెలుసు అని జగతి సాక్షితో అంటుంది. అయితే రిషి మనసులో వసుధార లేనప్పుడు నన్ను యాక్సెప్ట్ చేయొచ్చు కదా? రిషి మనసులో వసుధార స్థానం ఏంటి? ఒక వేళ నిజంగా రిషి చెబుతున్నట్లు అలాంటిది ఏమి లేకపోతే తన మనసులో నాకు స్థానం ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాను' అని రచ్చ రేపుతుంది సాక్షి. 'అవును రిషి.. నీకు వసుధార మీద వేరే ఉద్దేశం లేనప్పుడు.. కేవలం తను నీ స్టూడెంట్టే అయినప్పుడు ఆ విషయం చేతుల్లో చూపించు నాన్నా..' అంటూ ప్రేమగా రెచ్చ గొడుతుంది దేవయాని. ఇదంతా ఇలా జరుగుతూ ఉన్న సమయంలోనే సరిగ్గా వసు ఇంటికి వచ్చి గుమ్మం దగ్గర నుంచి సార్ అని పిలుస్తుంది.

  వాసు ఎంట్రీ

  వాసు ఎంట్రీ

  ఈ దెబ్బతో లోపల ఉన్న వారందరూ కూడా షాక్ అయిపోతారు. 'వసుధార ఇప్పుడు ఎందుకొచ్చింది?' అంటూ టెన్షన్ పడతాడు రిషి. వెంటనే వసు దగ్గరకు జగతి వెళ్లిపోతుంది. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి.. రండి డాడీ వెళ్దాం అంటూ సాక్షి వసుని గుర్రుగా చూసి వెళ్లిపోతుంది. అసలు ఆవిడ ఎవరో కూడా ఇప్పటి వరకు తెలియని వసుధార అసలు ఈవిడ ఎవరు? ఇక్కడుందేంటీ? ఈమెకి రిషి సార్ కుటుంబానికి సంబంధం ఏంటీ? అనుకుంటుంది. రిషి ఈ వ్యవహారంతో మనసు బాధ పడడంతో అలాగే పైకి వెళ్లిపోతాడు. వసు కూడా ఆయన వెనుకే వెళ్లడంతో రిషి వసు మీద అరుస్తాడు. వచ్చే ముందు చెప్పే పనిలేదా? ఏ టైమ్‌కి పడితే ఆ టైమ్‌కి ఇలా వచ్చేస్తావా? అంటూ ఒక రేంజ్ లో ఫైర్ అవుతూ ఉండడంతో ఆమెకు విపరీతమైన బాధ కలిగి కన్నీళ్లు వస్తాయి. అప్పుడే జగతి కాల్ చేసి.. 'నువ్వు మాట్లాడకు వసు.. కిందకి వచ్చేయమని అంటుంది. వెంటనే వసు వెనుదిరిగి.. ఆగి.. బ్యాగ్‌లోంచి రిషి పర్స్ తీసి 'సార్ ఇది పారేసుకున్నారు.. ఇద్దామని వచ్చాను' అంటూ అక్కడే పెట్టేసి వెళ్లిపోతుంది.

  ఆలోచనలో పడిన రిషి

  ఆలోచనలో పడిన రిషి


  కిందకు వెళ్లాక జగతి వసునువ్వు ఎందుకు వచ్చావో తెలియదు కానీ.. రాంగ్ టైమ్‌కి వచ్చావ్.. విషయం తర్వాత చెబుతాను.. నువ్వు వెళ్లమని పంపించేస్తుంది. వెంటనే రిషి దగ్గరకు జగతి వెళ్తుంది. అయితే వచ్చింది వసు అనుకుని 'మళ్లీ ఎందుకొచ్చావ్' అని రిషి అనడంతో వచ్చింది 'నేను' అంటుంది జగతి. 'నీ జీవితం గురించి మాట్లాడటానికి నాకు ఏ అర్హతా లేదు అని నాకు తెలుసన్న ఆమె వసుధారని నువ్వు ప్రేమిస్తున్నావని..నేను నీకు ఎప్పుడో చెప్పాను.. ' అంటూ తన మనసులో మాట మరోసారి రిషికి చెబుతున్న సమయంలో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక కమింగ్ అప్‌లో చూపిస్తున్న దాని ప్రకారం వసు ఎగ్జామ్‌కి వెళ్తూ నేను అంతా సిద్ధం సార్ వెళ్దామా అంటుంది. అప్పుడే రిషికి దేవయాని మాటలు గుర్తొస్తాయి. అందరి నోళ్లు మూయించాలంటే వసుధారకు దూరంగా ఉండు రిషి అని దేవయాని చెప్పిన మాటలు గుర్తొస్తాయి. వెంటనే.. 'నేను రావట్లేదు.. నువ్వు వెళ్లు.. అయినా నువ్వేం చిన్న పిల్లవి కాదు. వెళ్లు' అని అనేసి వెళ్లిపోతాడు. వసు ఒంటరిగా నిలబడి.. రిషి సార్ రానంటే ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

  English summary
  Guppedantha Manasu Episode 453: Jagathi stops Sakshi from blaming Rishi and Vasudhara. Later, she tries to talk to him about Sakshi's accusations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X