Guppedantha Manasu: వసుకి రానని చెప్పి మళ్ళీ ఫాలోయింగ్.. మహేంద్ర కంట పడడంతో రిషి వ్యవహారం బట్టబయలు?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ యూత్ సహా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా ముందుకు వెళుతోంది. గత కొద్ది ఎపిసోడ్స్ నుంచి ఎక్కువగా వసుధార రిషి మధ్య ప్రేమను హైలైట్ చేస్తున్నారు. రిషి సాక్షి నుంచి తప్పించుకోవడం కోసం తనకు సహాయం చేయాల్సిందిగా వసుధారను కోరతాడు. దానికి ఆమె సరే అంటుంది. వసుధార స్కాలర్ షిప్ టెస్ట్ గురించి జగతి మేడమ్ తో రిషి మాట్లాడుతూ ఉండగా సాక్షి నేరుగా రిషి కాబిన్ కు వస్తుంది. అలా రావడం కరెక్ట్ కాదని ఆమెను మందలించడంతో ఆమె రిషి ఇంట్లో తన తల్లితండ్రులతో పంచాయితీ పెడుతుంది.

ఆ తరువాత దేవయాని వసుధారకు దూరంగా ఉండమని చెబుతుంది. అయితే వసుకి హాల్ టికెట్ వచ్చిన తరువాత దేవయాని మాటలు గుర్తుకు రావడంతో ఆమెను దూరం పెట్టాలని భావించి పరీక్షకు నేను రాను నువ్వే వెళ్లాలి అని రిషి వసుకి తేల్చి చెప్పడం తెలిసిందే. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించగా ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రిషికి పరీక్ష లాంటిది

రిషికి పరీక్ష లాంటిది

పరీక్ష రాయడానికి రిషి రాను అనడంతో దిగులుగానే ఉంటుంది వసు. రిషి రాను అని చెప్పాల్సి వచ్చినందుకు బాధ పడుతుంటే వసు రిషి రానని చెప్పడంతో బాధపడుతుంది. రిషికి ఏమి పని ఉందో మనకు తెలియదు, జీవితం అనే పరీక్షలో మనకు ఎవరూ తోడు రారు.. అన్నీ మనమే ఒంటరిగా ఎదుర్కోవాలి అని వసుతో అంటుంది.

అంతేకాక నువ్వు అలా దిగాలుగా ఉండవద్దు నువ్వు చాలా ప్రిపేర్ అయ్యావు, దానిని బాగా ప్రెజెంట్ చేయాలి అని అంటుంది.. ఒకవేళ రిషి వచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం పరీక్ష రాయాల్సిందే ఆ పరీక్ష ద్వారా మీ సత్తా ఏమిటో చూపించాల్సిందే. ఒకరకంగా ఇది రిషికి పరీక్ష లాంటిది అంటూ జగతి వసుధారను ఎంకరేజ్ చేస్తుంది.

వీలుంటే రండి సార్ అని

వీలుంటే రండి సార్ అని

మరోపక్క మహేంద్ర మాత్రం రేయ్ రిషి, ఎందుకురా ఆమెతో వెళ్ళను అన్నావు ఆమెతో వెళ్లి ఉంటే మీ మనస్సులు మరింత దగ్గరయ్యే అవకాశం ఉండేది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క రిషి కారులో బయలుదేరిన తర్వాత తన పక్కన లేకపోయినా తనతో మాట్లాడుతున్న భావనను ఫీల్ అవుతాడు.

వెంటనే జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని మరీ బాధపడతాడ. మీరు వస్తే ఉత్సాహంగా ఎగ్జామ్ రాస్తాను కదా అని రిషితో వసు అంటున్న విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. రిషి కారు దిగి సాక్షి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండగా మరోవైపు గౌతమ్ వసు నో.. అన్నాక ఈ జీవితం మీద ఆసక్తి పోయింది అని అనుకుంటాడు. ఈ లోపు వసు రెస్టారెంట్ కి దగ్గర లో బస్సు ఎక్కుతున్నాను వీలుంటే రండి సార్ అని మెసేజ్ పెడుతుంది.

వసుధార ఎగ్జామ్‌కి

వసుధార ఎగ్జామ్‌కి

అంతే కాకుండా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పకపోతే ఎగ్జామ్ రాయను అని కూడా చెబుతుంది. ఆ తర్వాత జగతి ఎదుటి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని కూడా మనం ఆలోచించాలి అని వసుతో అంటుంది. వసుకి.. మహేంద్ర, జగతిలు ధైర్యం చెబుతారు. మరోవైపు రిషికి వసు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. కానీ అదే రెస్టారెంట్ లో ఉండి వసుకు ఆల్ ది బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. దానితో వసు చాలా ఆనంద పడుతుంది. అది చూసిన తర్వాత వసు ఆనందాన్ని చాటుగా రిషి గమనిస్తాడు. ఇక మరోపక్క దేవయాని సాక్షికి వసు రాయబోయే పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ చూపిస్తూ.. 'ఇది నీకు పంపిస్తాను.. ఆ వసుధార ఎగ్జామ్‌కి వెళ్తుంది.

కారులో తీసుకుని వెళ్లి

కారులో తీసుకుని వెళ్లి

తను విజయం సాధించ కూడదు. అసలు ఎగ్జామ్ ఏ మాత్రం సరిగా రాయకూడదు. ఒకవేళ అది గెలిస్తే మనం ఓడిపోతాం. రిషికి దగ్గర కావడానికి ఆ వసుధారకు మరో ఛాన్స్ ఇది. అలా కాకూడదు అంటే నువ్వే చెయ్యాలో నీకు అర్థం అయ్యింది కదా ఆమెకు చెబుతుంది. దానికి సాక్షి సరే నాకు అర్థమైంది ఆంటీ.. వసుధార సంగతి నేను చూసుకుంటాను అంటుంది. అలా వసుని సరిగా పరీక్ష రాయనీయకుండా చేయాలని ఫిక్స్ అవుతుంది.ఇక మరోవైపు జగతి, మహేంద్ర వసును కారులో తీసుకుని వెళ్లి బస్ ఎక్కిస్తారు. అయితే రిషి వాళ్లకు కనిపించకుండా వాళ్లని ఫాలో అవుతూ, వసుని చూస్తూనే ఉంటాడు.

రిషిని చూసి నివ్వెరపోయి

రిషిని చూసి నివ్వెరపోయి

ఇక జగతి, మహేంద్రలు వసుకి బై చెప్పి.. బస్సు కదలగానే.. 'రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు' అని ఒకరితో ఒకరు చెప్పుకొని బాధ పడుతున్న సమయంలో రిషి కారులో యూటర్న్ తీసుకోవడం మహేంద్ర కంట అనుకోకుండా పడుతుంది. రిషిని చూసి నివ్వెరపోయి.. జగతి మన రిషి అడిగో.. అంటే వసు చూడటానికి వచ్చాడని ఇద్దరూ అర్థం చేసుకుంటారు. ఈక్రమంలో అసలు ఎందుకు ఆమెను ఒంటరిగా పంపాలి అనుకున్నాడు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ వచ్చి ఇలా ఆలోచిస్తున్నాడు అంటూ వారిద్దరూ ఆలోచనలో పడతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X