Guppedantha Manasu: వసుధారకు ఐలవ్యూ చెప్పనున్న రిషి.. మరో స్కెచ్ రెడీ చేసిన మహేంద్ర.. సాక్షి ఆన్ డ్యూటీ!

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేస్తున్నారు. బావ వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో రిషి వసుధారను ఇంటికి తీసుకు వెళ్లడం ఆ తర్వాత తాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆమె బయటికి వెళ్లిపోవడం వంటి విషయాలు సీరియల్ మీద మరింత ఆసక్తి రేకెత్తించాయి. ఆమె బయటకు వెళ్ళాక కూడా రిషి ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ పరీక్ష రాయడం కోసం వసుధార వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. అనేక ట్విస్టుల తరువాత రిషి ఆమెను ఊరికి తీసుకువెళతాడు. ఇద్దరూ కలిసి ఒక రూం తీసుకుంటారు కానీ రిషి ఆమెను చదువుకోమని చెప్పి బయటకు వెళ్లి కారులో ఉంటాడు. టైం పాస్ చేయడానికి ఎఫ్ఎం వాళ్లకు కాల్ చేస్తాడు. ఇక ఆలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

కన్ఫ్యూజన్ లో

కన్ఫ్యూజన్ లో

గత ఎపిసోడ్ లో ఎఫ్‌ఎంలో లవ్‌ డాక్టర్‌కు ఫోన్ చేసిన రిషి ప్రేమ గురించి తాను కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నానని చెబుతాడు. తను ఓ అమ్మాయిని ప్రేమించడం లేదని కానీ ఆమె గురించే ఆలోచిస్తున్నానని ఈ విషయంలో తాను కన్ఫ్యూజ్‌ అవుతున్నట్టు రిషి చెబుతాడు. అయితే ఎఫ్‌ఎంలో లవ్‌ డాక్టర్‌ రిషిని రకరకాలైన ప్రశ్నలతో సమాధానాలు రాబట్టి చివరికి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు,కానీ మీకు అర్ధం కావడం లేదు అని సర్టిఫై చేసి చెప్పేస్తాడు. అదే సమయంలో వసుధార, మహేంద్ర కూడా ఆ లవ్‌ డాక్టర్‌, రిషి డిస్కషన్ వింటూ ఉంటారు. అయితే లవ్‌ డాక్టర్ పేరు అడిగితే మాత్రం కొందరు ప్రిన్స్ అంటారని.. మరికొందరు జంటిల్‌మెన్ అంటారని... సీరియస్‌ సింహం అంటారని చెప్తాడు. ఇది విని మహేంద్ర కచ్చితంగా రిషి వాయిస్‌ అనుకుంటాడు. కానీ వసుధార మాత్రం రిషి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని అంటుంది.

అతని ఫీలింగ్స్ కాదు కదా

అతని ఫీలింగ్స్ కాదు కదా

ఇక మహేంద్ర తన కొడుడు రిషి ఇలా చేస్తున్నాడని చెబుతూ జగతికి కూడా ఆ వాయిస్ వినిపిస్తాడు. చివరిగా ఏమైనా చెప్పాలా అని రిషిని రేడియో జాకీ ప్రశ్నిస్తాడు... దీంతో రిషి తన మనసులో ఉన్న మాట, ఆమె దగ్గరుంటే హాయిగా ఉంటుంది... కానీ ప్రేమించడం లేదని... చెబుతాడు. రిషి మాటల విన్న రేడియో జాకీ . మీరు ప్రేమలో ఆఖరి దశలో ఉన్నారంటూ చెప్తాడు. ఇదే చివరి కాల్ అని మీ మనసులో మాట మొహమాటం లేకుండా చెప్పేయమంటాడు. కాల్ కట్ అయిన తరువాత కూడా రిషికి ఆ రేడియో జాకీ చెప్పిన సంగతులే గుర్తుకు వస్తుంటాయి. జగతి మాత్రం తన కొడుకును వెనకేసుకు వస్తూ రిషి అడిగినంత మాత్రాన అవి అతని ఫీలింగ్స్ కాదు కదా అని అంటుంది. అదే సమయంలో సాక్షి ఇండియాకు వచ్చి రిషికి మేలు చేసిందని అంటాడు మహేంద్ర.

పట్టు తప్పి రిషి మీద

పట్టు తప్పి రిషి మీద

రిషి ప్రేమలో ఉన్నాడని... త్వరలోనే వసుధారకు తన మనసులో మాట చెప్పేస్తాడని మహేంద్ర జగతితో అంటాడు. కానీ జగతికి మాత్రం ఎక్కడో అనుమానంగానే ఉంటుంది. అంటే సాక్షి వచ్చింది కాబట్టి ఆమెను చూసి పోల్చుకుని ప్రేమ బయట పెడతాడా? అని ప్రశ్నిస్తుంది. అలా అయితే రిషి చెప్పకపోతే పరిస్థితి ఏంటని జగతి ప్రశ్నిస్తుంది. తన వద్ద సెకండ్ ప్లాన్ ఉందని మహేంద్ర చెప్తాడు.ఇక మరోపక్క ఎగ్జామ్‌ సెంటర్‌ వద్ద వసుధార కోసం సాక్షి వెయిట్ చేస్తుంటుంది. వసుధార అడ్డు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇక హోటల్ రూమ్ లో పరీక్షకు రెడీ అవుతున్న వసుధార రూమ్‌కి రిషి వచ్చి ఆమెను తర్వగా రెడీ అవ్వమని తొందరపెడతాడు. ఆమె ఎంత సేపు చేస్తుందో అర్ధం కాక నేరుగా వచ్చి వసుధార బెడ్‌ మీద కూర్చుంటాడు. అయితే ఇంతలో వసుధార పట్టు తప్పి రిషి మీద పడుతుంది.

జగతికి షాక్

జగతికి షాక్


రిషి ఒడిలో వసుధార పడిన తర్వాత కాసేపు ఏమీ అర్థం కాక ఒకర్ని ఒకరు చూసుకుంటారు. వసుధార లేచే సరికి రిషి మెడలోని చైన్‌...వసుధార చున్నీకి ముడిపడుతుంది. ఇద్దరూ తన్మయత్వంలో ఉండిపోయారు. కాసేపటికి తేరుకుని వసుధార రిషికి సారీ చెబుతుంది. కానీ రిషి తనదే తప్పంటాడు. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి పరీక్ష కోసం బయల్దేరుతారు. సీన్ కట్ చేస్తే హాల్‌లో ఒంటరిగా ఉన్న దేవయాని వద్దకు వచ్చిన మహేంద్ర గుడ్‌ న్యూస్ అని చెబుతూ మీ ఫోన్‌కో ఫొటో పంపించాను అంటాడు. అందులో సాక్షి, రిషిల వెడ్డింగ్ కార్డ్ ఉంటుంది. అది చూసి దేవయాని గాలిలో తేలిపోతుంది. జగతి అక్కడికి రావడంతో ఆమెకు కూడా చూపించి మరింత ఆనందపడుతుంది దేవయాని. అయితే ఆ కార్డు చూసిన తర్వాత జగతికి షాక్ తగిలినట్టు అవుతుంది.

ఎలా పరీక్ష రాస్తావో చూస్తా

ఎలా పరీక్ష రాస్తావో చూస్తా


ఇంతలో ఆ ఫొటోను రిషికి పంపిస్తుంది దేవయాని. అప్పటికే వసుధార, రిషి ఇద్దరూ ఎగ్జామ్‌ సెంటర్ దగ్గరకు వస్తారు. వసుధారకు ఆల్‌ది బెస్ట్ చెప్పి రిషి ఓఎంపిస్తాడు. నువ్వు ఎగ్జామ్‌ రాసిన తర్వాత నీకు ఓ గిఫ్ట్‌ రెడీగా ఉంటుంది చెప్తాడు. వసుధార చేతిని అందుకుని, ఈరోజు మనకు చాలా ముఖ్యమైన రోజు, ఎప్పటికీ గుర్తుండిపోతుందని అంటూ తన పెన్ వసుధారకు ఇస్తాడు. ఇక అక్కడితో ఎపిసోడ్ ముగియగా కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం ఎగ్జామ్ సెంటర్‌లో ఏదో ప్లాన్ చేసిన సాక్షి... వసుధార వెళుతూ ఉండగా నువ్వు ఎలా పరీక్ష రాస్తావో చూస్తానని అంటుంది. ఇక మరో పక్క పెద్దమ్మ పంపించిన వెడ్డింగ్ కార్డు చూసి షాక్ అవుతాడు రిషి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X