Guppedantha Manasu: మహేంద్ర 'ఆపరేషన్ శుభలేఖ వర్కవుట్.. చిటికెలో రిషికి జ్ఞానోదయం
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. బావ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో రిషి వసుధారను ఇంటికి తీసుకు వెళ్లడం ఆ తర్వాత తాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆమె బయటికి వెళ్లిపోవడం వంటి విషయాలు చోటు చేసుకున్నాయి. వసుధార బయటకు వెళ్ళాక కూడా రిషి ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించాలని ప్రయత్నిస్తున్న రిషి ఆ పరీక్ష రాయడం కోసం వసుధార వేరే ఊరు వెళ్లాల్సి వస్తే ఇరకాటంలో పడతాడు. అనేక ట్విస్టుల తర్వాత రిషి ఆమెను పరీక్ష రాయించడం వేరే ఊరికి తీసుకువెళతాడు. ఇద్దరూ కలిసి ఒక రూం తీసుకుంటారు కానీ రిషి ఆమెను చదువుకోమని చెప్పి బయటకు వెళ్లి కారులో ఉంటాడు. తరువాత ఆమెను పరీక్షకు సిద్ధం చేస్తుంటాడు. ఈలోపు మహేంద్ర ఒక శుభలేఖ సిద్ధం చేసి పంపిస్తాడు. ఇక ఇలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

మనసులోని మాట చెప్పడానికి
పరీక్ష రాయడానికి వెళ్తున్న వసుధార చేతిని పట్టుకొన్న రిషి, ఈరోజు మనకు చాలా ముఖ్యమైన రోజు... ఎప్పటికీ గుర్తుండి పోతుంది అని అంటాడు. అయితే పరీక్ష టెన్షన్లో ఉన్న వసుధారకు ఇదేమీ అర్థం కాదు. అయితే ఒక స్పెషల్ పెన్ తెచ్చిన రిషి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చి ఆల్‌ది బెస్ట్ చెప్పి పంపిస్తాడు. ఆ పెన్ తీసుకున్న తరువాత ఇదేనా నాకు మీరు ఇస్తానన్న పెద్ద గిఫ్ట్ అని అడుగుతుంది వసుధార.అయితే పైకి చెప్పడు కానీ, లేదు వసుధార జీవితంలో ఊహించని గిఫ్ట్ ఇస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇక మొత్తం రిషిని ఇచ్చిన ధైర్యంతో అక్కడి నుంచి ఎగ్జామ్ హాల్‌కు బయలుదేరుతుంది వసుధార. ఆమె పరీక్ష రాసి రాగానే తన మనసులోని మాట చెప్పడానికి రిషి సంసిద్ధం అవుతూ ఉంటాడు.

దేవయాని సంతోష పడుతూ
ఆమెను ఎగ్జయిట్ చేసేందుకు మంచి గిఫ్ట్ కూడా కొనాలని వెళతాడు. మరో పక్కఎగ్జామ్ హాల్ వద్ద ఉన్న సాక్షి... వసుధార కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వసుధార నడుచుకుంటూ వెళుతున్న సమయంలో వెళ్ళు వెళ్ళు అసలైన ఎగ్జామ్ ఇప్పుడే మొదలవుతుంది... రిషి నుంచి ఎలా దూరం చేస్తానో చూడు అని అనుకుంటుంది. మరో పక్క కారులో కూర్చున్న రిషి పెద్దమ్మ పంపించిన సాక్షి వెడ్స్ రిషి అనే వెడ్డింగ్ కార్డ్ చూస్తాడు. అది చూసి బిత్తర పోయిన రిషికి వెంటనే ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే దేవయానికి ఫోన్ చేస్తాడు. వెడ్డింగ్ కార్డ్ ఏంటీ... సాక్షి ఫోటో ఏంటి అని ఆమెను ప్రశ్నిస్తాడు. అయితే దేవయాని సంతోష పడుతూ బాగుంది కదా, ఎలా ఉందో చెప్పమని అంటుంది.

మహేంద్ర డిజైన్ చేయించాడని.
రిషి కోప్పడడంతో ముందు ముందు చాలా అవసరమని మహేంద్ర దాన్ని డిజైన్ చేయించాడని... మాట్లాడమని ఫోన్ ఇస్తుంది. ఏంటి నాన్న ఇది ఇలా ఎందుకు చేశారు? అని ప్రశ్నిస్తే వెడ్డింగ్ పార్టర్‌ను ఎలాగూ నువ్వు నిర్ణయించుకోవడం లేదని మీ దేవయాని పెద్దమ్మ నిర్ణయించిందని చెప్తాడు. దీంతో రిషి కోపంగా ఫోన్ పెట్టేస్తాడు. ఇక వసుధార ఎగ్జామ్ రాయడానికి కూర్చుంది కానీ ఆమెకు దాని మీద కంటే రిషి మీదకే మనసు పోతూ ఉంటుంది. రిషి చెప్పిన సంగతులు గుర్తుకు వస్తూ ఉండగా ఆయన ఇచ్చిన పెన్ చూసుకొని రిషి అక్కడే ఉన్నాడన్న ఫీల్‌తో ఇన్విజిలేటర్ ను చూసి ఆయనతో రిషి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది.

ఆపరేషన్ శుభలేఖ
ఇక ఇంట్లో మహేంద్ర చేసిన వెడ్డింగ్ కార్డ్ పంచాయితీ వ్యవహారంలో జగతి ఆయన మీద కోప్పడుతుంది. రిషి ఎంత డిస్టర్బ్ అవుతాడో మీకు తెలియదా అని అడిగి నువ్వు దేవయాని వలలో పడిపోయావని అంటుంది. కానీ మహేంద్ర మాత్రం రిషిపై ఒత్తిడి పెంచితేనే ఏదో నిర్ణయం తీసుకుంటాడు, అప్పుడే వసుధారపై అభిప్రాయాన్ని చెబుతాడని అంటాడు. ఈ ఆపరేషన్ శుభలేఖతో అంతా మంచి జరుగుతుందని అంటాడు.

నాకు ఎప్పుడో అర్థమైంది
వెడ్డింగ్ కార్డ్ విషయాన్ని గుర్తు తెచ్చుకుని కోపంతో అసలు వెడ్డింగ్ కార్డులో సాక్షి నా పక్కన ఉండటమేంటని... తనను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటాడు. ఈ క్రమంలో సాక్షితో కలిసి ఉన్న మూమెంట్స్, వసుధారతో కలిసి ఉన్న మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటాడు. వసుధార నా కోపాన్ని భరిస్తుంది.. సాక్షి నాకు కోపాన్ని తెప్పిస్తుంది, మన:శాంతిగా లేనప్పుడు వసుధార మాట హాయినిస్తుంది. తన ప్రతి పరియం ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుందని అనుకుంటాడు. నాకు ఎప్పుడో అర్థమైంది.. కానీ మనసు చెప్పిన మాటల్ని నేను వినిపించుకోలేదు.. వసుధార నాకు కావాలని రిషి డిసైడ్ అవుతాడు. మరి ఈ వచ్చే ఎపిసోడ్ లో ఈ వ్యవహారం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











