For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: ఐలవ్‌యూ చెప్పిన రిషి- దిమ్మతిరిగే షాకిచ్చిన వసుధార

  |

  స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. తన బావ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో రిషి వసుధారను ఇంటికి తీసుకు వెళ్లడం ఆ తర్వాత తాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆమె బయటికి వెళ్లిపోవడం వంటి వ్యవహారాలు ఆసక్తి రేకెత్తించాయి. వసుధార బయటకు వెళ్ళాక కూడా రిషి ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించాలని ప్రయత్నిస్తున్న రిషి ఆమెను పరీక్ష రాయించడం వేరే ఊరికి తీసుకువెళతాడు. ఇద్దరూ కలిసి ఒక రూం తీసుకుంటారు కానీ రిషి ఆమెను చదువుకోమని చెప్పి బయటకు వెళ్లి కారులో ఉంటాడు. తరువాత ఆమెను పరీక్షకు పంపి వచ్చిన తర్వాత తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం ఒక అద్భుతమైన బహుమతిని కూడా కొంటాడు. దాన్ని ఇచ్చే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  నన్ను మార్చేసావు

  నన్ను మార్చేసావు

  పరీక్ష రాసిన తర్వాత ఇంటికి వెళ్ళే దారిలో ఒక రిసార్ట్ లో బస చేయాలని ఇద్దరు భావిస్తారు. రిసార్ట్‌కు వెళ్తున్న సమయంలో తన మనసులో మాట వసుదారకు చెబుతాడు రిషి. ఈ మధ్య కాలంలోనే నేనేంటో నాకు అర్థమైందని, నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నా అని అంటాడు రిషి. నన్ను నేను కొత్తగా తెలుసుకున్నానని కూడా ఆమెకు చెప్తాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఒంటరిని అనే భావన ఉండేదని.. దాన్ని నువ్వు మార్చేశావని, నువ్వు వచ్చాక నా ప్రవర్తన కూడా మారిపోయింది అని చెబుతాడు రిషి. నన్ను నా మనసును వసుధార అనే నువ్వు ఏమార్చేశావంటాడు రిషి. రిషి మనసులో మొత్తంగా నువ్వు పూర్తిగా నిండిపోయావని చెప్పుకొస్తాడు.

  ఐలవ్యూ చెప్పేసి

  ఐలవ్యూ చెప్పేసి

  అంతే కాక తాను ఆ మాట అన్న వెంటనే వెంటనే కారు వద్దకు వెళ్లి గిఫ్టు తీసుకొచ్చి వసుధారకు ఇస్తాడు రిషి. గిఫ్టును విప్పి చూస్తుంది వసుధార. అందులో ఐ లవ్‌యూ పేరుతో ఉన్న గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధార. వసుధార కూడా తనకు తెలియకుండానే ఐలవ్‌యూ అని పైకి అనేస్తుంది. రిషి కూడా అవును అదే అని అంటాడు. ఈ క్రమంలో పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే రిషిని వసుధార కౌగింలించుకుంటుంది. నాకు కూడా మీరంటే చాలా ఇష్టమని తన మనసులో మాట చెప్పేస్తుంది. ఇంకేముంది మనవాడు గాల్లో తేలిపోతున్న సమయంలో ఇదంతా కూడా కల అని అర్థమవుతుంది.

  సందిగ్ధావస్థలో

  సందిగ్ధావస్థలో


  కట్‌ చేస్తే వసుధార ఆ గిఫ్ట్‌ను తేరిపార చూస్తూ ఉంటుంది. తాను ఒక గురువులా భావించిన వ్యక్తి ఇలా తనకు ప్రేమిస్తున్నాను అంటూ ఒక బహుమతి ఇవ్వడంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని స్థితిలో ఉంటుంది. కాసేపటికి తేరుకున్న ఆమె మీరంటే కూడా నాకు ఇష్టమని చెప్పేస్తుంది. అయితే అది జగతి మేడం కొడుకుగా, మంచి వ్యక్తిగా చాలా ఇష్టమని చెబుతుంది. లైఫ్‌లో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు అని చెబుతూనే తన కోసం ఎన్నో మంచి పనులు చేశారని, ఎవరు ఎలా ఆలోచిస్తారు అని కూడా ఆలోచించకుండా తన కోసం ఎన్నో చేశారని... ఈ విషయంలో చాలా తాను అదృష్టవంతురాలని అంటుంది. అయితే నువ్వు కాలేజీలో చేరిన మొదటి రోజు నీతో గొడవ జరిగింది కానీ ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నీ మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది అని రిషి అంటాడు.

  వాళ్ల వల్లే ఇలా అంటూ

  వాళ్ల వల్లే ఇలా అంటూ


  తన జీవితంలో ఇద్దరు ఆడవాళ్ళ వలన మరో ఆడదానితో ఇంత క్లోజ్గా ఉంటాను అని అనుకోలేదు అని అంటాడు. జగతి, సాక్షి కారణంగానే నేను ఎవరితో క్లోజ్‌గా ఉండలేకపోయానని చెబుతాడు రిషి. జగతి మేడం గురించి నీకు తెలిసిందే అని చెబుతూ తర్వాత సాక్షి, రిషి మధ్య జరిగిన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని చెప్తాడు. మా మధ్య ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత తనకు చదివే ముఖ్యమని లండన్ వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఉండాలి కానీ తరువాతి ప్రిఫరెన్స్ గా ఉండడం నాకు ఇష్టం లేదు అని చెబుతాడు. తనపై ఇప్పుడు నాకు ఎలాంటి అభిప్రాయం లేదని, అలా ఫీల్ అవ్వడమే తనకు చాలా ఆనందంగా ఉందని చెప్తాడు రిషి. అంతేకాక ఈ రోజు తన మనసంతా చాలా తేలికగా ఉంది అని అంటాడు చాలా ఆనందం కలుగుతుందని కూడా అంటాడు. ఎందుకు ఆనందం అని ఆమె ప్రశ్నిస్తే నా మనసులో భావన నీ ముందు ఉంచాను నీకు కూడా ఇష్టమేనా అని చెబుతున్నావు కదా అని అంటాడు రిషి.

  దిమ్మతిరిగే షాక్

  దిమ్మతిరిగే షాక్


  దానికి ఆమె దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది మీరేదో గిఫ్టు తీసుకొచ్చి ఐలవ్‌యూ అనగానే నేను కూడా ఐ లవ్ యు అని అంటానని ఎలా అనుకున్నారని ప్రశ్నిస్తుంది వసుధార. మీది ప్రేమ కాదేమో అని వసుధార అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎలా చప్తావని ప్రశ్నిస్తాడు రిషి. మీలో ఈ ప్రేమ ఎప్పుడు కలిగిందని ఆమె అడుగుతుంది. ఈ మధ్యే అంటాడు. ఇన్నాళ్లు ఎందుకు అనుకోలేదని ఎదురు ప్రశ్న వేస్తుంది. అప్పుడు అలా అనిపించలేదని చెప్పేసరికి... అప్పుడు అనిపించనిది ఇప్పుడు ఎందుకు అనిపించిందో వివరిస్తూ సాక్షి వల్లే అలాంటి అభిప్రాయం కలిగిందని చెబుతుంది. సాక్షి మళ్లీ తిరిగి వచ్చించ్ కాబట్టే నాపై ప్రేమ పుట్టిందని... లేకుంటే ఇదిప్రేమ అని తెలిసేది కాదని అంటుంది వసుధార. ఆమె నుంచి ఊహించని ఈ సమాధానం విన్న తర్వాత రిషీంద్ర భూషణ్ ఏమి మాట్లాడాలో కూడా తెలియని సందిగ్ధావస్థలో పడతాడు.

  English summary
  Guppedantha Manasu Episode 461: rishi proposes vasudhara. and then he lands in a tight spot when she questions his feelings on her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X