Don't Miss!
- News
తెలంగాణాలో బీజేపీ దూకుడు; మళ్ళీ రంగంలోకి కేంద్ర మంత్రులు.. ఈసారి ప్లాన్ ఇదే!!
- Technology
Oppo కొత్త ఫోన్ల లాంచ్ డేట్ వచ్చేసింది ! ఈ ఫోన్ల ధర మరియు ఫీచర్లు చూడండి.
- Sports
Wimbledon 2022: సెమీస్‌లో ఓడిన సానియా జోడీ.. మ్యాచ్‌కు హాజరైన ధోనీ!
- Finance
Fuel Prices: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు: 100 డాలర్ల దిగువకు క్రూడ్
- Lifestyle
Today Rasi Phalalu :ఈ రోజు మీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయి, తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉందా?
- Automobiles
టీవీఎస్ నుంచి కొత్త బైక్ 'రోనిన్' వచ్చేసింది: ధర రూ. 1.49 లక్షలు
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు..!
Guppedantha Manasu: రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు.. చిన్నపిల్లాడిలా ఏడుపు.. సాక్షి స్కెచ్ సక్సెస్!
ముస్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. తన బావ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో రిషి వసుధారను ఇంటికి తీసుకు వెళ్లడం ఆ తర్వాత తాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆమె బయటికి వెళ్లిపోవడం వంటి వ్యవహారాలు సీరియల్ మీద ఆసక్తి రేకెత్తించాయి. వసుధార బయటకు వెళ్ళాక కూడా రిషి ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఇక వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించాలని ప్రయత్నిస్తున్న రిషి ఆమెను పరీక్ష రాయించడం వేరే ఊరికి తీసుకువెళతాడు. ఆమెను పరీక్షకు పంపి వచ్చిన తర్వాత తన ప్రేమను వ్యక్తం చేయాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం ఒక అద్భుతమైన బహుమతి కూడా కొంటాడు. అది ఇచ్చి ప్రేమను ప్రపోజ్ చేసిన సమయంలో ఆమె షాక్ ఇస్తుంది. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

క్లారిటీ లేదని
ఆ తరువాత వసుధార రిషితో మాట్లాడుతూ నువ్వు ద్వేషిస్తున్న సాక్షి తిరిగి వచ్చిందని మీకు నా మీద ప్రేమ పుట్టిందని.. లేకుంటే ఇది ప్రేమని తెలిసిందని లేకుంటే తెలిసేది కాదని అంటుంది. అయితే ఈ విషయాన్ని రిషి ఏమాత్రం జీర్ణించుకోలేక పోతాడు. అయినా ఆమె వినకుండా తన వర్షన్ తాను మాట్లాడుతూనే ఉంటుంది.
మీకు నా మీద ఏమాత్రం ప్రేమ లేదు, కేవలం ఆమె వచ్చింది కాబట్టి ఆమె స్థానంలో ఎవరో ఒకరు కావాలి కాబట్టి నన్ను అనుకుంటున్నారు అని అంటుంది. అది తట్టుకోలేక ఆమె మీగ గట్టిగా అరుస్తాడు రిషి. అసలు మీది ప్రేమే కాదని పేర్కొన్న వసుధార, నేను మీమ్మల్ని ప్రేమించడం లేదని చెప్పేస్తుంది. అయితే బాధతో రిషి నాకు ఏం తక్కువ, నేను ఎందుకు ప్రేమించుకూడదు అని ప్రశ్నిస్తాడు. అయితే అప్పుడు ఆమె మీకు క్లారిటీ లేదని చెబుతుంది.

కన్నీళ్లు పెట్టుకుంటూ
మీది ప్రేమ కానే కాదంటుంది. మీకు మీ అమ్మ మీద ప్రేమ లేదని అంటూ మాట్లాడబోతున్న సమయంలో ఆవిడ గురించి తన దగ్గర మాట్లాడొద్దని గట్టిగా చెప్పేస్తాడు. చిన్నతనంలో తనకు ఊహ కూడా తెలియని సమయంలో స్వార్థం చూసుకుని వదిలేసి వెళ్ళిపోయింది అని ఆమె గురించి అంటాడు. అయితే తాను బాగా ఆలోచించాకే ప్రేమ సంగతి చెప్పానని అంటాడు రిషి.
తాను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని, ఒకప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను కరిగిపోయి... కొత్తగా పుట్టాననీ అంటాడు. ఇక ఏదో చెప్పి ప్రేమను రిజెక్ట్ చేయొద్దని రిషి లిటరల్ గా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తాడు. నిజంగానే ప్రేమిస్తున్నానంటూ దగ్గరకు తీసుకొని ఆమె కళ్ళలో చూస్తూ చెబుతాడు రిషి.

ప్రేమ నిజం కాదని
అయితే
అప్పుడు
కూడా
మీ
ప్రేమ
నిజం
కాదని...
ఎంగేజ్‌మెంట్
చేసుకున్న
వ్యక్తినే
కాదన్నారు...
తల్లినే
ప్రేమించలేని
మీరు
నన్ను
ఎలా
ప్రేమిస్తారని
ప్రశ్నిస్తుంది
వసుధార.
మీకు
సీజన్స్
మారినట్టు
మూడ్స్
మారుతాయని,
అభిప్రాయాలు
కూడా
అంతే
త్వరగా
మారతాయని,
అందుకే
మిమ్మల్ని
ప్రేమించలేనంటూ
ముఖం
మీదే
చెబుతుంది.
అయితే
రిషి
సాక్షి
విషయంలో
మొదటి
నుంచి
క్లారీటీగా
ఉన్నానని...
తను
తిరిగి
వచ్చినా
తన
జీవితంలోకి
ఆహ్వానించలేదనీ
చెప్పేందుకు
ప్రయత్నిస్తాడు.
ఇక
కావాలంటే
నన్ను
ద్వేషించు
కానీ
తన
ప్రేమను
అవమానించొద్దని
హెచ్చరిస్తాడు
రిషి.
వసుదార
కూడా
ఎక్కడా
తగ్గకుండా
ప్రేమ,
ఇగో
రెండూ
ఒకచోట
ఉండలేవని...
అసలు
మీరు
ప్రేమ
అంటేనే
భయమేస్తోందని
అంటుంది
వసుధార.

గిఫ్టు తన చేతిలోనే
ఓ
తల్లి
మనసును
అర్థం
చేసుకోలేని
మీరు
ప్రేమిస్తున్నారని
అంటేనే
వణుకు
పుడుతుందని
అంటూనే
వసుధార,
మీరు
ఒక
ఆడదాని
మనసు
ఎప్పుడూ
అర్థం
చేసుకోలేరని
స్టేట్‌మెంట్
ఇస్తుంది.
ఆ
తరువాత
కూడా
జగతి
గురించి
వసుధార
మాట్లాడబోతుంటే
ఆమె
గురించి
మాట్లాడవద్దు,
ఆపేయమని
వార్నింగ్
ఇస్తాడు
రిషి.
తన
స్వార్థం
చూసుకొని
బిడ్డను
వదిలేసిన
ఆమె
పెట్టిన
బాధ
కంటే
నువ్వు
ఎక్కువ
బాధిస్తున్నావంటాడు
రిషి.
వసుధార
రిషి
వర్షంలో
కూడా
తడుస్తూనే
మాట్లాడుకుంటూ
ఉంటారు.
చివరికి
వేరే
మాట
చెప్పకుండానే
రిషి
ఇచ్చిన
గిఫ్టు
తన
చేతిలోనే
పెట్టి
వెళ్లిపోబోతుంది.

సాక్షి ఝలక్
అప్పుడు రిషి వసుధార నా గుండెను ముక్కలు చేసి వెళ్తున్నావని చెబుతాడు. అయినా పట్టించుకోకుండా ఏడుస్తూ వెళ్లిపోతుంది వసుధార. ఇంతలో ఆ గిఫ్ట్‌ను బాధతో కింద పడేస్తాడు. ఆ సౌండ్ విన్నాక కూడా సైలెంట్ గా వెళ్ళిపోతుంది వసుధార. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ బయటకు వస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో గొడుగు కింద తడవకుండా ఉండగా అప్పుడే ప్లాష్‌బ్యాక్ చూపిస్తారు. దాని ప్రకారం ఎగ్జామ్ సెంటర్‌లో వసుధారను సాక్షి బెదిరిస్తున్న వ్యవహారం చూపారు.
రిషి లైఫ్‌లో నుంచి దూరంగా వెళ్లిపోవాలని వసుధారకు చెబుతుంది. నీవల్ల తనవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని... నువ్వు మాత్రం తనను వదిలేసి వెళ్లిపోమంటోంది సాక్షి. దానికి వసుధార వెనక్కు తగ్గక పోవడంతో నిన్నేమీ చేయను రిషిని మాత్రం ఏదైనా చేస్తానంటూ బెదిరిస్తుంది. మరి చూడాలి తదుపరి ఎపిసోడ్ ఎలా సాగనుంది అనేది.