Guppedantha Manasu: మహేంద్రకు రిషి ఝలక్...కొడుకు ప్రేమ కోసం జగతి రాయభారం?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వసుధార, రిషి మధ్య ప్రేమ వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారు. తన బావ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్న సమయంలో రిషి వసుధారను ఇంటికి తీసుకు వెళ్లడం ఆ తర్వాత తాను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని ఆమె బయటికి వెళ్లిపోవడం వంటి వ్యవహారాలు ఆసక్తికరంగా మారాయి. వసుధార బయటకు వెళ్ళాక కూడా రిషి ఆమెను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆమె బస్తీలో ఉంటున్నా ఆమెను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. ఇక వసుధారను ఒక స్కాలర్ షిప్ టెస్ట్ రాయించడం కోసం వేరే ఊరికి తీసుకు వెళ్లి పరీక్ష రాసి వచ్చాక ప్రేమను ఆమెకు వెల్లడిస్తాడు. ఆమె ఒప్పుకుంటుంది అనుకుంటే ఒప్పుకోకుండా షాక్ ఇస్తుంది. అలా గత ఎపిసోడ్ ముగించారు. తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

పొడిపొడిగా

పొడిపొడిగా

ఒకపక్క వసుధార కు ఫోన్ చేస్తే ఆమె పొడిపొడిగా ఫోన్ మాట్లాడి కాల్ కట్ చేస్తుంది. తరువాత ఆమెకి జగతి ఫోన్ చేస్తూనే ఉన్నా ఆమె ఫోన్ ఎత్తదు. మరోపక్క మహేంద్ర మన సుపుత్రుడు రిషి కి ఫోన్ చేస్తాను అని చెబుతూ రిషి ఫోన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు ది ఫోన్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది కానీ త్రిష మాత్రం ఫోన్ ఎత్తే ప్రయత్నం చేయడు. ఇలాజగతి, మహేంద్ర లు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి ధరణి వచ్చి దేవయాని పిలుస్తుంది రమ్మని చెప్పి వెళ్లిపోతుంది. అయితే అదే సమయంలో ఆమె ఆనందంగా ఉందని చెబుతోంది. ఆమె అందంగా ఉంది అంటే ఎవరు బాధపడాల్సిన అని జగతి భావిస్తుంది. మరొకవైపు రిషి ఇంటికి వస్తూ దారిలోనే నిద్ర పోయాడు.

రోడ్డు మీదే

రోడ్డు మీదే

ఇదేంటి అని ఆలోచిస్తూ రాత్రి జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. నేనేంటో ఇలా రోడ్డు మీద నిద్ర పోవడం ఏంటో అని ఆవేదనకు లోను అవుతాడు. ఇక మరో పక్క దేవయాని, జగతి- మహేంద్ర లపై కోప్పడుతుంది. కొడుకు కొడుకు అని ప్రేమ చూపించడం కాదు జగతి, బాధ్యత కూడా ఉండాలి అని అనడంతో జగతి తనదైన శైలిలో దేవయానికీ కౌంటర్ వేస్తుంది. ఇక ఆ తర్వాత వారు ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే రిషి కారులో వస్తాడు. అప్పుడు మహేంద్ర, దేవయాని ఏమైంది అని అతన్ని నిలువరించి అడుగుతున్నా కూడా రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి పోతాడు.

కుమిలిపోతూ

కుమిలిపోతూ


వాళ్ళకి ఏమో జరిగిందో అర్థం కాదు. కానీ దేవయానికి ముందే కొంత క్లారిటీ ఉండడంతో అసలు వసు రిషి ప్రేమను ఎందుకు దూరం చేసుకుంది అనే ఆలోచనలోనే ఉంటుంది. మరొకవైపు వసుధార కూడా ముందు రోజు జరిగిన విషయం గురించి తలుచుకుని కుమిలిపోతూ ఉంటుంది. ఇలా చేయాల్సింది కాదు అన్నట్టు ఆమె బాధ పడుతూ ఉంటుంది. అయితే రిషి తన బెడ్ రూంలో ఒంటరిగా నిలబడి వసుధార ఎందుకు ఇలా చేసింది. ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే వసు ఫోన్ చేస్తుంది.

బార్ కు

బార్ కు

సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన మహేంద్ర ఎవరో పొగరు అంట, ఎవరా పొగరు అంటూ కాల్ లిఫ్ట్ చేయడానికి ప్రయత్నించగా అప్పుడు రిషి ఫోన్ లాక్కుంటాడు. అప్పుడు రిషి మౌనంగా ఉండటం తో మహేంద్ర ఏం జరిగిందో చెప్పు అని పదే పదే అడగడంతో, ఈ ప్రిన్స్ ని చిన్నప్పుడే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది, సాక్షి మధ్యలోనే వదిలేసింది ఇప్పుడేమో ఆ వసుధార అనబోయి ఆమె పేరు బయటకు రానీయకుండా ఆపివేయడంతో అప్పుడు మహేంద్ర ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు రిషి అని గుచ్చి గుచ్చి అడుగుతాడు. వారి మాటలను వింటున్న జగతి ఆ విషయం గురించి వసుతో మాట్లాడాలి అని బయలుదేరుతుంది. నన్ను నీ స్నేహితుడిగా ఫీల్ అవమాని చెప్పడంతో మహేంద్రను తీసుకుని రిషి బార్ కు వెళ్తాడు. ఎప్పుడూ లేనిది రిషి కొత్తగా బార్ లో కూర్చొని మందు తాగుతూ ఉండడంతో మహేంద్రకు ఏమీ అర్థం కాక ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

ముక్కలు చేశావ్ అంటూ

ముక్కలు చేశావ్ అంటూ

అలాగే ఫోటోలు కూడా గీస్తూ ఉంటాడు ఇంతలో రిషి మందు తాగుతూ ఉండగా అక్కడికి వసుధార వచ్చినట్లు ఊహించుకుంటాడు. ఆ తర్వాత రిషి వెళ్దాం పదండి డాడ్ నేను పిలిస్తే మీరు ఎలా వచ్చారు అంటూ రివర్స్ లో మాట్లాడుతాడు. దీంతో మహేంద్ర షాక్ అవుతాడు. మరొకవైపు జగతి అసలు విషయాన్ని తెలుసుకోవడానికి వసు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అలా తాజా ఎపిసోడ్ ముగించారు. తదుపరి ఎపిసోడ్ లో ఎందుకు వసు రిషి ప్రేమను రిజెక్ట్ చేశావు అని జగతి అడగగా అప్పుడు వసు రిషి సార్ లవ్ చేస్తే నేను కూడా ప్రేమించాలా మేడం అని అడుగుతుంది, దానికి జగతి రిషి గుండెను ముక్కలు చేసావు వసు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X