Guppedantha Manasu: వసు కొత్త రూమ్ కి రిషి.. షాకింగ్ గా గౌతమ్ ప్రవర్తన?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసుధార బావ రాజీవ్ ఆమెను బలవంతంగా ఎక్కడికో తీసుకు వెళ్లి పోతున్న క్రమంలో ఆమెను రిషి రక్షించి తన ఇంటికి తీసుకు వెళ్తాడు. అయితే దేవయాని వసుధారను అవమానించి ఈ ఇంటిలో ఉండడానికి ఏ అర్హత ఉంది అని ప్రశ్నించడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లి పోవడానికి సిద్ధమవుతుంది. అలా వెళ్ళిపోతున్న సమయంలోనే రిషి అడ్డుపడి ఉండవలసిందిగా కోరడంతో ఈ ఇంట్లో ఉండడానికి నాకు ఏమి అర్హత ఉందో సమాధానం చెప్పాలని వసుధార అంటుంది.
అయితే దానికి రిషి సమాధానం చెప్పలేక పోవడంతో ఆమె ఇంటిని వదిలేసి బయటకు వెళ్లి పోతుంది. అలా బయటకు వెళ్లిన ఆమె ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసు కోవడంతో ఎట్టకేలకు రిషి అనేక తంటాలు పడి ఆమెను కనుక్కుని ఆమె వెనకే వెళతాడు. అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టెన్షన్ పడుతుంటే
అక్కడ పిల్లలతో ఆడుకుంటూ ఉన్న సమయంలో వసుధార వెళ్లి రిషిని గట్టిగా పట్టుకుంటుంది. దొరికేసాడు కదా నీ పేరేమిటి అని అడగడంతో రిషీంద్ర భూషణ్ అని సమాధానం చెబుతాడు. దీంతో షాక్ తిన్న వసుధార వెంటనే కళ్లకు కట్టిన గంతలు తీసి మీరు ఇక్కడ ఎలా వచ్చారు అని అడుగుతుంది. మనసులో నిన్ను వదిలి ఉండలేక వెతుక్కుంటూ వచ్చాను అనుకుంటూనే బయటకు మాత్రం నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తాడు.
దానికి ఆమె నేను ఈ బస్తీలో రూం అద్దెకు తీసుకున్నా అందుకే ఇక్కడ పిల్లలతో ఆడుకుంటున్నా అంటే వచ్చీరావడంతోనే పిల్లలతో స్నేహం చేసేసావా అప్పుడే ఆటలు కూడా మొదలు పెట్టావా అని రిషి ప్రశ్నిస్తాడు. అంతే కాక నేను టెన్షన్ పడుతుంటే నువ్వు హ్యాపీగా ఆడుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు రిషి. దీంతో మీ పెద్దమ్మ ప్రశ్నలకు సమాధానం దొరకదనే ఇక్కడికి వచ్చేశానని చెబుతుంది వసుధార.

రూమ్ కి తీసుకువెళ్లి
అయినా అసలు మీరు ఈ ప్లేస్ ఎలా కనిపెట్టారు అని అడగడంతో, అసలు ఆ ప్లేస్ ఎలా కనిపెట్టాడో చెప్తాడు రిషి. అలా మాట్లాడుతూనే ఉండడంతో ఏమిటి నన్ను నీ కొత్త రూమ్ కి తీసుకు వెళ్ళవా ఇక్కడే నుంచోపెట్టి మాట్లాడతావా అని ప్రశ్నించడంతో తర్వాత తన రూమ్‌కి రిషిని తీసుకెళ్తుంది వసుధార. మరో పక్క సాక్షిని ఆయుధంగా ఎలా వాడాలో ఆలోచిస్తో ఉన్న దేవయానికి సాక్షి ఫోన్ చేస్తుంది.
తాను కాలేజీ కి వెళితే రిషి ఎలా రియాక్ట్ అయ్యాడు ? తనను అపాయింట్మెంట్ తీసుకోమన్నాడు అనే విషయాలను దేవయానికి చేరవేస్తుంది. అంతేగాక తాను జగతి తో మాట్లాడితే ఆమె కూడా కౌంటర్ వేసిన విషయాన్ని కూడా దేవయాని దృష్టికి తీసుకు వెళుతుంది. దీంతో దేవయాని క్లాస్ పీకుతూ రిషిని బుట్టలో వేసుకోవడానికి ఏం చేయాలో చెబుతుంది. ఎలా అయినా నువ్వు రిషిని పెళ్లి చేసుకోవాలి అని ఆమెకు నూరిపోస్తూ ఉంటుంది.

అల్లం చాయ్ ట్రీట్
ఇక ఈ గ్యాప్ లో తన కొత్త రూమ్‌కి రిషిని తీసుకెళ్తుంది వసుధార. వచ్చిన తర్వాత ఇక్కడ అంతా బాగానే ఉందా అని కుశల ప్రశ్నలు వేసి ఇంట్లో ఉండమంటే ఉండకుండా ఎందుకు వచ్చేసావు? నాకు చెప్పాలని పించలేదా అని అడుగుతాడు రిషి. దీంతో అక్కడి మాటలు అక్కడే వదిలేయండని వసుధార చెబుతుంది. సరే ఏదైతేనేమి నీ జీవిత లక్ష్యం మరచిపోకని రిషి సూచనలు ఇస్తాడు.
ఈక్రమంలోనే మా రూమ్ కి వచ్చారు కదా మీకు మంచి అల్లం చాయ్ ఇస్తానని చెప్పి ఆమె కలిపి ఇస్తుంది. దీంతో ఇద్దరూ కలిసి అల్లం చాయ్ తాగుతారు. రిషికి ఆ కలిసి అల్లం చాయ్ టేస్ట్ బాగా నచ్చుతుంది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళతాడు.

వసుధారకు జగతి ఫోన్
మరోపక్క జగతి, మహేంద్ర ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తుంటారు. ఇంతలో మంచి హుషారుగా వస్తాడు రిషి. అలా రావడం చూసి ఇద్దరూ షాక్ అవుతారు. వస్తూనే చాలా మంచి అల్లం టీ తాగానని ఇప్పటిలో టీ, కాఫీ అవసరం లేదని వదిన ధరణికి చెప్తాడు రిషి. ఏంటో ఉత్సాహంగా కనిపిస్తున్నావని రిషిని మహేంద్ర అడుతాడు.
మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని చెప్పి వెళ్లిపోతూ మీరూ వెళ్లి అల్లం టీ తాగండని చెప్తాడు రిషి. వసుధారను కలిసి ఉంటాడని జగతి, మహేంద్రతో అంటుంది. ఇక ఇంతలో వసుధారకు జగతి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావ్ ఎలా ఉన్నావ్ అని ఆరా తీయడంతో రిషి సర్ తన దగ్గరకు వచ్చి వెళ్ళాడని చెబుతుంది. ఇక మీదట అలా చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లి పోవద్దు అని జగతి చెబుతుంది.

కార్ ఎక్కాలంటే కండిషన్
మరో పక్క గౌతమ్ తన రూంలో వసుధార స్కెచ్ చూసి మురిసిపోతుంటాడు. ఎక్కడికి వెళ్లావో... దర్శనం లేదని భగ్నప్రేమికుడి డైలాగులు చెబుతూ ఉంటాడు. ఇంతలో రిషి వచ్చి స్కెచ్‌ను చూసి ఏంటని ప్రశ్నిస్తాడు. దీంతో తన కలల సుందరి అంటూ వసుధార అందం గురించి వివరిస్తుంటాడు గౌతమ్. రిషికి మండుతుంటుంది, వారి సంభాషణ సాగుతున్న సమయంలో ఎపిసోడ్ ముగుస్తుంది.
కమింగ్ అప్ ఎపిసోడ్ లో వసుధార కోసం కారుతో ఆమె రూమ్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు రిషి. వసుధార చూసి ఆశ్చర్యపోతుంది. అయితే మీతో పాటు కారులో రావాలి అంటే నేను చెప్పింది ఒకటి చేయాలి అని అంటుంది నా కార్లో రావడానికి నన్నే పని చేయమని అడుగుతున్నావా అని రిషి ప్రశ్నిస్తాడు.


Click it and Unblock the Notifications











