Guppedantha Manasu: దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వసుధార.. బిత్తరపోయిన రిషి

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. వసుధార బావ రాజీవ్ వసును బలవంతంగా ఎక్కడికో తీసుకు వెళ్లి పోతున్న క్రమంలో ఆమెను రిషి రక్షించి తన ఇంటికి తీసుకు వెళ్తాడు. అయితే దేవయాని వసుధారను అవమానించడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లి పోతుంది. అలా బయటకు వెళ్లిన ఆమె ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసు కోవడంతో ఎట్టకేలకు రిషి అనేక తంటాలు పడి ఆమెను కనుక్కుని ఆమె వెనకే వెళతాడు. ఆమెను కలిసి అల్లం టీ తాగి ఇంటికి వచ్చాక గౌతమ్ వసుధార స్కెచ్ చూస్తూ రిషి తో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గౌతమ్ కి వార్నింగ్

గౌతమ్ కి వార్నింగ్

గౌతమ్, రిషి మధ్య వసుధార విషయంలో మొదలైన డిస్కషన్ చివరికి వాగ్వాదంగా మారుతోంది. అయితే గౌతమ్ మాట్లాడే మాటలు రిషికి ఏమాత్రం అర్థం కావు. వసుధార గురించి గౌతమ్ పొగుడుతూ మాట్లాడుతూ ఉంటే రిషికి చాలా కోపం వస్తుంది. దానికి తోడు సాక్షి అని ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన వాళ్లు అంట కదా అని అడుగుతాడు.. అయితే సాక్షి గురించి అడిగితే చాలా రిషికి ఎక్కడలేని కోపం వస్తుంది. వెంటనే గౌతమ్ దగ్గరకు వెళ్లి అరేయ్ గౌతం నువ్వు చాలా అందంగా ఉంటావు, కానీ సాక్షి టాపిక్ తీసుకొస్తే మొహం షేప్‌లు మారిపోతాయని గౌతమ్‌ను అర్థం కాకుండానే బెదిరిస్తాడు. ఆ తరువాత రిషి వెళ్లిపోతాడు. వెళ్లిపోతున్న సమయంలో గౌతం చూశావా అర్థం అయ్యే అవ్వకుండా బెదిరిస్తున్నాడు వాడు బెదిరిస్తే మాత్రం నేను బెదిరి పోతానా అని ప్రశ్నిస్తాడు. ఇంతలో ఏంట్రా అని రిషి అన్నట్లు అనిపించడంతో ఆ సరే వెళ్ళిపోతున్నాను అంటాడు.

దేవయానికి షాక్

దేవయానికి షాక్

ఇక మరో పక్క రూంలో కూర్చుని ఆలోచిస్తూన్న రిషి రూమ్‌కి దేవయాని వస్తుంది. అవసరం లేని విషయాలు ఆలోచిస్తూ ప్రశాంతతకు దూరంగా ఉన్నావని ఆయనను ఓదార్చినట్టు ట్రై చేస్తుంది. అలాగే దేవుడు నీకు సాక్షికి ముడి పెట్టాడేమో ఆమె నీ భార్య అవుతుంది ఏమో అని అంటుంది దేవయాని, వెంటనే రిషి లేచి ఇప్పుడు ఆ టాపిక్ అవసరం లేదని ముఖం మీడియా చెప్పేస్తాడు. తనకు బయటకు వెళ్లే పని ఉందని తప్పించుకుంటాడు. ఒకసారి కాదనుకున్నాక దాని కోసం ఆలోచించనని తెగేసి చెప్పేస్తాడు రిషి. అయితే వీడు ఎన్ని సార్లు ఇలా తప్పించుకుంటాడు ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి అని దేవయాని భావిస్తూ ఉంటుంది అదే సమయంలో మెట్లు దిగి కిందకి రాగా సాక్షి ఎదురు వచ్చి లాంగ్‌ డ్రైవ్‌ కు వెళ్దామని రిషిని అడుగుతుంది. రిషి నాకు పని ఉంది నేను బయటికి వెళ్ళాలి అంటాడు, అయినా సాక్షి వినకుండా నీకు ఎక్కడ పని ఉంటే అక్కడికి లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం అంటుంది. కానీ ఆ ఆఫర్ రిజెక్ట్ చేసి వెళ్లిపోతాడు. ఇంతలో దేవయాని వచ్చి ఇలాంటివి చాలా జరుగుతాయి. మనం చాలా చేయాలంటూ ఆమెను బయటకు తీసుకెళ్తుంది.

రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న దేవయాని

రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న దేవయాని

కారులో రిషి వసు ఉంటున్న బస్తీ వైపు వెళ్తుంటాడు. వెనుకాలే దేవయాని, సాక్షి ఫాలో అవుతుంటారు. ఇలా మనం ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు కదా అని అని సాక్షి అంటే దానికి దేవయాని నువ్వు ఇంకా ఏ రోజుల్లో ఉన్నావు మనకు కొన్ని కావాలంటే ఇలాంటివి చేయక తప్పదు అని అంటుంది. మరోపక్క రిషి కారు బస్తీలో ఉన్న వసుధార ఇంటి వద్దకు వచ్చి ఆగుతుంది. రిషి వసుధార ఇంటిలోకి వెళ్తున్న క్రమంలో వెనుకాలే కారులో ఉన్న దేవయాని, సాక్షి ఏమి జరుగుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్లు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు తీయమని సాక్షికి దేవయాని చెబుతుంది. దీంతో ఆమె ఫొటోలు తీస్తుంది. రిషి గమనించే లోపే అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోతారు. కారులో రిషి, వసుధార రెస్టారెంట్‌ వద్దకు వెళతారు. కారులో వెళుతూ ఉండగానే వసుధార ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తే మళ్ళీ ఏమైనా కనిపించాయా కారు ఆపాలా అని అడుగుతాడు. అదేమీ లేదని ఆమె చెబుతుంది. ఆమెను రెస్టారెంట్ దగ్గర దింపి నువ్వు దిగితే నాకు వేరే పనులు ఉన్నాయి చూసుకోవాలి అంటాడు.

మళ్లీ పికప్ డ్రాప్

మళ్లీ పికప్ డ్రాప్

మరోపక్క దేవయానికి జగతి రూమ్‌కు వస్తుంది. దేవయాని వసుధ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తోంది. చూసావా నేను ఆమెను ఎలా పంపించి వేసాను అంటూ కోతలు కోయడానికి ప్రయత్నించడంతో వెళ్లిపోయిన వసుధార ఎక్కడ వస్తుందో అనే భయంతో సాక్షిని పిలిచి రిషి వెంటాడుతున్నారని జగతి చెబుతుంది. అంతే దేవయాని ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఏంటీ నాకేమీ తెలియదు ఆమె స్వయంగా వచ్చింది అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక మరోపక్క మళ్లీ రెస్టారెంట్‌ వద్ద వసుధార కోసం రిషి ఎదురు చూస్తుంటాడు. వసుధార వచ్చి కారులో రావాలంటే ఓ పని చేయాలని కండిషన్ పెడుతుంది. నా కారులో నేను దింపుతున్నారు అంటే మళ్లీ నాకే ఎదురు కండిషన్లో పెడుతున్నావు అని అడుగుతాడు రిషి.

దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వసుధార

దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వసుధార


సరే ఏదేమైనా సరే నని ఓకే చెప్తాడు. కారులో చెప్తానంటూ ఊరించి కారు ఎక్కిన తర్వాత తన రూమ్ కి తీసుకు వెళుతుంది వసుధార. కారులో రిషిని ఓ పదిహేను నిమిషాలు ఉండమని చెప్పి వెళ్తుంది. తరువాత లోపలికి వెళితే మీకు రుచికరమైన భోజనం వడ్డిస్తాను అని చెప్పి భోజనం వడ్డిస్తుంది.. తృప్తిగా తిని అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఎపిసోడ్ ముగించారు తరువాతి ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం రిషి వచ్చి తిని వెళ్లడంపై బస్తీలో ఆమెకు గది ఇచ్చిన వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తారు. ఆయన నీకు ఏమవుతారని వసుధారను నిలదీస్తారు. ఇప్పటికే ఇలాంటి మాటలు దేవయానితో పడి ఉన్న వసుధార కు విపరీతమైన కోపం వస్తుంది. తర్వాత రోజు ఉదయాన్ని రిషి ఫోన్ చేస్తే మీకు ఏమీ పని లేదా ఎందుకు ఇన్ని సార్లు ఫోన్ చేస్తున్నారు అంటూ గట్టిగానే రియాక్ట్ అవుతుంది వసుధార. రిషికి ఏం జరిగిందో అర్థం కాక షాక్ అవుతాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X