Guppedantha Manasu: రిషి మొహం మీద డోర్ వేసిన వసుధార.. ఐలవ్యూ చెప్పేసిన గౌతమ్

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. వసుధార బావ రాజీవ్ వసును బలవంతంగా ఎక్కడికో తీసుకు వెళ్లి పోతున్న క్రమంలో ఆమెను రిషి రక్షించి తన ఇంటికి తీసుకు వెళ్ళాడు. అయితే దేవయాని వసుధారను అవమానించడంతో ఆమె ఇంటి నుంచి వెళ్లి పోతుంది. అలా బయటకు వెళ్లిన ఆమె ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకోవడంతో ఎట్టకేలకు రిషి అనేక తంటాలు పడి ఆమెను కనుక్కుని ఆమె వెనకే వెళతాడు. ఆమెను కలిసి ఎప్పటి లాగే ఆమెను కారులో రెస్టారెంట్ కు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి, అటు నుంచి కాలేజీకి ఇలా షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. రిషికి భోజనం పెట్టిన వసుధారను దేవయాని పెట్టిన మనిషి అనుమానించి అవమానం కలిగేలా మాట్లాడుతుంది. అయినా ఆమె రిషి ఫోన్ చేయగానే అతనితో కలిసి బయటకు వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని దేవయాని పెట్టిన మనిషి గమనించి ఆమెకు చేరవేస్తుంది. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వసుధార ఇంటికి జగతి, మహేంద్ర

వసుధార ఇంటికి జగతి, మహేంద్ర

ఉదయాన్నే అల్పాహారం తినిపించడం కోసం వసుధారను బయటకు తీసుకు వెళ్ళిన రిషి, తిరిగి రూమ్‌కి వెళ్తుంటే..అక్కడ మహేంద్ర, జగతి వచ్చిన సంగతి వాళ్లు వేసుకొచ్చిన కార్డు ద్వారా గుర్తిస్తాడు రిషి. ఇప్పుడు వారి కంట పడితే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది అని అనుమానిస్తారు అనే ఉద్దేశంతో నేను రానని, వెనక్కి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మహేంద్ర సార్ జగతి మేడం కూడా వచ్చారు మీరు ఇలా వెళ్లిపోతాను అనడం కరెక్ట్ కాదు అంటూ ఆయనను బలవంతంగా లోపలికి తీసుకు వెళుతుంది. మళ్ళీ ఎక్కడా వెనక్కి వెళ్ళి పోతాడో అని చేయి పట్టుకొని తీసుకెళ్లడాన్ని బస్తీలోని దేవయాని మనిషి చూస్తుంది. ఈ సందర్భంగా రిషి, వసుధార, మహేంద్ర, జగతి కాసేపు మాట్లాడుకుంటారు. అందరూ వచ్చారు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినట్టు ఉంది అంటుంది వసుధార. అయితే రిషి అక్కడి నుంచి వెళ్లి పోవడానికి ఆతృతగా ఉంటే వసుంధర మాత్రం వెంటనే పంపించడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించరు. కానీ మహేంద్ర రిషి విషయంలో వెటకారం గా మాట్లాడటంతో నేనేమీ ఉపన్యాసం ఇవ్వడానికి రా లేదు అంటూ రిషి కూడా కాస్త గట్టిగానే సమాధానం చెబుతాడు.

వసుధార ను అవమానించిన బస్తీవాసులు

వసుధార ను అవమానించిన బస్తీవాసులు

ఇక మరో పక్క కట్‌ చేస్తే దేవయాని, సాక్షి రిషి విషయమే ఆలోచిస్తుంటారు. ఇలా వెంటపడి ఫోటోలు తీయడం, ఫాలో అవ్వడం ఇలా మనం చేస్తున్న పనులు కరెక్టేనా అని అడుగుతుంది సాక్షి. ఇలాంటి ఆలోచనలు ఏమీ లేదని తాను చెప్పినట్లు చేయాలని చెబుతుంది. అలా చేస్తే రిషితో నీ పెళ్లి ఖాయమని నేను చెప్పినట్టు మాత్రమే చేయాలని చెబుతుంది. వసుధార రూమ్‌ నుంచి జగతి, మహేంద్ర, రిషి వెళ్లిపోయిన తర్వాత దేవయాని సెట్ చేసిన మనిషి, తన భర్త అయిన ఇంటి ఓనర్ తో కొంతమంది బస్తీ వాసులను వెనకేసుకు వచ్చి అడుగుతారు. మగాళ్లు వచ్చి పోతుంటే బస్తీలో బాగోదని దేవయాని మనిషి అవమానంగా మాట్లాడుతుంది. వసుధార ఇది మీరు అనుకున్న విధంగా కాదు అని చెబుతుంది. అయినా సరే ఈ బస్తీలో ఎవరు ఎవరి ఇంటికి వచ్చినా సరే అందరూ చూస్తూ ఉంటారు అని ఇలా ప్రతిరోజూ ఎవరో ఒకరు రావడం మంచిది కాదని.. ఇలా వస్తారు అనుకుంటే కనుక వేరే రూమ్ చూసుకోమని చెప్పి వెళ్లిపోతారు.

సాక్షికి అభయం ఇస్తున్న దేవయాని

సాక్షికి అభయం ఇస్తున్న దేవయాని

మరోపక్క సాక్షి, ఫణీంద్ర, దేవయాని మధ్య డిస్కషన్ నడుస్తుంది. అప్పుడే లండన్ నుంచి వచ్చే చేయడం కరెక్ట్ కాదని చదువు కూడా పూర్తి చేసి ఉంటే బాగుండేదని ఫణీంద్ర అంటుంటే తాను అక్కడ ఉండలేకపోయాం అని ఇక్కడ వారు గుర్తొచ్చి వచ్చేసాను అని చెబుతుంది. బయటపడరు కానీ.. నువ్వంటే రిషికి చాలా ఇష్టమని సాక్షికి చెబుతుంది దేవయాని. ఏదైనా పని ఉంటే వెళ్లి రమ్మని ఫణీంద్ర అంటాడు. అయితే రిషి తో పెళ్లి చేస్తాను అని చెబుతున్న సమయంలో గతంలో ఏం జరిగిందో ఫణీంద్ర గుర్తు చేస్తాడు. ఈ విషయంలో వేరే వాళ్ల జోక్యం అవసరం లేదని వాళ్లే నిర్ణయించుకుంటారు అని ఫణీంద్ర చెబుతుండగానే రిషి, జగతి, మహేంద్ర వస్తారు. ఏంటీ ముగ్గురు కలిసి వస్తున్నారని దేవయాని. అడిగితే కలిసి వెళ్లలేదని కానీ కలిసి వచ్చామంటుంది జగతి. ఈ క్రమంలో ఈసారి సాక్షిని కూడా మీలో కలుపుకోవాలని సజెషన్ ఇస్తుంది. రిషి సాక్షిలకు పెళ్లి నిశ్చయమైందని గుర్తు చేస్తుంది. మీకు లేదేమో కానీ వాడికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు ఉంది త్వరలోనే మంచి ముహూర్తం చూసి వాళ్లకు పెళ్లి చేస్తాను అని అంటుంది.

మీకు పెళ్లి చేసేస్తాను అంటూ

మీకు పెళ్లి చేసేస్తాను అంటూ

దీంతో అది ఇప్పుడు అవసరమా అని రిషి అసహనం వ్యక్తం చేస్తాడు. అయినా దేవయాని వినిపించుకోదు. సాక్షి అన్నీ వదిలేసి నీకోసమే వచ్చేసిందని రిషికి చెబుతుంది. మన స్థాయికి తగ్గ కుటుంబం, నీ రేంజ్‌కు తగ్గ వ్యక్తి అంటూ సాక్షి విషయంలో బిల్డప్ ఇస్తూ అంతకన్నా నీకు ఇంకేమి కావాలి అంటూ దేవయాని తన ప్రయత్నాలు తాను చేస్తుంది. మరోపక్క వసుధార ఇంట్లో ఒంటరిగా కూర్చొని బస్తీ వాళ్ల మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఉంటే ఇలా ఇంత ఘోరంగా నీచంగా ఎలా ఆలోచిస్తున్నారని భావిస్తూ బాధపడుతుంది. ఇంతలో రిషి ఫోన్ చేస్తాడు. ఫోన్ మాట్లాడలేనని, వస్తానంటే వద్దు అనలేను అందుకే ఫోన్ ఎత్తకుండా ఉంటుంది. రెండోసారి లిఫ్ట్ చేస్తే నేను వస్తున్నాను అని చెబుతూ ఉండగా నేను ఇంట్లో లేను మీరు రావద్దు అని చెప్పే లోపు రూమ్ డోర్ తీస్తాడు రిషి. తనకు ఆమె అబద్ధం ఎందుకు చెప్పింది అని షాక్ అయ్యి చూస్తున్నా రిషిని చూసి వసుధార చాలా బాధపడుతూ ఉంటుంది.

ముఖం మీదే డోర్ వేసి

ముఖం మీదే డోర్ వేసి


ఎందుకొచ్చారు అని అడుగుతుంది వసుధార. ఆ ప్రశ్నకు మరింత షాక్‌ తిన్న రిషి ఏమైందని అడుగుతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్ధమవుతుందా ఆగు లోపలికి వస్తున్న అంటూ లోపలికి బయలుదేరుతున్న క్రమంలో మొహంపైనే డోర్‌ వేసేస్తుంది. రిషికి ఏమీ అర్థం కాదు. వసుధార అలా చేసేసరికి రిషి బ్రేకప్ అయిన అంత బాధగా వెనక్కి నడుస్తూ పడిపోతే మహేంద్ర వచ్చి పట్టుకుంటాడు. అలా ఈ ఎపిసోడ్ అయిపోతుంది. రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం నా ప్రేమను వసుధారకు చెబుదాం అనుకుంటున్నాను అని గౌతమ్‌ రిషితో అంటాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆల్‌దిబెస్ట్ చెప్పి రిషి పంపిస్తాడు. ఎలాగైనా నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అని అనుకుంటాడు. గౌతమ్ తన ప్రేమ సంగతి చెబుతుంటే చాటుగా చూస్తుంటాడు. దీంతో రాబోయే ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది అని చెప్పక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X