Guppedantha Manasu May 7th : వసుకి ప్రపోజ్ చేసిన గౌతమ్.. రిషి మీద ప్రేమను బయట పెట్టిన వసు?

స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఆసక్తికరంగా సాగుతుంది. వసుధార ఎవరికీ తెలియకుండా ఒక బస్తీలో ఇల్లు అద్దెకి తీసుకోవడంతో ఎట్టకేలకు రిషి అనేక తంటాలు పడి ఆమెను కనుక్కుని ఆమె వెనకే వెళతాడు. ఆమెను కలిసి ఎప్పటి లాగే ఆమెను కారులో రెస్టారెంట్ కు అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి, అటు నుంచి కాలేజీకి ఇలా షటిల్ సర్వీస్ చేస్తూ ఉంటాడు. అయితే బస్తీలో వసుంధరకు ఇల్లు అద్దెకి ఇచ్చినవారు ఇలా ప్రతిసారి ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటే ఇబ్బందిగా ఉంటుందని అవమానించే విధంగా మాట్లాడతారు. ఇంట్లో సాక్షి తో పెళ్లి గురించి మాట్లాడటంతో అక్కడ ఉండటం ఇష్టం లేక వసుధారను కలవాలని వెళతాడు రిషి. అయితే బస్తి వాళ్ళు ఆయనను మళ్ళీ చూస్తే ఇంకా ఎలా అవమానిస్తారు అనే ఉద్దేశంతో ఆమె నువ్వు రావద్దు అని రిషి కి చెబుతోంది. అప్పటికి వచ్చేయడంతో ముఖం మీదే తలుపు వేసేసింది. బాధతో వెనక్కి పడిపోతున్న ఆయనను తండ్రి మహేంద్ర వచ్చి అడ్డుకుంటాడు. ఇక అక్కడితో గత ఎపిసోడ్ ముగించారు. ఇక తాజా ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కొడుకు కోసం రంగంలోకి మహేంద్ర

కొడుకు కోసం రంగంలోకి మహేంద్ర

వసుధార మొహం మీద తలుపు వేయడం గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు రిషి. మహేంద్ర తీసుకొని వెళ్లి ఒక ఏకాంత ప్రదేశంలో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏమైపోతున్నావ్‌.. ఎటు వెళ్తున్నావ్‌ అంటూ అడుగుతాడు మహేంద్ర. జీవితం అనేది ప్రశ్న, జవాబుతో ముడిపడి ఉంటుందని చెప్పడమే కాక ఆ జీవితం ఒక్కసారి చిక్కు పడితే మరింత కష్టతరం అయిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇదంతా చేస్తున్నది నువ్వు సాక్షి నుంచి దూరమవడానికి లేక తప్పించుకోవడానికి అని అడిగితే తాను మాత్రం సాక్షి విషయంలో చాలా క్లారిటీగా ఉన్నానని తండ్రికి చెప్పాడు రిషి. తనే అనవసరంగా ఇండియా వచ్చిందని చెప్పిన రిషి, మా కాలేజీలో చదువుతూ అని చెప్పి టిసి తీసుకు వెళ్ళి పోయిన ఒక విద్యార్థి ఒక ఏడాది తర్వాత తిరిగి వచ్చి మళ్లీ నేను చదువుతాను అంటే ఊరుకుంటామా అని ప్రశ్నిస్తాడు. భలే తెలివైన పోలిక పోల్చారు అంటూ కొడుకు తెలివితేటలకు తండ్రి మురిసిపోతూ ఉంటాడు. అయితే వసుధార విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నావని పేర్కొన్న మహేంద్ర కొడుకు ఇంకేమైనా చెబుతాడు ఏమో అని భావిస్తూ ఉంటాడు.

అదేనా అర్థం చేసుకోవడం అంటే

అదేనా అర్థం చేసుకోవడం అంటే

అయితే మీరు ఏదో నా నుంచి ఆశిస్తున్నారని, ప్రశ్నే తప్పయినప్పుడు కోరుకున్న జవాబు ఎప్పటికీ ఉండదని చెప్పేస్తాడు. అయితే నీవు మీ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన ఒక్క వసుధారకే తప్ప ఎవరికీ అర్థం కావంటాడు మహేంద్ర. మొహం మీద తలుపు వేస్తే అర్థం చేసుకోవడమా అని ప్రశ్నిస్తాడు రిషి. సాక్షి విషయంలో నీ అభిప్రాయమేంటి అని అడుగుతాడు. ఆ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నానని చెప్పేస్తాడు. అక్కడి నుంచి మహేంద్ర వెళ్లిపోతాడు. తర్వాత వస్తానని చెప్పి రిషి అక్కడే ఉండిపోయాడు. ఒంటరిగా ఆలోచనలో పడితే వసుధార చెప్పిన మాటలే గుర్తుకు వస్తుంటాయి. వసుధార ఎందుకు దూరం పెడుతుంది? ఎందుకు ఆ విధంగా మాట్లాడింది అనే విషయం ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార అడిగిన ప్రశ్నలకు నా వద్ద సమాధానం లేదని... కనీసం వసుధార వద్ద అయినా సమాధానాలు ఉంటాయా అని ఆలోచనలో పడతాడు. మరోపక్క వసుధార ఒంటరిగా కూర్చొని బస్తీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు గుర్తుకు తెచ్చుకుంటుంది. రిషి మొహంపై తలుపు వేసిన విషయం కూడా గుర్తుకు తెచ్చుకొని ఆయన ఎంత బాధ పడి ఉంటారో అని ఆమె కూడా బాధ పడుతూ ఉంటుంది.

సీన్ కట్ చేస్తే

సీన్ కట్ చేస్తే

సీన్ కట్ చేస్తే రిషి ఒంటరిగా బెడ్‌రూంలో కూర్చొని ఆమె గురించ ఆలోచిస్తుంటాడు. మహేంద్ర, జగతి కూడా ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తుంటారు. వసుధార పోస్టర్ పట్టుకొని గౌతమ్‌ తన ప్రేమ గురించి గొప్ప గా భావిస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఏది ఏమైనా ఆరునూరైనా ఈరోజు నా మనసులో మాట ఆమెకు చెప్పేస్తానని గట్టిగా అరుస్తున్న టైంలో రిషి అక్కడికి వస్తాడు. ఏంటి పొద్దున్నే రెడీ అయ్యావని రిషి అడిగితే. ప్రేమ సంగతి వసుధారకు చెప్పేస్తానని గౌతమ్‌ సమధానం చెప్తాడు. గౌతమ్‌కి ఆల్‌ది బెస్ట్ చెప్పడంతో రిషి అరే ఇది నువ్వేనా. ఈ విషయంలో నువ్వు చాలా దుర్మార్గుడిని అనుకున్నాను కానీ ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తావని అనుకోలేదు ఎంతైనా నా ఫ్రెండ్ వి కదా అంటూ గౌతం ఇక రెచ్చిపోతాడు.

అసలు విషయం తేల్చమని

అసలు విషయం తేల్చమని

వెళ్లి ఈరోజు అసలు విషయం ఏమిటో తేల్చేమని చెప్పి పంపిస్తాడు. ఈ సమయంలోనే వసుధార మనసులో ఏముందో తెలుసుకోవడానికే ఇలా చేశాని మనసులో అనుకుంటాడు రిషి. తన ప్రశ్నలకు వసుధార వద్దయిన సమాధానాలు దొరుకుతాయోమో అని ఆలోచిస్తుంటాడు. కాలేజీలో గౌతమ్‌ వసుధారతో మాట్లాడుతున్న ఈ క్రమంలో ఆమె నుంచి ఎలాంటి సమాధానం వస్తుందా అని ఆత్రుతగా రిషి కూడా పక్కనుంచి చూస్తూ ఉంటాడు. అయితే లవ్ ప్రపోజ్ చేయడం అనేది భావించిన అంత ఈజీ కాదనే విషయం అర్థం చేసుకున్న గౌతం వసుంధర తో ఎలా అయినా మాట కలపడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, అలా మాట కలిపి సడన్గా ఆమెకు ఐ లవ్‌ యూ వసుధార అని చెప్పేస్తాడు గౌతమ్.

ప్రేమ వ్యక్తం చేసిన గౌతమ్

ప్రేమ వ్యక్తం చేసిన గౌతమ్

ఆ మాటకు షాక్ తింటుంది వసుధార. తొలిచూపులోనే ప్రేమలో పడిపోయానని సంఘటనలతో సహా గుర్తు చేస్తాడు. సరిగ్గా ఇదే సమయంలో ఎపిసోడ్ ముగిసింది. గౌతమ్ ఇచ్చిన స్కెచ్ ఓపెన్ చేస్తుంది వసుధార. చాలా బాగుంది అని మెచ్చుకుంటుంది. ఎవరు గీశారు అని అడిగితే... నేను మాత్రం కి లేదు కానీ అది ఎవరు గీసారు అనే విషయం కనిపెట్టమని అంటాడు గౌతమ్. కార్ లో కూర్చున్న తర్వాత వసుధార మనసులో ఎవరో ఉన్నారని రిషి దృష్టికి తీసుకువెళతాడు గౌతమ్. ఎవరో ఆ అదృష్టవంతుడు అని అంటాడు గౌతమ్. నా రూమ్ కి వెళ్ళిన తర్వాత స్కెచ్ చూసిన వసుధార కూడా తన బొమ్మను గొప్పగా గీసిన వ్యక్తి గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X