For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Guppedantha Manasu: షాకిచ్చిన డెలివరీ బాయ్.. సాక్షి పరువు పాయె.. ప్రేమ విషయం ఓపెన్ అయిన వసు!

  |

  గుప్పెడంత మనసు సీరియల్ లో ప్రస్తుతం వసుధార తన ప్రేమను ఎలా అయినా రిషింద్ర భూషణ్ కు వ్యక్తం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో సాక్షి కూడా వారిద్దరిని విడదీసి తాను రిషి కలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో జరుగుతున్న సన్నివేశాలు, సంఘటనలు ఆసక్తికరంగా అల్లుకుంటున్నారు దర్శకుడు. మరి తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తాను కొనిచ్చిన బట్టలు తీసుకువెళ్లిన వసుధార అందులో ఒక డ్రెస్ వేసుకుని రావడంతో దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడు రిషి. మీటింగ్ తర్వాత ఆమెతో మాట్లాడుతున్న సమయంలో అక్కడికి జగతి- మహీంద్రా రావడం చూసి అప్పటివరకు మాట్లాడిన విషయాలు కాకుండా ఆ మాట మార్చి చదువుల పండుగ బాగా చేయాలి అంటూ చెప్పి వెళ్ళిపోతాడు.. వసుధర కూడా వాళ్ళు రావడం చూసి కవర్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహేంద్ర చూసావా మనం రాగానే ఇద్దరు వెళ్లిపోయారు నేను అలిగాను జగతి అంటే నేనేం చేశాను అని అంటుంది ఆమె.

  నెమలికన్ను

  నెమలికన్ను


  వాళ్ళ పరిచయం ఎన్ని రోజులు అప్పుడే గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు బట్టలు కొని పెట్టుకుంటున్నారు నువ్వు ఎప్పుడైనా నాకు కొని పెట్టావా అంటే ఆ మాట నేను కదా అడగాలి నేను అడుగుతానేమో అని మీరే ముందు అడుగుతున్నారా అంటూ కౌంటర్ వేస్తుంది. సరే మీటింగ్ కి టైం అయింది కదా అంటూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక రిషి తన క్యాబిన్ కి వెళుతున్న సమయంలోనే క్లాస్ రూమ్ లో బ్లాక్ బోర్డ్ మీద చూస్తాడు ఆ బోర్డు మీద వసుధార వేసిన నెమలికన్ను కనిపిస్తూ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్ లో నుంచి వెళుతూ ఉన్న సమయంలో సాక్షి కనపడడంతోనే నీతో మాట్లాడాలి రిషి, ఇది నా పర్సనల్ విషయం నిన్ను ఇబ్బంది పెట్టేది కాదని చిన్న రిక్వెస్ట్ అంతే అంటుంది. నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అంటుంది. రిషి సడెన్ గా ఇదేంటి సాక్షి అంటే నా బర్త్ డే అని అబద్ధం చెప్పడం లేదు..భోజనానికి రమ్మంటున్నాను అంతేకదా అంటుంది.

  భోజనానికి

  భోజనానికి


  నేను జీవితంలో ఓడిపోయానో నాకు ఇంతే రాసిపెట్టి ఉందో తెలియదుకానీ నీ జీవితంలో ఫ్రెండ్ గా కూడా ఉండలేనా? అని అడుగుతుంది. నేను పబ్ కి రమ్మనడం లేదు కదా పద్ధతిగా ఇంటికి భోజనానికి రమ్మంటున్నానని అంటే అవును అని అంటుంది. జీవితంలో చాలా అలసిపోయాను..నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నావని అడుగుతుంది, ఈ ఒంటరితనం ఏదేదో ఆలోచనలు వచ్చేలా చేస్తున్నాయని అంటే చావు అంచుల వరకూ వెళ్లొచ్చిందని కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్న దేవయాని మాటలు గుర్తుచేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా వింటున్న వసుధార, ఒప్పుకోవద్దు సార్ అనుకుంటూ..రిషి సార్ ఒప్పుకోరు అనుకుంటూ ఉండగానే రిషి సరే సాక్షి అంటాడు.

  ఎంట్రీ ఇవ్వడంతో

  ఎంట్రీ ఇవ్వడంతో

  దీంతో సాక్షి ఆనందానికి అవధులుండవు. ఆమె ఆలోచిస్తూ రిషి భోజనానికి వస్తున్నాడంటే సగం నువ్వు సక్సెస్ అయినట్టే అని అనుకుని, రిషి మనసు మార్చాలి తన మనసులో చోటు సంపాదించుకోవాలి సాక్షి ఇది నీకు గోల్డెన్ అవకాశం అనుకుంటూ ఉంటుంది. నా టాలెంట్ మొత్తం రిషి ముందు చూపిస్తా అనుకుంటూ దేవయానికి కాల్ చేసి మీకో గుడ్ న్యూస్ అని విషయం అంతా చెబుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంతో డోర్ తీసిన సాక్షి..ఎదురుగా రిషిని చూసి ఆశ్చర్యపోతుంది. వెల్ కమ్ రిషి అంటే రిషి వెల్ కమ్ నా ఒక్కడికే కాదు సాక్షి అంటాడు ఇంతలో హాయ్ అంటూ గౌతమ్, జగతి, మహేంద్ర..నేను లేకుండా ఎలా ఉంటానంటూ వసుధార వరుసగా ఎంట్రీ ఇవ్వడంతో ఆమె షాకవుతుంది.

  బుక్ అవుతా

  బుక్ అవుతా


  ఒక్కర్ని పిలిస్తే ఇంతమంది వచ్చారేంటి అనుకుంటున్నావా? చదువుల పండుగ మీటింగ్ ఉంది..భోజనం చేస్తూ ఇక్కడే డిస్కస్ చేసుకుందాం అని అందర్నీ రమ్మన్నాను అంటాడు రిషి. గౌతమ్ మాట్లాడుతూ చెప్పకుండా అందరం వచ్చేశాం భోజనానికి ఇబ్బంది లేదు కదా అంటే దానికి రిషి సాక్షి ఆల్ రౌండర్..గబగబా చేసేస్తుంది అని అంటుంది. హలో సాక్షి గారూ మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అంటూ వసుధార కూడా లోపలకు ఎంట్రీ ఇస్తుంది. గౌతమ్ సాక్షి గారు కిచెన్ ఎక్కడుంది..మీరేం వంటలు చేశారో చూడాలని ఆత్రంగా ఉందని అంటే, సాక్షి నేను రిషిని పిలిస్తే అందరూ వచ్చారేంటి..నేను ఇద్దరికే ఆర్డర్ ఇచ్చాను..ఆర్డర్ కన్నా ముందే రిషి వచ్చాడు ఇప్పుడు కనుక అది వస్తే బుక్ అవుతానని అనుకుంటుంది.

  నేను మిమ్మల్ని అంటూ

  నేను మిమ్మల్ని అంటూ


  ఆ తరువాత ఆర్డర్ రావడం ఆమె పరువు పోవడం వెంటవెంటనే జరిగిపోతాయి. దీంతో ఆమె వసు పరువు కూడా పోతుంది కదా అని వెయిట్ చేస్తూ ఉండడంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రాబోతున్న ఎపిసోడ్ కమింగ్ అప్ లో సాక్షిపై మీ అభిప్రాయం ఏంటి..తను ఏం చెప్పినా మీరు ఊ అంటున్నారు అని అడిగిన వసుధార మాటలకు రిషి షాక్ అవుతాడు. వెంటనే .నా విషయం నాకు స్పష్టత ఉంది కానీ నీ సంగతేంటి.. నా మెడలో దండ ఎందుకు వేశావ్ అంటాడు. నేను మిమ్మల్ని అంటూ ఏదో చెప్పబోతోంది వసుధార.

  English summary
  Guppedantha Manasu Episode 507: Sakshi invites Rishi for lunch with an evil motive. But she gets shocked as other guests arrive at her doorstep.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X