Guppedantha Manasu Weekly Roundup: కన్నకొడుకును దత్తత తీసుకోబోతున్న మహేంద్ర.. మను రియాక్షన్ ఏంటంటే?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 15వ తేదీ ఎపిసోడ్ లో.. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ జరుగుతుండగా.. మను, అనుపమల పరువు తీసేలా మాట్లాడతారు కొందరు పేరెంట్స్. అయితే వారి మాటలకు మను నాక తండ్రి లేడని చెప్పబోతుండగా.. మహేంద్ర లేచి మనుయే నా కొడుకు అని అంటాడు. దీనికి అందరూ షాక్ అవ్వగా.. మహేంద్ర మాత్రం పదే పదే అదే విషయాన్ని చెప్పి మీటింగ్ అయిపోయింది వెళ్లిపోండని అంటాడు.

ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని అనుపమ వద్దకు వెళ్తుంది. నిజంగానే మహేంద్రే నీ కొడుకుకు తండ్రా అని అడుగుతుంది. వసు, మనులు ఇద్దరూ చాటుగా ఇదంతా వింటూ ఉంటారు. మహేంద్ర, నీకు మధ్య అక్రమ సంబంధం వల్లే మను పుట్టాడా అంటూ నీచంగా మాట్లాడుతుంది. ఇదంతా విన్న వసు మధ్యలో వచ్చి మీరు ఆగండి మేడమ్ అంటూ చెప్పుకొస్తుంది. మామయ్య ఆవేశంలో చెప్పారని.. దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని వివరిస్తుంది.

ఏప్రిల్ 17వ తేదీ ఎపిసోడ్ లో.. అనుపమ మహేంద్రపై ఫైర్ అవుతుంది. అలా అందిర ముందు మనుకు తండ్రిని నువ్వే అని చెప్పడం వల్ల సమస్య తీరిపోతుందనుకుంటున్నావు కానీ.. ఇంకా ఎక్కువవుతుందని అనుపమ చెబుతుంది. మా సమస్యలు నువ్విలా తీర్చాలనుకోవడం తప్పు అంటుంది. ఇక వసుధార కూడా ఇలా చేసి ఉండకూడదని.. మను, అనుపమలకు దీని వల్ల మరిన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందని వివరిస్తుంది.

ఏప్రిల్ 18వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర ఓ నిర్ణయానికి వస్తాడు. ముఖ్యంగా మను, అనుపమల సమస్యకు పూర్తి పరిష్కారం చూపిస్తానంటూ మనును దత్తత తీసుకుంటానని అంటాడు. దీనికి వసుతో పాటు అనుపమ కూడా షాక్ అవ్వగా తాను మాత్రం.. ఇదే చేయబోతున్నట్లు వివరిస్తాడు. అప్పుడే దేవయాని అనుపమకు ఫోన్ చేస్తుంది. కావాలనే ప్లాన్ తో ఇలా చేశారని, మా మరిదిని ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఎందుకు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది.
ఏప్రిల్ 19వ తేదీ ఎపిసోడ్ లో.. ఇక తాను తీసుకున్న నిర్ణయాన్ని తన అన్నయ్యకు, వారి కుటుంబ సభ్యులకు చెప్పేందుకు వెళ్తాడు. ఇన్విటేషన్ తో సహా వెళ్లి తాను మనును దత్తత తీసుకోబోతున్నట్లు వివరిస్తాడు. ఫణీంద్ర వద్దని చెప్పినా వినకుండా తాను ఇప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నానని.. ఇక ఇందులో ఎలాంటి మార్పూ ఉండదని అంటాడు. ఫణీంద్రకు ఇష్టం లేకపోయినా చప్పుడు చేయడు. కానీ శైలేంద్ర, దేవయానిలు మాత్రం షాక్ అవుతారు.

ఏప్రిల్ 20వ తేదీ ఎపిసోడ్ లో.. ఇక శైలేంద్ర మనుకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. మను మహేంద్రపై ఫైర్ అవుతాడు. నా పర్మిషన్ లేకుండా మీరు నన్ను దత్తత ఎలా తీసుకుంటారని, అయినా తన తల్లికి కూడా ఇది ఇష్టం లేదని అంటాడు. కానీ మహేంద్ర మాత్రం కచ్చితంగా ఇది జరగాలని, జరిగి తీరుతుందని చెబుతాడు. జరక్కపోతే నన్ను ఇకపై నువ్వు చూడలేవంటూ బెదిరిస్తాడు.


Click it and Unblock the Notifications











