Guppedantha Manasu Weekly Roundup: మను తాత ఎంట్రీ.. అనుపమ భర్త ఎవరో రివీల్.. రిషి పరిస్థితేంటి?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ లో..శైలేంద్ర మనును రెచ్చగొడతాడు. నీ తండ్రి ఎవరో నీకు తెలియదా.. తండ్రి కూడా తెలియకుండా జనాలు ఉంటారా అంటా ప్రశ్నిస్తాడు. శైలేంద్రను అడ్డుకోవడానికి మహేంద్ర, వసులు రాగా.. తండ్రి గురించి తెలియకోపవండ మను లోపమే అని అంటాడు. దీంతో మన తీవ్రంగా హర్ట్ అయి వెళ్లిపోతాడు. అతడికి నచ్చజెప్పేందుకు మహేంద్ర ప్రయత్నాలు చేస్తాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 April 1st to April 6th episode

ఏప్రిల్ 2వ తేదీ ఎపిసోడ్ లో.. మను అనకూడని మాట అన్నందుకు తెగ ఫీల్ అవుతాడు. తాను ఆ మాట అనేందుకు కారణం శైలేంద్ర రెచ్చగొట్టడం అని తెగ మదనపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత అనుపమను గట్టిగా నిలదీసి అయినా సరే మను తండ్రి ఎవరో తెలుసుకోవాలని డిసైడ్ అయి వెళ్లి అనుమపై ఫైర్ అవుతాడు. కానీ ఆమె మాత్రం నోరు విప్పదు. నీ వల్లే మను అనేక సమస్యలు ఎదుర్కుంటున్నాడని అంటాడు.

ఏప్రిల్ 3వ తేదీ ఎపిసోడ్ లో.. అనుపమపై మహేంద్ర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆమె భర్త ఎవరో చెప్పే వరకు వదలను అంటూ రెచ్చగొడతాడు. అప్పుడే అక్కడికి మను వచ్చి... మా అమ్మను అనడానికి మీరెవరు అంటూ కామెంట్లు చేస్తాడు. నాకే చెప్పలేదంటే మీక్కూడా చెప్పదనేగా.. మా అమ్మను ఇబ్బంది పెట్టడానికి మీరెవరూ అంటూ మహేంద్రపై ఫైర్ అవుతాడు. వసు.. కూడా ఊరుకోండి మావయ్యా అనగా సరేనంటాడు మహేంద్ర.

ఏప్రిల్ 4వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని ప్లాన్ వేస్తుంది. ముఖ్యంగా శేలేంద్ర, రాజీవ్ లను పిలిచి మరీ.. ఒక్కొక్కరూ ఒక్కొక్కరినీ టార్గెట్ చేయాలని అంటుంది. ఆపరేషన్ డీఆర్ఎస్ అని చెబుతూ.. మను సంగతి శైలేంద్ర చూసుకోవాలని, అనుపమ సంగతి తాను చూసుకుంటానని.. ఇలాగే వసు పై రాజీవ్ ఫోకస్ చేస్తాడని అంటుంది. ఒక్కటిగా వెళ్తే ఏం చేయలేకపోతున్నామని.. వేర్వేరుగా వెళ్లి శత్రువులపై గట్టి దెబ్బ కొట్టాలని అనుకుంటారు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 April 1st to April 6th episode

ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్ లో.. అనుపమ ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలని, జరిగిన విషయం మనుకు చెప్పాలని మహేంద్ర, వసులు అతడి వద్దకు వెళ్తారు. అక్కడే అనుపమ పెద్దమ్మ ద్వారా ఆమె ఎక్కడుందో తెలుసుకుని వెళ్తారు. అప్పటికే ఆమెను అడ్డుకున్న దేవయాని.. నీ భర్త ఎవరంటూ టార్చర్ చేస్తూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన వెంటనే ఆమెను అడ్డుకుని.. మీరు ఇంటికి వెళ్లకపోతే మీ పేరు ఫణీంద్ర సార్ కు చెబుతానంటూ వసు బెదిరిస్తుంది. ఆ తర్వాత వీరంతా కలిసి ఇంటికి చేరుతారు.

ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్ లో.. అనుపమ తండ్రి తన మనవడి గురించి తెలుసుకుంటాడు. అతడిని చూడాలని అనుకోగా.. ఏంజెల్ మనుకు ఫోన్ చేసి రమ్మంటుంది. కానీ అతడు రాననగా.. వసుకు ఫోన చేసి మనును తీసుకు రమ్మని చెబుతుంది. అలా వసు.. మనును విశ్వనాథం దగ్గరకు తీసుకెళ్లగా.. ఆయన తాతా అని పిలవమంటూ కోరతాడు. కానీ తాను మాత్రం పిలవనని.. తల్లితోనే బంధం లేని తనకు వారి కుటుంబ సభ్యులతో అవసరం లేదని అంటాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X