Guppedantha Manasu Weekly Roundup: రాజీవ్‌ను చంపింది మనుయేనా.. అసలు నిజాన్ని వసు బయట పెట్టగలదా?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 22వ తేదీ ఎపిసోడ్ లో.. వసుధార అనుపమతో మాట్లాడుతుంది. మను తండ్రి ఎవరో చెప్పాలని పదే పదే అడుగుతుంది. అది చెప్పలేనని కానీ మనును మాత్రం మహేంద్ర దత్తత తీసుకుంటేనే బాగుంటుందని అంటుంది. ఇప్పటికే తండ్రి ఉండగా.. మహేంద్ర సార్ దత్తత ఎందుకు తీసుకోవాలని వసు అంటుంది. అలాగే మను తడ్రి పేరు చెప్పమని అనుపమను అడుగుతూనే ఉండగా.. ఆమె నోరు విప్పదు. దాంతో అతడు చనిపోయాడని వసు అంటుంది.

ఏప్రిల్ 23వ తేదీ ఎపిసోడ్ లో.. మను తండ్రి చనిపోయాడని, అందుకే మీరు మహేంద్ర సార్ దత్తత తీసుకుంటానంటే ఓకే చెబుతున్నారని వసు అంటుంది. లేదు ఆయన బతికే ఉన్నారు, నువ్వు అలా అనొద్దని అనుపమ అనగా.. వసు పదే పదే ఆయన చనిపోయారంటూ గొడవ చేస్తుంది. అప్పుడే అనుపమ పెద్దమ్మ వచ్చి అతడు బతికే ఉన్నాడని.. మను కన్నతండ్రి మరెవరో కాదు మహేంద్రనే అని చెప్పుకొస్తుంది. దీంతో వసు షాక్ అవుతుంది.
ఏప్రిల్ 24వ తేదీ ఎపిసోడ్ లో.. వసు మనుకు నిజం చెప్పేస్తుంది. మహేంద్రనే మిమ్మల్ని కన్న తండ్రి అని వివరిస్తుంది. అప్పుడే మహేంద్ర అక్కడకు వచ్చి ఆ విషయం తెలుసుకుంటాడు. ఇది నీకెవరు చెప్పారని అంటాడు. అనుపమ పెద్దమ్మగారు చెప్పారని వసు అనగా.. మను కోపంతో ఊగిపోతాడు. గన్ తీసి మహేంద్రపై ఎక్కు పెడతాడు. చంపేస్తానంటూ బెదిరిస్తాడు. అయితే ఇదంతా అనుపమ కళ కంటున్నట్లు చివరకు చూపిస్తారు.
ఏప్రిల్ 25వ తేదీ ఎపిసోడ్ లో.. రాజీవ్ మనుకు ఫోన్ చేసి నీ తండ్రి గురించి చెబుతానంటూ రమ్మంటూ ఓ చోటుకు పిలుస్తాడు. అక్కడే రాజీవ్ మహేంద్ర మాస్కు పెట్టుకుని వచ్చి నేనే నీ తండ్రినంటూ రెచ్చగొడతాడు. ఆ తర్వాత మాస్క్ తీయగా.. నువ్వా అంటూ కోప్పడతాడు. అప్పుడే రాజీవ్ గన్ తీసి వసు విషయంలో మధ్యలోకి ఎందుకు వస్తున్నావంటూ కాల్చేస్తానంటాడు. అప్పుడే మను కూడా గన్ తీసి కాలుస్తాడు.

ఏప్రిల్ 26వ తేదీ ఎపిసోడ్ లో.. దత్తత కార్యక్రమం జరుగుతుండగా.. పోలీసులు వచ్చి మనును అరెస్ట్ చేస్తారు. రాజీవ్ ను హత్యే చేశాడంటూ చెప్పి తీసుకెళ్తారు. తన కళ్ల ముందే కొడుకును పోలీసులు తీసుకు వెళ్లగా.. అనుపమ టెన్షన్ పడిపోతుంది. తన కొడుకు హత్య చేసే అవకాశమే లేదని, అతడు అస్సలే అలా చేసి ఉండడని చెబుతుంది. కానీ దేవయామని మాత్రం అతడే చేశాడంటూ రచ్చ చేస్తుంది.
ఏప్రిల్ 27వ తేదీ ఎపిసోడ్ లో.. వసు, మహేంద్రలు పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. మనుయే హత్య చేశాడు అనడానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతుంది. అప్పుడే ఓ వీడయో చూపించగా.. అందులో మను కాల్చినట్లు ఉన్నా ఆ బుల్లెట్లు రాజీవ్ కు తగిలినట్లు లేవు కదా అంటుంది. అలాగే ఓ సాక్షిని చూపించగా.. అతడు మను పీఏ అని తెలుస్తుంది. అతడు కూడా కాల్చినట్లే చెబుతాడు. కానీ ఆ బుల్లెట్లు రాజీవ్ కు తగిలినట్లు చూడలేదంటాడు. వసు కూడా ఇదే పోలీసుకు చెబుతుంది.


Click it and Unblock the Notifications











