Guppedantha Manasu Weekly Roundup: మనును కాపాడేందుకు ఎండీ పదవికి వసు రిజైన్.. ట్రాప్‌లో పడ్డ శైలేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 29వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ 29వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని రాజీవ్ నిజంగానే చనిపోయాడా అంటూ తన కొడుకు శైలేంద్రను అడుగుతుంది. నిజంగానే రాజీవ్ చనిపోయాడంటే తట్టుకోలేకపోతున్నానంటుంది. కానీ శైలేంద్ర మాత్రం వాడు చనిపోతే నీకేంటంటూ అడుగుతాడు. మనతో పాటు పగ తీర్చుకోవాలనుకుని ఇలా చనిపోయాడు.. ఇందులో నీ హస్తం ఏమైనా ఉందా అంటూ దేవయాని ప్రశ్నిస్తుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 April 29th to May 4th episode

ఏప్రిల్ 30వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర.. మహేంద్రకు ఫోన్ చేస్తాడు. తనను కలవాలని మాట్లాడాలని అంటాడు. రానని మహేంద్ర చెప్పగా బతిమాలి మరీ రప్పించుకుంటాడు. అక్కడకు వెళ్లగానే.. మనుయే ఈ హత్య చేసి ఉంటాడని.. వసుపై మనసు పడ్డ మనుయే ఇదంతా చేశాడంటూ అంటాడు. దీంతో తీవ్ర కోపానికి గురైన మహేంద్ర.. ఇదంతా నీవే చేశావని నాకు డౌట్ గా ఉందంటాడు. ఏం చేశావో చెప్పమని, మాను నీకంటే పెద్ద శత్రువులు ఎవరూ లేరంటూ చెప్పుకొస్తాడు.

మే 1వ తేదీ ఎపిసోడ్ లో.. మనును చూసేందుకు అనుపమ జైలుకు వెళ్తుంది. అక్కడే మను తన తల్లిని చూసి మాట్లాడతాడు. మనం ఇన్ని సమస్యలు ఎదుర్కోవడానికి కారణం తన తండ్రేనని ఆయన కనిపిస్తే.. మనకు ఇన్ని సమస్యలు వచ్చేలా ఎందుకు చేశాడో నిలదీస్తానంటూ ఫైర్ అవుతాడు. అంతటితో ఆపకుండా చంపేస్తానంటూ ఆవేశంగా మాట్లాడగా.. అనుపమ అతడిని ఆపుతుంది. ఎంత కోపం వచ్చినా, ద్వేషం ఉన్నా.. నువ్విలా చేయకూడదని, ప్రవర్తించకూడదని అంటుంది.

మే 2వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని అనుపమ, వసులను కలిసేందుకు వస్తుంది. అక్కడే మను గురించి మాట్లాడుతూ.. అతడే ఈ హత్య చేశాడంటూ నిందలు వేస్తుంది. వసు విషయంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని.. ప్రతీసారి వసు విషయంలో అడ్డు రావడంతోనే.. వారి మధ్య మాటామాటా పెరగి ఉంటుందని అంటుంది. ఆ కోపంతోనే మను హత్య చేశాడంటూ.. మను వసుపై మనసు పడ్డాడని అంటుంది. దీంతో అనుపమ ఫైర్ అవ్వగా.. వసు మాత్రం దానంతటినీ వీడియో తీసి ఫణీంద్రకు పంపిస్తుంది.

మే 3వ తేదీ ఎపిసోడ్ లో.. రాజీవ్ నేరుగా జైలుకు వస్తాడు. టీ ఇచ్చే వాడిలా వేషం మార్చుకుని మను వద్దకు వచ్చి ఆయనకు కనిపిస్తాడు. ఈ విషయాన్ని మను పోలీసులకు, మహేంద్ర, వసులకు చెబుతాడు. ఇదంతా నమ్మని పోలీస్ హత్యా నేరం నుంచి తప్పుకోవడానికి మను ఇలా చేస్తున్నాడని అంటాడు. మహేంద్ర మాత్రం నీ గురించి నాకు తెలుసు.. నిన్ను నేను బయటకు తీసుకు వస్తానంటూ వివరిస్తాడు.

మే 4వ తేదీ ఎపిసోడ్ లో.. వసుధార, మహేంద్రలు కలిసి రాజీవ్ బతికే ఉన్నాడనే నిర్ణయానికి వస్తారు. ఈక్రమంలోనే ఇందులో శైలేంద్ర హస్తం కచ్చితంగా ఉంటుందని ఓ అదిరిపోయే ప్లాన్ వేస్తారు. ముఖ్యంగా వసు తాను ఎండీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెబుతుంది. బోర్డు మీటింగ్ పెట్టి మరీ.. కొత్త ఎండీని తీసుకు రావాలంటూ వివరిస్తుంది. అదంతా విన్న బోర్డు సభ్యులు శైలేంద్రను ఎండీగా చేయాలని అంటారు. ఫణీంద్ర కూడా ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి కానివ్వండి అంటూ కనిపిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X