Guppedantha Manasu Weekly Roundup: వసు, మనులపై డీఆర్ఎస్ స్కెచ్.. ఈ మీటింగ్‌లో అదే జరగనుందా?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ లో.. ఏంజెల్ మనుకు ఫోన్ చేసి కలవాలంటుంది. అతను కలవనని చెప్పగా వసుకు ఫోన్ చేసి తన తాతయ్య వద్దకు మనును తీసుకురావాలంటుంది. ఆ విషయం చెప్పకుండా తీసుకు వస్తే సర్ ప్రైజ్ చేయొచ్చని అనగా.. వసు విశ్వనాథం వద్దకు మనును తీసుకు వెళ్తుంది. కానీ అతడు మాత్రం తన తాతతో మాట్లాడడానికి ఇష్టపడడు. విశ్వం ఏంతో ప్రేమగా దగ్గరకు వచ్చినా తన తల్లి ప్రేమకే దూరం అయ్యానని.. ఇంకా ఆమె తరఫు వాళ్ల ప్రేమ తనకు ఎందుకని అంటాడు.

ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్ లో.. మను వసుధారతోమాట్లాడుతూ.. తన జీవితం అలా కావడానికి కారణం తన తండ్రి అని చెబుతాడు. అతడెవరో తెలుసుకని.. తన తల్లిని తీసుకు వెళ్లి మరీ మా బతుకులు ఇలా ఎందుకు చేశావని గట్టిగా నిలదీస్తానంటూ చెప్పుకొచ్చాడు. వాడి వల్లే తాము ఈరోజు నరకం అనుభవించాల్సి వస్తోందని, అందరి చేత మాటలు పడాల్సి వస్తుందని వివరించాడు. చాటుగా ఈ విషయాన్ని అంతా మహేంద్ర వినేశాడు.
ఏప్రిల్ 10వ తేదీ ఎపిసోడ్ లో.. కాలేజీలో ఉన్న వసుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి రిషి కనిపించాడని.. ఆయన మీ భర్తేనా అని అడుగుతాడు. అవునని చెప్పి నేను వస్తున్నానంటూ పరుగున వెళ్తుంది వసు. కానీ అక్కడకు వెళ్లగా రాజీవ్ కనిపిస్తాడు. మరదలు పిల్లా అంటూ ఫోన్ చేయించింది తానేనని చెబుతాడు. ఆ తర్వాత తాళి కట్టేందుకు ప్రయత్నించగా.. మను ఎంట్రీ ఇస్తాడు. గన్ తో కాలుస్తూ మరీ రచ్చ చేస్తాడు. కావాలనే పక్కన కాల్చానని ఇంకోసారి వసు జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని హెచ్చరిస్తాడు.

ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర మనును కాలేజీకి రావాలంటూ బతిమాలుతాడు. ఎలాగైనా సరే నీవు రావాలి బ్రో.. నువ్వు సాయం చేయబట్టే ఈరోజు కాలేజి మంచి స్థితిలో ఉందంటూ చెప్పుకొస్తాడు. అయినా నేను రావాలని నువ్వెందుకు ఇంతలా అడుగుతున్నావు అనగా.. మనసులో నువ్వు రాకపోతే నేను గార్డుగా పని చేయాల్సి వస్తుందని అనుకుంటాడు. నీ అవసరం కాలేజీకి చాలా ఉంది అందుకే రమ్మంటున్నానంటూ శైలేంద్ర చెప్పగా నేను రానని ఫోన్ పెట్టేస్తాడు. మళ్లీ ఫోన్ చేస్తే.. మర్యాదగా ఉండదని మెసేజ్ చేస్తాడు.
ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్ లో.. బోర్డు మీటింగ్ జరుగుతుంది. అయితే మీటింగ్ కు వచ్చిన దేవయాని వసుపై కోప్పడుతుంది. నువ్వు రిషిని మర్చిపోయావంటూ నిందలు వేస్తుంది. అందుకే మూడు నెలల్లోనే అతన్ని తీసుకు వస్తానని చెప్పిన నీవు ఇప్పటికీ తీసుకురాలేకపోయావంటూ చెప్పుకొస్తుంది. మను మధ్యలో కల్గజేసుకోగా.. నువ్వేం మధ్యలోకి రాకు నీకు సంబంధం లేదని అంటుంది దేవయాని. కానీ ఫణీంద్ర మధ్యలోకి వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచిస్తాడు. ఆ తర్వాత దేవయాని, శైలేంద్రలు ఇద్దరూ వెళ్లిపోతారు.
ఏప్రిల్ 13వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని, రాజీవ్, శైలేంద్రలు కలిసి మను, రిషి, అనుపమల పరువు తీసేందుకు ప్లాన్ వేశారు. పేరెంట్స్, టీచర్ మీటింగ్ లో వారిని నొప్పించేలా మాట్లాడలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు డబ్బులు కూడా ఇస్తారు. ఇక ఆ తర్వాత మీటింగ్ ప్రారంభం అవుతుంది. మీ పిల్లలకు అటెండెన్స్ తగ్గడం వల్లే ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చిందని చెబుతుంది. అటెండెన్స్ తగ్గితే అన్ని రకాలుగా వెనుక పడిపోతారని అంటుంది. అలాగే అక్కడే ఉన్న ఓ విద్యార్థిని లేపి ఎందుకు అటెండెన్స్ తగ్గిందని అనగా.. అతడి తల్లి లేచి చెడువాసాలు చేస్తూ కాలేజీకి రావట్లేదని అంటుంది.


Click it and Unblock the Notifications











