Guppedantha Manasu Weekly Round up: కొత్త ఎండి ని ప్రకటించబోతున్న వసుధార.. శైలేంద్ర తిక్క కుదిర్చిన రిషి!
మినిస్టర్ కాలేజీని రిషి చూసుకుంటాడు అని చెప్పడంతో తన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వలేదని కోప్పడుతుంది దేవయాని. మరోవైపు వచ్చిన వ్యక్తి రిషి కాదని తెలిసిన తండ్రి తనని ఇంట్లోంచి గెంటేసినట్లు కలగంటాడు శైలేంద్ర. వసుధార వాళ్ళని తమతోనే ఉండిపోమని రిక్వెస్ట్ చేస్తాడు ఫణీంద్ర కానీ వసుధారకి ఇష్టం లేకపోవడంతో అందుకు ఒప్పుకోడు మహేంద్ర. మరోవైపు రిషి తనని ఎండిగా ప్రకటించిన వెంటనే అతనిని పైకి పంపించేయాలి అని తల్లితో అంటాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక ఆగష్టు12 వ తేదీ నుంచి ఆగష్టు 17వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
ఆగష్టు12 వ తేదీ 1152 ఎపిసోడ్ లో రిషి వాళ్ళు కాలేజీలో లేనప్పుడు జరిగిన సంఘటనలన్నీ కొడుక్కి కోడలికి చెప్తాడు శైలేంద్ర. కాలేజీకి మళ్ళీ ఎండిగా ఉండను అంటుంది వసుధార. ఎందుకు ఉండవు అని అడిగినా రిషితో నాకు బాధ్యతలు అప్పగిస్తే మీరు మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారు అని భయంగా ఉంది అంటుంది వసుధార. ఇక మీదట ఎక్కడికీ వెళ్ళను అని మాటిస్తాడు రిషి. మరోవైపు రిషి ఎక్కడున్నాడో తెలుసుకోవటం కోసం ధనరాజ్ ని ట్రాప్ లో దించుతుంది సరోజ. మరోవైపు ఎండి గా ఎవరిని ప్రకటిస్తావు అని శైలేంద్ర అడిగితే అర్హత ఉన్నవాడని ప్రకటిస్తాను అంటాడు రిషి. మరోవైపు తమని చూడటానికి వచ్చిన అనుపమకి అంతవరకు తండ్రికి తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు రిషి. మీ స్నేహితురాలిని చంపిన వాళ్ళని మీ ముందు నిలబడతాను అని మాటిస్తాడు.

ఆగష్టు14 వతేదీ 1154 ఎపిసోడ్ లో బుజ్జి ఎందుకు ఫోన్ చేశాడో వసుధార కి చెప్పిన రిషి ఫ్లోలో మా సరోజ అనేస్తాడు. అందుకు అతనితో గొడవ పడుతుంది వసుధార. నువ్వెందుకు అంత జలస్ ఫీల్ అవుతున్నావు అంటూ ఆమెని ఆటపట్టిస్తాడు రిషి. మరోవైపు పాండు దగ్గరికి వచ్చిన శైలేంద్ర అతడిని కోప్పడుతూ ఎన్నాళ్ళకి నేను కంటున్న కలం నిజం కాబోతుంది దాన్ని పాడు చేయొద్దు అంటాడు. శైలేంద్ర మాట్లాడుతూ ఉండగానే అతడిని కిడ్నాప్ చేస్తారు పాండు మనుషులు. మరోవైపు కొడుకు పొద్దున్నే కాలేజీకి వెళ్లిపోయాడు అని తెలుసుకున్న ఫణీంద్ర కాలేజీ ఎండి సీట్ మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దని హెచ్చరిస్తాడు. అంతేకాకుండా భార్యని కాలేజీకి రాకుండా అదుపు చేస్తాడు.మరోవైపు కాలేజీని వదిలేసుకుందాం కాలేజీ వల్లే మన జీవితాలు తారుమరైపోయాయి అని రిషితో అంటుంది వసుధార. మరోవైపు తనని కిడ్నాప్ ఎందుకు చేశారో ఎవరు చేశారో తెలియక కంగారు పడతాడు శైలేంద్ర తనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వదిలేయమని బ్రతిమాలుతాడు. మరోవైపు మీటింగ్ కి రాలేని కొడుకుని ఏం పెత్తనాలు వెలగబెడుతున్నాడో అని తిడుతూ ఉంటాడు ఫణీంద్ర. తనకోసం వెయిట్ చేయొద్దు మీటింగ్ స్టార్ట్ చేయమంటాడు.

ఆగస్టు 15 వ తారీకు 1155 ఎపిసోడ్ లో తనని కిడ్నాప్ చేసిన వ్యక్తి మను అని తెలిసి షాక్ అవుతాడు శైలేంద్ర. ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని మనకి ఏమైనా గొడవలు ఉంటే తర్వాత చూసుకుందామని చెప్తాడు శైలేంద్ర. అందుకు ఒప్పుకోని మను తన తండ్రి ఎవరో చెప్తే వదిలేస్తాను అంటాడు. కానీ శైలేంద్ర చెప్పటానికి ఇష్టపడడు. అయితే కాలేజీ ఎండి ఎవరో తెలుసుకునే క్రమంలో శైలేంద్ర ఫోన్ తో ఫణీంద్ర కి ఫోన్ చేస్తాడు మను . ఫణీంద్ర మాటలలో తనని రిషి ఎండిగా ప్రకటించలేదని, కొత్త ఎండిని వసుధార ప్రకటిస్తుందని తెలుసుకున్న శైలేంద్ర నీ తండ్రి మహేంద్ర అని చెప్తాడు.అయితే మను ఆ మాటలు నమ్మకుండా, అబద్ధం చెప్తున్నాడని అతని చెంప పగలగొడతాడు. అయితే శైలేంద్ర తన దగ్గర సాక్ష్యం ఉందని ఫోన్ చేసి వసుధర రాసిన లెటర్ ని సెండ్ చేయమంటాడు. మరోవైపు వసుధార రిషిని ఎండిగా ప్రకటిస్తుంది తనకి రెడీగా ఉండడం ఇష్టం లేదని మీటింగ్ నుంచి వెళ్ళిపోతాడు రిషి. అయితే వసుధార అతడికి నచ్చజెప్పి మళ్లీ మీటింగ్ కి తీసుకు వస్తుంది. శైలేంద్ర ప్రమాదంలో పడ్డాడేమో అని అనుమానించిన దేవయాని భర్తకి ఫోన్ చేస్తుంది.
ఆగష్టు 16 వ తారీకు 1156 ఎపిసోడ్ లో భర్త మాటలలో శైలేంద్ర మీటింగ్లో లేడని ప్రమాదంలో చిక్కుకున్నాడని గ్రహిస్తుంది దేవయాని వెంటనే వసుధార రాసిన లెటర్ ని ఫోటో తీసి సెండ్ చేస్తుంది. మరోవైపు మీటింగ్ లోకి వచ్చిన రిషి ని డైరెక్టర్లు అందరూ ఎండిగా ఉండటానికి ఒప్పిస్తారు. మరోవైపు దేవయాని పంపించిన లెటర్ చూసి షాక్ అవుతాడు మను. మనోయే తన కొడుకుని కిడ్నాప్ చేశాడని అర్థం చేసుకున్న దేవయాని అతనితో మాట్లాడుతూ తన కొడుకుని వదిలేయమని ఇది మాకు చాలా విలువైన సమయం అని చెప్తుంది, నాకు తెలిసిన విషయం నీకు చెప్పాము అది నిజమో కాదో నువ్వే నిర్ధారించుకో అని కూడా చెప్తుంది. సరే ఈ విషయం నాకు తెలుసని మీరు కూడా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పి శైలేంద్రని విడుదల చేస్తాడు మను. అయితే శైలేంద్ర మీటింగ్ కి వెళ్లేసరికి అక్కడ రిషి ఎండిగా నియమించబడ్డాడని తెలుసుకొని షాక్ అవుతాడు. ఫ్రస్టేట్ అవుతున్న కొడుకుపై కోప్పడతాడు ఫణీంద్ర. తర్వాత ఒంటరిగా రిషిని కలుసుకొని ఇలా ఎందుకు చేశావని నిలదీస్తాడు మీరు మీటింగ్ కి రాలేదు, ఏం చేయాలో తెలియలేదు అందుకే అలా చేశాను అని శైలేంద్రని బోల్తా కొట్టిస్తాడు రిషి.

ఆగస్టు 17 వ తారీకు 1157 ఎపిసోడ్ లో తన తండ్రి ఎవరో అందరికీ తెలిసిన తనకి చెప్పలేదని బాధపడతాడు మను తను కూడా నిజం తెలియనట్లే ప్రవర్తించాలి అనుకుంటాడు. మరోవైపు తన కారుకి అడ్డగా నిలబడిన సరోజ ని చూసి కార్ ఆపుతాడు రిషి. తనతో పాటు వచ్చే ఏమంటుంది సరోజ, తన బావని మార్చేసిందని వసుధార పై కాపాడుతుంది. వసుధారనేమి అనొద్దని, తను ఇప్పుడు వచ్చే పరిస్థితులలో లేనని ఇంటికి తిరిగి వెళ్ళిపొమ్మని సరోజకి చెప్పి వసుధారని తీసుకొని వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు తండ్రి గురించిన వివరాలు అడుగుతూ అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్న కొడుకు వింత ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతుంది అనుపమ. మహేంద్ర కూడా తనకి ఎందుకో చాలా ఆనందంగా ఉందని, ఆనందంలో ఏం చేయాలో కూడా తెలియడం లేదని కోడలితో చెప్తాడు. తెలియాల్సింది త్వరలోనే తెలుస్తుంది అంటుంది వసుధార.మరోవైపు తను ఎండి కాలేకపోయినందుకు చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు శైలేంద్ర. ఒక పని కూడా సరిగ్గా చేయలేవని అతడికి చివాట్లు పెడుతుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











