Guppedantha Manasu Weekly Round up: ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో మహేంద్ర.. అసలు రంగాని పరిచయం చేసిన రిషి!

తనని ఎక్కడ ఋషి వదిలి వెళ్ళిపోతాడు అని కాలేజీకి ఎండిగా ఉండను అంటుంది వసుధార. మరోవైపు అనుపమకి తన స్నేహితురాలిని చంపిన హంతకులని ఆమె ముందు నిలబెడతానని మాట ఇస్తాడు రిషి. మరోవైపు శైలేంద్ర ని కిడ్నాప్ చేయించిన మను తన తండ్రి మహేంద్ర అని తెలిసి షాక్ అవుతాడు. అదే సమయంలో కంపెనీకి ఎండిగా రిషిని ప్రకటిస్తుంది వసుధార. మరోవైపు రిషిని తనతో పాటు ఊరికి వచ్చే ఏమంటుంది సరోజ. ఇప్పుడు వచ్చే పరిస్థితులలో లేను అని చెప్పి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు తను ఎండి కాలేనందుకు చిన్నపిల్లాడిలా ఏడుస్తాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక ఆగష్టు19 వ తేదీ నుంచి ఆగష్టు 24వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

ఆగష్టు19 వ తేదీ 1158 ఎపిసోడ్ లో తనని అంతగా హెచ్చరించిన శైలేంద్ర మీటింగ్ కి ఎందుకు రాలేదు అని ఆలోచనలో పడతాడు రిషి. అందుకు కారణం నువ్వు కాదు కదా అని భార్యని ఆట పట్టిస్తాడు. మరోవైపు తండ్రి ఎవరో తెలిసిన మను ఎందుకు నేను నా తండ్రిని ఏమీ చేయలేకపోతున్నాను రక్తసంబంధం అడ్డుపడుతుందా అనుకుంటాడు. మరోవైపు మనకి నిజం తెలియటం లాభమా నష్టమా అని తల్లిని అడుగుతాడు శైలేంద్ర. ముందు మానవుని మహేంద్ర మీదికి ఎలా రెచ్చగొట్టాలో ఆలోచించు అని కొడుక్కి సలహా ఇస్తుంది దేవయాని. మరోవైపు శైలేంద్ర కాలేజీకి రాకపోవడానికి కారణం మను అని ధరణి ద్వారా తెలుసుకుంటుంది వసుధార. మను తండ్రి విషయం రిషికి ఎలాగైనా తెలియజేయాలి అనుకున్న వసుధార భర్తని తనతో పాటు అనుపమ ఇంటికి రమ్మంటుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 August 19th to August 24th episode
ఆగష్టు20వ తారీకు 1159 ఎపిసోడ్ లో రిషి వాళ్ళతో మహేంద్ర వస్తాను అంటే అతడిని ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్ళిపోతారు రిషి, వసుధార. వాళ్లు తన దగ్గర ఏదో దాస్తున్నారని ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుంటాడు మహేంద్ర. మరోవైపు మనుని బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గరకి తప్పించుకుంటాడు శైలేంద్ర. మరోవైపు అనుపమ ఇంటికి వచ్చిన వసుధార మను తండ్రి గురించి ఆమె సమక్షంలోనే రిషికి చెప్తుంది. ఆ మాటలకి రిషి తో పాటు చాటుగా వింటున్న మహేంద్ర కూడా షాక్ అవుతాడు. మనుతో మాట్లాడుతున్న శైలేంద్ర నీ తండ్రి ఎవరో తెలిసింది కదా ఏం చేయబోతున్నావు అని అడుగుతాడు. నేను ఏం చేయాలో నాకు తెలుసు ఈ ఆగస్టు అయ్యేలోగా ఏం చేస్తానో చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు మను.

ఆగష్టు21 వతేదీ 1160 ఎపిసోడ్ లో మను తనతో అన్న మాటలను గురించి తల్లితో చెప్తాడు శైలేంద్ర. మహేంద్ర అంటే అభిమానం అందుకే ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదేమో అంటుంది దేవయాని. మరోవైపు మనుకి నేను తండ్రిని ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతాడు మహేంద్ర. ఈ విషయంగా మనం తో మాట్లాడాలని ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు. కొడుకు ప్రవర్తన చూసి తండ్రి గురించి తెలుసుకున్నాడని గ్రహిస్తుంది అనుపమ. మరోవైపు మనకి నేను తండ్రిని ఏమిటి ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనుకుంటాడు మహేంద్ర. మరోవైపు రిషి వసుధార క్యాబిన్లో మాట్లాడుకుంటూ ఉంటే పర్మిషన్ లేకుండా వచ్చేస్తాడు శైలేంద్ర అతడిని కాపాడుతుంది వసుధార. వసుధార మీద కోప్పడతాడు రిషి. తర్వాత ఆమెకి క్షేమపణ చెప్తాడు. తర్వాత రిషి మాట్లాడుతూ పసుధార నీ గురించి ఏవేవో చెప్తుంది అయినా అవన్నీ నాకెందుకు మీ ఎండీ సీటు మీకు అప్పగించేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తున్నాను అని శైలేంద్రతో అంటాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 August 19th to August 24th episode

ఆగస్టు 22 వ తారీకు 1161 ఎపిసోడ్ లో రిషి మాటలకి ఎమోషనల్ గా ఫీల్ అయిన శైలేంద్ర నేను ఎప్పటికైనా ఎండీ అవుతాను అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు కొడుకు బలవంతంగా ప్రశ్నించడంతో మహేంద్ర నీ తండ్రి అన్న విషయం రిషి కి చెప్పాను అంటుంది అనుపమ. మరోవైపు మహేంద్ర కొడుకుతో మాట్లాడుతూ నేను మనుకి తండ్రిని ఏమిటి నాకేమీ అర్థం కావడం లేదు, డైరెక్ట్ గా వెళ్లి అనుపమతో మాట్లాడుతాను అంటాడు మహేంద్ర. ఆమెతోనే మీకు నిజాలు చెప్పిస్తాను మీరు ఎవరిని కలవకండి అని తండ్రితో చెప్తాడు రిషి. మరోవైపు మీరు రంగా కాదు రిషి అని తెలిస్తే మీ బామ్మ గారి పరిస్థితి ఏమిటి అంటుంది వసుధార నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే అంటాడు రిషి. మీ అన్నయ్య వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ల గురించి మీకు తెలియదు అంటుంది వసుధార రిషిగా తెలియదు కానీ రంగాగా తెలుసు అంటాడు రిషి.

ఆగష్టు 23 వ తారీకు 1161 ఎపిసోడ్ లో అసలు మీరు రంగాగా ఎందుకు నటిస్తున్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా నటిస్తారు అంటుంది వసుధార. ఆ సమయం దగ్గరలోనే ఉంది అంటాడు రిషి మరోవైపు ధనరాజ్ ని ట్రాప్ చేసి అతని ద్వారా సైలేంద్రని కలుస్తుంది సరోజ. మరోవైపు బుజ్జి రిషి ని కలిసి సరోజ విషయం చెప్తాడు. తర్వాత నువ్వు నిజంగా రంగవి కాదు కదా రిషి కదా అంటాడు బుజ్జి. ఎక్కువ ఆలోచించొద్దని చెప్పి అతడిని పంపించేస్తాడు రిషి. మరోవైపు మీరు రంగాల ఎందుకు నటిస్తున్నారో తెలుసుకోవాలని ఉంది అంటుంది అయితే నాతో రా అని తనతో పాటు వసుధారని తీసుకువెళ్తాడు రిషి. మరోవైపు తనని కలసిన సరోజ మాటల ద్వారా వసుధార రిషిని ముందే కలిసిందని తెలుసుకొని షాక్ అవుతాడు శైలేంద్ర.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 August 19th to August 24th episode

ఆగస్టు 24 వ తారీకు 1162 ఎపిసోడ్ లో రంగాని త్వరలోనే సరోజ ఊరికి పంపిస్తానని ఆమెకి మాట ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శైలేంద్ర. మరోవైపు వసుధార ని చక్రపాణి ఇంటికి తీసుకు వెళ్తాడు మనిషి అప్పటికే అక్కడ రిషి వెయిట్ చేయమనటంతో బుజ్జి అక్కడ ఉంటాడు ఇద్దరికీ ఒకేసారి రంగానే పరిచయం చేస్తాడు. తనని అటాచ్ చేయబోయి రంగాని అటాచ్ చేశారని అందుకే మావయ్యని తన దగ్గర పెట్టి నేను అతని ప్లేస్ లో వెళ్లానని చెప్పి క్లారిటీ ఇస్తాడు ఈ విషయం అప్పుడే బామ్మకి చెప్పొద్దని బుజ్జి దగ్గర మాట తీసుకుంటాడు రిషి. తర్వాత సరోజ చెప్పినా మాటలు తల్లితో చెప్తాడు శైలేంద్ర. నువ్వు ఏ పని సవ్యంగా చేయవు అంటూ కొడుకుని మందలించిన దేవయాని అసలు వాడు రంగాయో, రిషి యో కన్ఫర్మ్ చేసుకో రంగా అయితే మాత్రం మన గొయ్యి మనం తీసుకున్నట్లే అంటుంది దేవయాని. మరోవైపు మహేంద్రని చూడటానికి వస్తారు శైలేంద్ర, ఫణీంద్ర.మహేంద్రతో మా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా రిషి, వసుధార వస్తారు. ఇలా వచ్చారంటే అని అడుగుతాడు. బాబాయ్ ని చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నాడు అసలు ఉన్నాడో లేదో చూద్దామని వచ్చాము అంటాడు శైలేంద్ర అందరూ షాక్ అవుతారు తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X