శైలేంద్రని చంపటానికి బయలుదేరిన మహేంద్ర.. శుభం కార్డు పడిన గుప్పెడంత మనసు సీరియల్!
శైలేంద్ర కాలేజీకి రాకపోవడానికి కారణం మను అని తెలుసుకుంటుంది వసుధార. తర్వాత మను తండ్రి విషయం రిషికి అనుపమ సమక్షంలోనే చెప్తుంది ఆ విషయం చాటుగా మహేంద్ర కూడా విని షాక్ అవుతాడు. నేను మనుకి తండ్రిని ఏమిటి ఎక్కడో పొరపాటు జరిగింది అనుకుంటాడు. మరోవైపు తనని అనుమానిస్తున్న శైలేంద్ర తో ఎండి సీటు మీకు అప్పగించేసి వెళ్ళిపోతాను అని బెదిరిస్తాడు రిషి. మరోవైపు వసుధారకి, బుజ్జి కి తాను రంగాగా ఎందుకు నటించాడో చెప్పి అసలు రంగా ని చూపిస్తాడు రిషి. రిషి అసలు రిషియేనా కాదా అని కన్ఫామ్ చేసుకోమని కొడుకుని మందలిస్తుంది దేవయాని. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక ఆగష్టు26 వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
ఆగష్టు 26వ తేదీ 1163ఎపిసోడ్ లో మహేంద్ర ఇంట్లో రిషి ని కలిసిన శైలేంద్ర నువ్వు నాకు వసుధార గురించి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. వసుధార మీద జరిగిన హత్యాయత్నం గురించి చెప్పి మీరు కూడా వారికి సంబంధించిన వాళ్ళు ఏమో అనుకొని చెప్పలేదు అంటాడు రిషి. ఆ తర్వాత శైలేంద్ర ఎవరితోనో సీక్రెట్ గా మాట్లాడటం గమనిస్తాడు రిషి. అనుకున్నట్లుగానే మహేంద్ర మీద హత్యాయత్నం జరిగితే తండ్రిని కాపాడుకుంటాడు రిషి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంటే రిషి వద్దని చెప్తాడు. తర్వాత ఈ హత్యాయత్నం ఎవరు చేశారు నాకు తెలుసు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. మరోవైపు సరోజ ని వసుధార మీదికి రెచ్చగొట్టి పంపిస్తాడు శైలేంద్ర. మరోవైపు వసుధార మను దగ్గరికి వెళ్లి మీరే హత్య ప్రయత్నం చేయించారు అంటుంది.

ఆగష్టు27వ తారీకు 1164 ఎపిసోడ్ లో నేనెందుకు ఆయనని చంపుతాను ఆయన నాకు ఏమైనా తండ్రి మను ఆయన మీ తండ్రి అని మీకు తెలుసు అని నాకు తెలుసు కానీ మీ తల్లి అనుపమ కాదు ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయండి అనటంతో కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మను. మహేంద్ర ని చంపించే ప్రయత్నం శైలేంద్ర చేశాడని తెలుసుకొని అతనిపై కోప్పడుతుంది దేవయాని. మరోవైపు నా తల్లివి నువ్వేనా అని అనుపమని అడుగుతాడు మను. మరోవైపు ఇంటికి వచ్చిన వంశధారతో అటాచ్ చేసింది మను కాదు అన్నయ్య అంటాడు రిషి. ఆశ్చర్య పోతుంది వసుధార. అదే సమయంలో రాధమ్మను తీసుకొని సరోజ వస్తుంది. పలకరిస్తున్న రాధమ్మతో నేను మీ మనవడిని కాదు అంటాడు రిషి.
ఆగష్టు28 వతేదీ 1165 ఎపిసోడ్ లో నేను మీ మనవడు రంగా దగ్గరికి తీసుకు వెళ్తాను అని సరోజినీ రాధమ్మని రంగ దగ్గరికి తీసుకువెళ్తాడు రిషి.అప్పటికే విషయం అంతా శైలేంద్ర కి చెప్తుంది సరోజ. జరుగుతున్నది ఏమిటో అర్థం కాక కోడల్ని అడుగుతాడు మహేంద్ర. జరిగిందంతా చెప్తుంది వసుధార. కొడుకు పడిన కష్టానికి బాధపడతాడు మహేంద్ర. మరోవైపు చక్రపాణి ఇంటికి రాధమ్మ వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్లకి అసలు రంగా ని చూపించి అందర్నీ కలిపి ఊరికి పంపించేస్తాడు రిషి. సరోజ లొకేషన్ పంపించడంతో అక్కడికి వచ్చిన శైలేంద్ర జరిగిందంతా చాటుగా చూస్తాడు, జరిగిందంతా గ్రహించి అందర్నీ పైకి పంపించేయాలి అనుకుంటాడు. ఇంటికి వచ్చిన రిషి తో అమ్మ ఏదో లెటర్ రాసిందంట కదా ఏం రాసింది అని అడుగుతాడు మహేంద్ర.

ఆగస్టు 29 వ తారీకు 1166 ఎపిసోడ్ లో తల్లి గురించి ఎంత అడిగినా చెప్పకపోవడంతో తనకి తానే గురి పెట్టుకొని నిజం చెప్పమని అనుపమని బెదిరిస్తాడు మను అదే సమయంలో మహేంద్ర కి లెటర్ ఇచ్చి చదవమని చెప్తాడు ఆ లెటర్లో మనూరి సీట్ విన్స్ అని తాను అనుపమకి మనం నీ పెంచుకోవడానికి ఇచ్చానని రాస్తుంది జగతి జరిగిన వాటిని శైలేంద్ర దేవయాని అని కూడా చెప్తుంది. అదే సమయంలో అనుపమ మాట్లాడుతూ నువ్వు జగతి కొడుకువి నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకే నేను పెళ్లి కూడా చేసుకోలేదు ఆ కారణంతో నేను నాకు పెంచుకోవడానికి ఇచ్చింది అని చెప్తుంది అనుపమ. మరోవైపు రిషి రంగా కాదని కృషి చేయని శైలేంద్ర ద్వారా తెలుసుకున్న దేవయాని కుప్పకూలిపోతుంది. మహేంద్ర కొడుకుతో మాట్లాడుతూ వాళ్ళు ఇన్ని తప్పులు చేశారని తెలిసినా ఎలా కూల్ గా ఉన్నావు అని అడుగుతాడు. బంధాల విలువ వాళ్లకు తెలియకపోవచ్చు కానీ మనకు తెలుసు అంటాడు రిషి. అప్పుడే మహేంద్ర శైలేంద్రని చంపేస్తాను అంటూ రిషి వాళ్ళని ఇంట్లో ఉంచి బయట గడియ పెట్టి వెళ్ళిపోతాడు.
ఆగష్టు 30 వ తారీకు 1167 ఎపిసోడ్ లో శైలేంద్రని చంపుతానంటూ బయలుదేరిన మహేంద్ర కి దారిలోనే కనిపిస్తాడు శైలేంద్ర. అయితే శైలేంద్ర మహేంద్రని రౌడీలతో కొట్టించి కిడ్నాప్ చేస్తాడు శైలేంద్ర. జగతి ద్వారా తను చేసిన అరాచకాలని బాబాయికి తెలిసాయని తెలుసుకున్న తను చేసిన మిగిలిన అరాచకాలు అన్ని బాబాయ్ తో చెప్తాడు తర్వాత రౌడీలతో చెప్పి బాబాయ్ ని మెల్లగా చంపండి అని చెప్పి అక్కడ నుంచి వచ్చేస్తాడు. మరోవైపు పనింద్ర ఇంటికి కోపంగా వెళ్ళినా వసుధార మా మామయ్య ఏరి అని అడుగుతుంది. మహేంద్ర కనిపించకపోవటానికి శైలేంద్ర కి ఏమిటి సంబంధం అని అడుగుతాడు ఫణీంద్ర. జగతి రాసిన లెటర్ ఫణింద్ర కి ఇస్తుంది వసుధార. లెటర్ చదివిన ఫణీంద్ర నిజాలు అని తెలుసుకొని కుప్ప కూలిపోతాడు. అవి నిజాలు కాదు అన్ని అబద్ధాలు అంటారు తల్లి కొడుకులు కాదు నిజాలే అంటాడు మహేంద్ర అందరూ అటువైపు చూసేసరికి రిషిత సహా అక్కడ మహేంద్ర ఉంటాడు. షాక్ అవుతాడు శైలేంద్ర. రిషి ఒక వీడియో చూపించి ఇది కూడా అబద్ధమే నా అని అడుగుతాడు. ఏమి మాట్లాడలేకపోతడు శైలేంద్ర.

ఆగస్టు 31 వ తారీకు 1168 ఎపిసోడ్ లో ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపోతున్నావు కదా అంటూ జరిగింది చెప్పటం ప్రారంభిస్తాడు. శైలేంద్ర మహేంద్ర ని కిడ్నాప్ చేయటం మను చూస్తాడు. విషయం ప్రస్తుతానికి చెప్పి రమ్మంటే వాళ్ళ పరిస్థితి చెప్తుంది పసుధార సరే అని చెప్పి మహేంద్రని ఇంకా పడటానికి వెళుతూ విషయం అనుపమకి చెప్తాడు మను అనుపమ వచ్చే రిషి వాళ్ళని విడుదల చేస్తుంది. మరోవైపు మను శైలేంద్ర మాటలు అన్ని వీడియో తీసి తర్వాత మహేంద్ర ని వాళ్ల నుంచి కాపాడుతాడు. ఒక దశలో రౌడీలకు చిక్కుకున్న మనుని రిషి వచ్చి కాపాడతాడు ముగ్గురు కలిసి అక్కడి నుంచి వచ్చేస్తారు జరిగిందంతా చెప్పి ఎండి పదవి కోసం ఇంత చేస్తావో పెద్దమ్మ, మారిపోయావు అని బాధపడతాడు రిషి. ఆ మాటలకి కరిగిపోయిన దేవయాని కృషిని క్షమాపణ కోరుతుంది కానీ శైలేంద్ర మాత్రం ఎండి సీట్ కావాలంటూ రిషి మీద అటాక్ చేస్తాడు. దేవయాని అడ్డుపడి శైలేంద్రని మందలిస్తుంది. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తుంది నేను శిక్ష అనుభవించాలి లేదంటే చచ్చిపోవాలి అంటాడు శైలేంద్ర నేను శిక్ష విధిస్తాను అంటాడు రిషి సీన్ కట్ చేస్తే కాలేజీలో అటెండర్ గా అవతారం ఎత్తిన శైలేంద్ర అన్ని విషయాలు ఒక్కొక్కటిగా నేర్చుకొని ఎప్పటికైనా నేను ఎండి ని అవుతాను అంటాడు. అక్కడితో గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డు పడుతుంది.


Click it and Unblock the Notifications











