Guppedantha Manasu Weekly Round up: వసుధారను వెంటాడుతున్న ఉంగరం సెంటిమెంట్.. రిషికా ఏదైనా కీడు, ప్రమాదమా?
మహేంద్ర కి కాలేజీకి దూరంగా ఉండమని మను కి చెప్తుంది అనుపమ. దాంతో తనని ఎండిగా నియమిస్తాను మినిస్టర్ అంటే అభ్యంతరం చెప్పి డైరెక్టర్ గా కూడా రాజీనామా ఇచ్చి వచ్చేస్తాడు మను. ఒంటరిగా ఉన్న మహేంద్రని తన ఇంటికి తీసుకెళ్తాడు ఫణీంద్ర. అనుపమ వెళ్ళిపోవడం వెనక మీ హస్తం ఉంటే ఊరుకునేది లేదు అని దేవయాని, శైలేంద్రలను హెచ్చరిస్తాడు మహేంద్ర. మరోవైపు ధనరాజ్ పెళ్లి చూపుల కోసం వెళ్లిన శైలేంద్ర వాళ్లకి అక్కడ రంగా కనిపించడంతో షాక్ అవుతారు
ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక జూలై 22 వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
జూలై 22 వ తేదీ 1133 ఎపిసోడ్ లో
టీ కొట్టు వాడితో టీ ఎలా పెట్టాలో చెప్తాడు రంగా. మళ్లీ రిషి తో పోలుస్తుంది వసుధార. ఎవరైనా టీ అలాగే పెడతారు అంటాడు రంగా. మరోవైపు రంగా నిజంగా రంగా ఏనా లేదంటే రిషి యా అని ఊర్లోనే ఉండి కన్ఫామ్ చేసుకోమని సైలెన్తలతో చెప్తుంది దేవయాని. శైలేంద్ర రిషి ని వెతుక్కుంటూ బయలుదేరుతాడు. అప్పుడే రిషి కి ఫోన్ రావడంతో టీ కొట్టు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వసుధార శైలేంద్ర కి కనిపించినట్లుగా కనిపించి మాయమైపోతుంది.

జూలై 23 వ తారీకు 1134 ఎపిసోడ్ లో
పాండు గ్యాంగ్ ని చూసి పరిగెట్టిన వసుధార వారికి దొరక్కుండా తప్పించుకుంటుంది. అనుకోకుండా పాండు శైలేంద్ర ఎదురుపడతారు. వసుధారని నిజంగా చంపారా అని నిలదీస్తాడు శైలేంద్ర. మాయమాటలు చెప్పి నమ్మిస్తాడు శైలేంద్రని నమ్మిస్తాడు పాండు. మరోవైపు తన ఇంటికి వస్తున్న శైలేంద్ర కంట్లో వసుధార పడకుండా జాగ్రత్త పడతాడు రంగా. పంటలు దగ్గరికి వచ్చిన శైలేంద్రతో మాట్లాడుతూ నన్ను ఎంక్వయిరీ చేయడం కాదు మా మామయ్య దగ్గరే క్లారిటీ తీసుకుందురుగాని పదండి అని అతడిని తీసుకొని బయటికి వెళ్లిపోతాడు. ఈ మాటలు విన్న వసుధారకి శైలేంద్ర గొంతులో అనిపిస్తుంది. అందుకే రంగా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది.
జూలై 24తేదీ 1135 ఎపిసోడ్ లో
రంగాతో వెళ్తున్న శైలేంద్ర ఊర్లో వాళ్ళ మాటల ద్వారా అతను రంగా అనే క్లారిటీ కి వస్తాడు. తర్వాత వసుధార ఫోటో చూపించి ఈమె మీకు తెలుసా అని అడుగుతాడు. తెలియదు అని చెప్తాడు రంగా అది చూసిన బుజ్జి రంగాని అనుమానిస్తాడు. మరోవైపు తన ఇంటికి వచ్చిన వసుధారని కోప్పడుతుంది సరోజ. అప్పుడే వచ్చిన రంగా సరోజినీ మందలిస్తాడు. నా మనసులో నువ్వు లేవు అని క్లారిటీ ఇస్తాడు. మరోవైపు బుజ్జి ఎందుకు మీరు మీ ఊరు వెళ్ళటం లేదు అడుగుతాడు. అలా అడిగినందుకు బుజ్జి ని కోప్పడతాడు రంగా. మరోవైపు తల్లికి రంగా రిషి కాదని అతను రంగాయే అని చెప్తాడు శైలేంద్ర. అయితే అతడిని మనం ఉపయోగించుకోవచ్చు అంటుంది దేవయాని.

జూలై 25వ తారీకు 1136ఎపిసోడ్ లో
రంగా ని రిషి ప్లేస్ లోకి ఎలా తీసుకురావాలో కొడుక్కి చెప్తుంది దేవయాని. మరోవైపు మీరు కాలేజీ ఏ పరిస్థితుల్లో ఉందో కూడా తెలుసుకోవడం లేదు, రిషి సార్ వచ్చి అడిగితే ఏం చెప్తారు అంటూ వసుధారపై కోప్పడతాడు రంగా. వసుధర కాలేజీకి ఫోన్ చేసి కాలేజీ ని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోబోతుంది అని తెలుసుకొని రంగా కి చెప్పి రండి మన కాలేజీకి వెళ్దాం అంటుంది. నేను రాను అని ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోతాడు రంగా. మరోవైపు పెళ్లి వాళ్ళకి ఏమో అనుమానాలు ఉన్నాయి అంట నీతో మాట్లాడాలంట అని సంజీవయ్య వచ్చి రంగా ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు శైలేంద్ర సంజీవయ్యని పంపించేసి రంగాకి రిషి ఫోటో చూపించి ఇతను నా తమ్ముడు చాలా మంచివాడు ఒక కాలేజీకి ఎండి అని చెప్తాడు. రిషి ఫోటో చూసిన రంగా ఆశ్చర్యపోతాడు.
జూలై 26వ తారీకు 1137 ఎపిసోడ్ లో
నువ్వు మా తమ్ముడు రిషి లాగా నటించి కాలేజీకి ఎండి అవ్వాలి అంటాడు శైలేంద్ర . నాకు చదువు రాదు అంటాడు రంగా అయితే నన్ను ఎండిన చేయమని అక్కడికి వచ్చి చెప్పు అంటూ ఐదు కోట్లు ఆఫర్ చేస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత దేవయాని శైలేంద్ర మాట్లాడుకుంటూ చాలామంది కలలు త్వరగా నెరవేరుతాయి కానీ మనకు అలా ఎప్పటికీ నెరవేరడం లేదు అనుకుంటారు. మరోవైపు వసుధార కాలేజీకి వెళ్లలేదని ఆమె మీద కోప్పడతాడు రంగా. తరువాత రోజు తన ఉంగరం కనిపించక కంగారు పడుతుంది వసుధార. ఉంగరం విషయం రాధమ్మతో చెప్తూ ఆ ఉంగరం నాకు సెంటిమెంటు, ఉంగరం పోయిందంటే రిషి సార్ కి ఏమైనా కీడు జరుగుతుందేమో అని కంగారుగా ఉంది రిషి సార్ ఏరి అని అడుగుతుంది బయటికి వెళ్ళాడు నీకు ఈ బాక్స్ ఇమ్మన్నాడు అని ఏదో గిఫ్ట్ బాక్స్ వసుధార చేతిలో పెడుతుంది రాధమ్మ. మరోవైపు సైలేంద్రుని కలిసిన రంగా డీలింగ్ కి ఒప్పుకున్నట్లు చెప్తాడు.

జూలై 27 వ తారీకు 1138 ఎపిసోడ్ లో
అనుపమ మను మహేంద్ర ని కలవడం కోసం ఫణీంద్ర ఇంటికి వస్తారు. అక్కడ దేవయాని వాళ్లతో అమర్యాదగా మాట్లాడుతుంది. అప్పుడే హాల్లోకి వచ్చిన మహేంద్ర తో మేము ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మను నిన్ను చూడాలంటే ఎక్కడికి వచ్చాము అంటుంది అనుపమ. మను మహేంద్ర ఇద్దరూ హాగ్ చేసుకుని ఎమోషనల్ అవుతారు. ఊరు వదిలి వెళ్ళొద్దు ఆలోచించి నిర్ణయం తీసుకో అంటాడు మహేంద్ర. మరోవైపు ఇప్పుడే ఊరికి వెళ్దామంటాడు శైలేంద్ర. లగేజ్ తెచ్చుకోలేదు అంటాడు రంగా అక్కర్లేదు అని నేను రెడీ చేసి ఉంచాను అంటాడు శైలేంద్ర. అప్పుడు డబ్బు పెట్టే తీసుకువెళ్లి బుజ్జి కిచ్చి రాధమ్మకి ఏం చెప్పాలో వసుధారకి ఏం చెప్పాలో చెప్పి శైలేంద్ర తో బయలుదేరుతాడు రంగా. మరోవైపు మను అనుపమ తో మాట్లాడుతూ దేవేంద్ర గారే నా తండ్రి కదా నిజం చెప్పు అని నిలదీస్తాడు. ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











