Guppedantha Manasu Weekly Round up: అంతులేని ఆనందంలో వసుధార.. షాక్ లో స్పృహ కోల్పోయిన శైలేంద్ర!

రంగా రిషి అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవటానికి ఊర్లోనే ఉండిపోతాడు శైలేంద్ర. తర్వాత రిషి ఇంటికి వెళ్తే వసుధార శైలేంద్ర కంట పడకుండా జాగ్రత్త పడతాడు రంగా. బుజ్జి రంగా ప్రవర్తన ని అనుమానిస్తాడు. మరోవైపు వసుధారతో గొడవ పడుతున్న సరోజతో నువ్వు నా మనసులో లేవు అని క్లారిటీ ఇస్తాడు రంగా. రిషి రంగాయే అని కన్ఫర్మ్ చేసుకుంటాడు శైలేంద్ర. కాలేజీ కష్టాల్లో ఉందని వసుధార ద్వారా తెలుసుకున్న రంగా వెళ్లి కాపాడమని చెప్తాడు కానీ వినిపించదు వసుధార. మరోవైపు శైలేంద్ర రంగాకి రిషి ఫోటో చూపించి అలా నటించమని డబ్బులు ఆఫర్ చేస్తాడు. మరోవైపు తన ఉంగరం కనిపించకపోవడంతో రిషికి ఏమైనా అవుతుందేమో అని కంగారుపడుతుంది వసుధార. మరోవైపు ఊరు వదిలి వెళ్ళిపోతాము అని మహేంద్రతో మను వాళ్ళు చెప్తే వెళ్లొద్దు అని చెప్తాడు మహేంద్ర. మరోవైపు శైలేంద్రతో రిషిగా బయలుదేరుతాడు రంగా. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక జూలై 29 వ తేదీ నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 29 వ తేదీ 1139 ఎపిసోడ్ లో రిషి ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసిన వసుధారకి రంగా రిషి అన్న విషయం కన్ఫామ్ చేసుకొని ఆనందపడుతుంది. మరోవైపు తన ఇంటికి వెళ్లిన రిషి తల్లి ఫోటో చూసి ఎమోషనల్ అవుతాడు. శైలేంద్ర రంగాకి రిషి గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. రంగా తనకి ఇచ్చిన ఉంగరం తీసుకెళ్లి వసుధారకి ఇస్తాడు బుజ్జి. ఏమైనా చెప్పారా అంటుంది వసుధార. ఉంగరం తనకి ఇస్తే అన్నీ తనకు అర్థం అవుతాయి అన్నాడు అంటాడు బుజ్జి.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july 29th to August 3rd episode

జూలై 30 వ తారీకు 1140 ఎపిసోడ్ లో శైలేంద్ర వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు అన్నీ రిషికి చూపించి పరిచయం చేస్తూ ఉంటాడు. నాకు డైరెక్ట్ గా చూపిస్తేనే అర్థం అవుతుంది అంటాడు రిషి. సరే దూరం నుంచి చూపిస్తాను అని రిషి ని కిటికీ దగ్గర ఉంచి ఇంట్లో వాళ్ళందరితోని మాట్లాడుతూ ఉంటాడు శైలేంద్ర. అయితే రిషి ఉనికి మహేంద్ర కి అర్థమవుతుంది తను ఇక్కడికి వచ్చినట్లు అనిపిస్తుంది అని ఎమోషనల్ అవుతాడు. రిషి తండ్రికి కనిపించకుండా దాక్కొని ఎమోషనల్ అవుతాడు రిషి. ఇంటికి వచ్చిన రిషి ని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతుంది వసుధార.

జూలై 31తేదీ 1141 ఎపిసోడ్ లో మీరు ఎందుకు దూరంగా ఉన్నారు కాలేజీ కష్టాల్లో ఉన్నా ఎందుకు ఆదుకోలేదు అక్కడ రంగాగా ఎందుకు నటిస్తున్నారు అని రిషి ని అడుగుతుంది వసుధార. బిరియాడిస్తున్న నాటకంలో నేను నటుడని అయిపోయాను,కానీ మీకు ఎప్పుడూ దూరంగా లేను అంటాడు రిషి. మరోవైపు మినిస్టర్ తనని కాలేజీ ఎండిగా ప్రకటించినట్లు కలకంటాడు శైలేంద్ర. మీ కల పక్కన పెడితే కాలేజీ చేయి జారిపోకుండా ఉంటే బాగున్ను అంటుంది ధరణి. తర్వాత మినిస్టర్ కాలేజీ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది కానీ కాలేజీని సమర్థవంతంగా నడిపించే వాళ్ళు లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది అంటాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july 29th to August 3rd episode

ఆగస్టు 1వ తారీకు 1142 ఎపిసోడ్ లో ఫైల్ మీద ఫణీంద్ర, మహేంద్ర సంతకాలు పెడతారు. శైలేంద్ర సంతకం పెట్టే సమయానికి రిషి వస్తాడు అనుకుంటే వసుధార ఎంట్రీ ఇచ్చి షాక్ ఇస్తుంది. నువ్వు వచ్చావంటే రిషి కూడా వచ్చే ఉంటాడు అంటాడు మహేంద్ర. అవును అంటుంది వసుధార. అప్పుడే రిషి గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఎండి ని ప్రకటించవలసిన అవసరం లేదు అనటంతో స్పృహ కోల్పోతాడు శైలేంద్ర. కళ్ళు తెరిచేసరికి ఇంట్లో ఉంటాడు. వసుధార ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తాడు రంగా. మినిస్టర్ గారు ఛాయస్ ఇవ్వకుండా ఎండి ఎవరో ప్రకటి చేశారు అంటాడు రంగా. పర్వాలేదులే నువ్వు అధికారంలో ఉన్న నేను చెప్పినట్లు చేస్తే చాలు అంటాడు శైలేంద్ర. తర్వాత ఫణీంద్ర కొడుకుని పలకరించి అలా కళ్ళు తిరిగి పడిపోయావ్ ఏంటి అంటాడు.

ఆగష్టు 2 వ తారీకు 1143 ఎపిసోడ్ లో రిషి, వసుధారలని చూసిన ఆనందంలో స్పృహ కోల్పోయాను అంటాడు శైలేంద్ర. ఇకమీదట అందరమూ కలిసే ఉందాము అంటాడు ఫణీంద్ర. అందుకు మహేంద్ర వాళ్ళు అంగీకరించరు. సరే ఈ ఒక్క రోజు అందరం కలిసి భోజనం చేద్దాం అంటాడు ఫణీంద్ర అందుకు ఒప్పుకుంటారు రిషి వాళ్ళు. మరోవైపు ప్లాన్ ఫెయిల్ అయినందుకు కొడుకు చంప పగలగొడుతుంది దేవయాని. వసుధర చనిపోయిందనుకొని రంగానే రిషిగా తీసుకురమ్మన్నాను ఇప్పుడు రంగా రిషి కాదు అని వసుధార కనిపెడితే మనకి ప్రమాదం అని చివాట్లు పెడుతుంది. తరువాత రిషి వసుధార క్లోజ్ గా ఉండడం చూసిన దేవయాని రంగా నిజంగా రంగాయేనా, లేక రిషియా అని అనుమానిస్తుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july 29th to August 3rd episode

ఆగస్టు 3 వ తారీకు 1144 ఎపిసోడ్ లో తను రాసిన లెటర్ మనుకి చేరలేదని మహేంద్ర ద్వారా తెలుసుకుంటుంది వసుధార. మరోవైపు పాండు కి ఫోన్ చేసిన శైలేంద్ర కి పాండు తనని మోసం చేశాడనే విషయం అర్థమవుతుంది. మరోవైపు రిషి బుజ్జి కి ఫోన్ చేస్తే అతని దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న సరోజ నువ్వు ఎక్కడ ఉన్నావు ఎప్పుడు వస్తావు వసుధార నీతోనే ఉందా అని అడుగుతుంది. త్వరలోనే వస్తానని నానమ్మని చూసుకోమని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు రిషి. తర్వాత అన్నా వీళ్ళతోనే వెళ్లాడు వీళ్లే డబ్బులు ఇచ్చారు అని శైలేంద్ర ఫోటో రాధమ్మ వాళ్లకి చూపిస్తాడు బుజ్జి. వసుధారవాళ్ళు వచ్చిన విషయం అనుపమ వాళ్లకి చెప్తాడు మహేంద్ర. మరోవైపు వసుధారతో పాటు గదిలోకి వెళ్ళిపోతున్న రాంగానే పక్కకు పిలిచి హద్దులో ఉండమని చెప్తాడు శైలేంద్ర. ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ అక్కడికి వస్తుంది వసుధార. వాళ్ల మాటల్ని కవర్ చేస్తుంది దేవయాని. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X