Guppedantha Manasu Weekly Round up: అనుపమ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న దేవయాని.. మళ్లీ కిడ్నాప్ కి గురైన వసుధార!

వసుధార రిషి సార్ గురించి వసుధర పదేపదే మాట్లాడటం తనకి ఇబ్బందిగా ఉంది అని చెప్తాడు రంగా. తర్వాత వసుధార బట్టలు కొనమంటే అప్పుచేసి మరీ బట్టలు కొంటాడు రంగా. అందుకు రంగాపై కోప్పడుతుంది సరోజ వసుధార తనకి పని చూడమనటంతో స్కూల్లో టీచర్ గా జాబ్ చూస్తాడు రంగా. అయితే కావాలనే ఫార్ములా తప్పు రాస్తుంది వసుధార దానిని కరెక్ట్ చేస్తాడు రంగా. మీరు రిసీ సార్ కాబట్టే ఫార్ములా కరెక్ట్ చేశారు అంటుంది వసుధార. వసదార మీద కోప్పడతాడు రంగా. మరోవైపు దేవయాని మనుని అవమానించేలా మాట్లాడుతుంది.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక జూలై 8 వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 8 వ తేదీ 1121 ఎపిసోడ్ లో పరిచయం లేని ఆడపిల్లని ఇంట్లో పెట్టుకున్నాడని పెద్ద మనుషుల్ని ఇంటికి తీసుకువచ్చి గొడవ పెట్టుకుంటాడు సరోజ తండ్రి. వాళ్లకి నచ్చ చెప్పి పంపిస్తాడు రంగా. తర్వాత ఇదంతా మనకి అవసరమా అని రంగాని రాధమ్మ మందలిస్తుంది. మరోవైపు ఫణీంద్ర ఇంట్లో ఏం జరిగిందో మను కి చెప్తాడు మహేంద్ర.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july 8th to july13th episode

జూలై 9 వ తారీకు 1122 ఎపిసోడ్ లో మీ కొడుకుని తీసుకొని మీరు ఊరు వదిలి వెళ్లిపోండి లేదంటే మీ బిడ్డకి తండ్రి ఎవరో చెప్పేస్తాను అని అనుపమని బ్లాక్ మెయిల్ చేస్తాడు ఒక అగంతకుడు. రేపు భోజనం దగ్గర కూర్చున్న పసుధార ని సరోజ అవమానించడంతో భోజనం మానేసి తన గదిలోకి వెళ్ళిపోతుంది. భోజనం తీసుకువచ్చిన రంగాతో ఇంత జరిగినా కూడా మీరు ఎందుకు ఇంకా ఈ నాటకం ఆడుతున్నారు మీరు రేపు నాతో పాటు రండి మీరే రిషి సార్ అని రుజువు చేస్తాను అంటుంది వసుధార.

జూలై 10తేదీ 1123 ఎపిసోడ్ లో రాధమ్మ దగ్గరికి వచ్చిన వసుధార రంగ నిజంగా మీ మనవడేనా అని అడుగుతుంది. ఆ మాటలకి కంగారుపడుతుంది రాధమ్మ. మరుసటి రోజు వసుధార వెళ్ళిపోతుందని తెలుసుకున్న సరోజ తనకి ఇష్టం లేని ఒక తీరని వసుధారకి గిఫ్ట్ గా ఇచ్చి మళ్లీ నా జీవితంలోకి రావద్దు అని చెప్తుంది. మరోవైపు తనని ఎవరో బెదిరిస్తున్న విషయం పెద్దమ్మకి చెప్పుకుంటుంది అనుపమ. మరోవైపు ఊరికి వచ్చిన రంగా తన ఇంటికి తానే కరెక్ట్ రూట్ చూపిస్తాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july 8th to july13th episode

జూలై 11వ తారీకు 1124ఎపిసోడ్ లో వసుధార ఇంటికి వెళ్లేటప్పటికీ తాళం వేసి ఉండటంతో ఇక నేను వెళ్తాను అంటాడు రంగా.మీ నాన్నగారు వచ్చాక కలిసి వెళ్ళండి అంటుంది వసుధార నాకు అంత అవసరం లేదు, నా వెనుక ఫాలో అవ్వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు రంగా. మరోవైపు తనని అనుమానిస్తున్నది దేవయాని అనే అనుమానంతో ఆ ఇంటికి వెళ్తుంది అనుపమ. దేవయాని తన దగ్గర ఉన్న లెటర్ చూపించే నా కొడుకు ఎండి అవ్వాలంటే మీరు ఎక్కడ ఉండకూడదు లేదంటే ఈ లెటర్ బయట పెట్టేస్తాను అని బ్లాక్మెయిల్ చేస్తుంది. మరోవైపు రంగా కోసం వెతుకుతున్న వసుధారని మళ్ళీ పాండు వాళ్ళు కిడ్నాప్ చేస్తారు.

జూలై 12వ తారీకు 1125 ఎపిసోడ్ లో రంగా సహాయంతో హంతకుల నుంచి తప్పించుకుంటుంది వసుధార. తర్వాత తన మానాన తాను వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు రంగా. నేను వస్తే నీతోనే వస్తాను అని ఇంట్లో మాటిచ్చాను మీరు రాను అంటున్నారు కాబట్టి నన్ను కూడా మీతో తీసుకు వెళ్ళండి అంటుంది వసుధార. అన్ని రోజులు మీరు మా ఇంట్లో ఉంటే బాగోదు అంటాడు రంగా. అందుకే అద్దెకు ఉంటాను అంటు రంగానే ఒప్పించి అతనితోపాటు ఊరు వెళ్ళిపోతుంది వసుధార. వసుధర ఊరు వెళ్ళిపోయిందని ఆనంద పడుతున్న సరోజ మళ్ళీ రంగా ఇంట్లో వసుధారని చూసి షాక్ అవుతుంది మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ గొడవ పడుతుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july 8th to july13th episode

జూలై 13 వ తారీకు 1126 ఎపిసోడ్ లో తనకి ఈ ఊర్లో ఎవరూ తెలియదు కదా అయినా మీ నాన్నకి వడ్డీ డబ్బులు కట్టాలి కదా అందుకే నేనే ఉండమన్నాను అంటాడు రంగా. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది సరోజ. మరోవైపు తన సమస్యని పెద్దమ్మకి చెప్పి బాధపడుతుంది అనుపమ అంతలోనే మహేంద్ర ఫోన్ చేస్తే నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను నన్ను డిస్టర్బ్ చేయద్దు అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ మాటలకి ఆశ్చర్యపోతాడు మహేంద్ర. రంగా ఇంటి మీద ట్యూషన్స్ ఓపెన్ చేసిన వసుధారని చూసి కోపంతో రగిలిపోతుంది సరోజ.

కావాలంటే నువ్వు చదువు నేర్చుకో ఫీజు తీసుకొని లే అని వెటకారంగా మాట్లాడుతుంది వసుధార.మరోవైపు మనుని తన దగ్గరికి పిలిపించుకొని మనం మహేంద్ర వాళ్ళ ఇంట్లో ఉండొద్దు అంటుంది అనుపమ. నేను కష్టం లో ఉన్నప్పుడు వాళ్లు నా కష్టాన్ని తీర్చారు నేను ఆయనని ఒంటరిగా వదిలేయను అయినా మీరు ఎందుకిలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అన్నారా అంటాడు మను. నేను చెప్పినట్లు వినకపోతే నా మీద ఒట్టే అంటుంది అనుపమ. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X