Guppedantha Manasu:సరోజ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదన్న రంగా..మను, అనుపమల ప్రవర్తనకి ఆశ్చర్యపోతున్న ఏంజెల్!

ఇంట్లో పరాయి ఆడపిల్లని పెట్టుకున్నాడని రంగా ఇంటికి గొడవకి వస్తాడు సంజీవయ్య. ఇదంతా మనకు అవసరమా అని మనవడిని మందలిస్తుంది రాధమ్మ. వసుధార ని ఆమె ఇంటిదగ్గర రంగా విడిచిపెట్టి వస్తాడు కానీ పాండు మనుషులు ఆమెని కిడ్నాప్ చేస్తారు. ఆమెని రక్షించి మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు రంగా. మరోవైపు దేవయాని నువ్వు నీ కొడుకు కంటికి కనిపించనంత దూరంగా వెళ్లిపోండి లేదంటే నీ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పేస్తాను అని అనుపమని బ్లాక్మెయిల్ చేస్తుంది. రంగా ఇంటి మీద ట్యూషన్స్ చెప్పటం ప్రారంభిస్తుంది వసుధార.ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కధ ఇక జూలై 15 వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 15 వ తేదీ 1127 ఎపిసోడ్ లో మను ని కాలేజీకి దూరంగా ఉండమంటుంది అనుపమ కారణం అడిగితే కొద్ది రోజులు ఓపిక పట్టు అని నిజాలు నీకే తెలుస్తాయి అంటుంది. అంతేకాకుండా అమ్మ అని పిలవమని కూడా చెప్తుంది. మహేంద్ర తో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తుంది. మరోవైపు రాధమ్మ కోసం ఎమోషనల్ అవుతున్న రంగాన్ని చూసి ఈయన నిజంగా రిషి సార్ కాదా అని అనుమాన పడుతుంది వసుధార. మరోవైపు మినిస్టర్ మనుని ఎండిగా నిర్ణయిస్తాడు అందుకు అభ్యంతరం చెప్తాడు మను.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july15th to July 20th episode

జూలై 16 వ తారీకు 1128 ఎపిసోడ్ లో తనకి ఏం డి 10 ఇష్టం లేదని అలాగే ఉన్న డైరెక్టర్ పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాడు మను. మరోవైపు తనని పెళ్లి చేసుకోమని పెళ్లి చేసుకుంటే అమ్మమని బాగా చూసుకుంటానని రంగాతో చెప్తుంది సరోజ తనకి ఆ ఉద్దేశం లేదు అని చెప్తాడు రంగా. మరోవైపు ఒంటరిగా ఉన్న మహేంద్రని ఒప్పించి తన ఇంటికి తీసుకు వెళ్తాడు ఫణీంద్ర. మరోవైపు పెళ్లిచూపులు ఆపమని రాంగానే అడుగుతుంది సరోజ కుదరదు వచ్చిన సంబంధం చేసుకో అంటాడు రంగా.

జూలై 17తేదీ 1129 ఎపిసోడ్ లో నిన్ను తప్పితే వేరే వారిని చేసుకోను అని రంగాతో చెప్పి కోపంగా బుజ్జిని తీసుకొని వెళ్ళిపోతుంది సరోజ. మరోవైపు ఫణీంద్ర మహేంద్ర ని ఇంటికి తీసుకురావడంతో ముందు షాక్ అయినా తరువాత ఆనందపడతారు దేవయాని, శైలేంద్ర. తర్వాత మహేంద్ర దేవయాని శైలేంద్రలతో మాట్లాడుతూ అనుపమ వెళ్ళిపోవడం వెనక మీ ప్రమేయం ఉందని తెలిస్తే ఊరుకోను అని హెచ్చరిస్తాడు. మరోవైపు తన పెళ్లి విషయంలో సహాయం చేయమని ఎమ్మెస్సార్ శిష్యుడు ధనరాజ్ శైలేంద్ర ని అడుగుతాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july15th to July 20th episode

జూలై 18వ తారీకు 1130ఎపిసోడ్ లో శైలేంద్ర ఇంటికి వచ్చిన ధనరాజ్ తనతో పాటు పెళ్లి చూపులకు రమ్మని అడుగుతాడు. మేము ఎందుకు రావాలి అంటాడు శైలేంద్ర.మీ రహస్యాలు అన్నీ మాకు తెలుసు అని బ్లాక్ మెయిల్ చేస్తాడు ధనరాజ్. మరోవైపు కాఫీ బాగోలేదు అని తనని ఆటపట్టించిన రంగాని చూసి ఇంకెప్పుడూ బయటపడతారు, నేను ఇంకా ఎన్నాళ్ళు మీకోసం వెయిట్ చేయాలి అనుకుంటుంది వసుధార. మరోవైపు పెళ్లి చూపులు చెడగొట్టాలని బుజ్జితో కలిసి ప్లాన్ వేస్తుంది సరోజ. పెళ్లి చూపులకు వచ్చిన శైలేంద్ర వాళ్ళకి నేను సరోజ ప్రేమించుకున్నాము కావాలంటే ఫోటో చూడండి అంటూ ఫోటో చూపిస్తాడు బుజ్జి. అందులో రిషి ని చూసిన శైలేంద్ర, దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతారు.

జూలై 19వ తారీకు 1131 ఎపిసోడ్ లో ఫోటో చూసిన ధనరాజ్ ఈ సంబంధం మనకు వద్దు వెళ్ళిపోదాం అంటాడు. కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి రిషి అవునో, కాదో తెలుసుకోవటం కోసం పెళ్లి చూపులకు వెళ్దాం అని ధనరాజ్ ని ఒప్పించి తీసుకువెళ్తారు శైలేంద్ర, దేవయాని . ప్లాన్ ఫెయిల్ అయిందని తెలుసుకున్న సరోజ బుజ్జిని మందలిస్తుంది. రాధమ్మ పెళ్లి చూపులకు వస్తుంది. ధనరాజ్ రంగా గురించి సరోజ గురించి ఎంక్వయిరీ చేస్తాడు. వాళ్ళు బావ మరదలు కానీ పెద్దగా బంధుత్వాలు లేవు అంటాడు సంజీవయ్య. మరోవైపు వసుధార ని తీసుకొని పెళ్లి చూపులకి బయలుదేరిన రంగా వాసుధార ని బయటే ఉంచేస్తాడు. పెళ్లిచూపుల్లో రంగా ని చూసిన శైలేంద్ర, దేవయాని ఇద్దరూ భయంతో వణికిపోతారు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july15th to July 20th episode

జూలై 20 వ తారీకు 1132 ఎపిసోడ్ లో ఇంట్లో ఏసీ లేదు కదా ఎందుకలా వణికిపోతున్నారు అంటాడు రంగా. ఏసీ కార్లో వచ్చాము కదా అందుకే అంటుంది దేవయాని. దేవయాని గొంతు విని లోపలికి రాబోతున్న వసుధారని సరోజ గొడవపడి బయటే ఆపేస్తుంది. ధనరాజ్ సరోజ ని మీరే పెళ్లి చేసుకోవచ్చు కదా అని రంగాతో అంటాడు. తనకి అలాంటి ఉద్దేశం లేదని, సరోజ కూడా మిమ్మల్ని పరీక్షించడానికే అలా అంటుందని ఇప్పుడు కూడా బావంటే ఇష్టం బావనే చేసుకుంటానంటుంది చూడండి అంటాడు. ఆ మాటలు నమ్మిన ధనరాజ్ పెళ్లి కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుని కబురు పెడతామని చెప్పి దేవయాని వాళ్ళు వెళ్ళిపోతారు. మరోవైపు బాధలో ఉన్న మహేంద్ర కి ధైర్యం చెప్తుంది ధరణి. రిషిని తీసుకుని వసుధార కచ్చితంగా వస్తుంది, రిషి బ్రతికే ఉన్నాడు అన్న ఆమె నమ్మకాన్ని నేను నమ్ముతున్నాను అంటుంది ధరణి. మరోవైపు మను అనుపమ ని అమ్మ అని పిలవటం చూసి షాక్ అవుతుంది ఏంజెల్. మరోవైపు వసుధార రోడ్డుమీద టీ కొట్టులో టీ తాగుదాం అనటంతో అక్కడికి తీసుకువెళ్తాడు రంగా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X