Guppedantha Manasu Weekly Round up: రంగా కాదు.. మీరు రిషి సారే.. ఆ ట్రిక్కుతో పట్టేసిన వసుధార

మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను నాకు ఎండి సీట్ వదిలేయ్ అని మనతో బేరం పెడతాడు శైలేంద్ర. కుదరదు అంటారు మను, ఏంజెల్. వసుధార మీద కోపంతో ఉన్న సరోజ వసుధార ని పాండు వాళ్ళకి పట్టిస్తుంది. వసుధారని కాపాడి ఇంటికి తీసుకు వస్తాడు రంగా. తర్వాత వసుధారిని తమ జీవితాల్లోంచి సరోజా వెళ్ళిపోమంటే 15 రోజుల్లో ఆయనే రిశిసారని నిరూపించే ఆయనని తీసుకొని వెళ్ళిపోతాను అని ఛాలెంజ్ చేస్తుంది వసుధార. మరోవైపు మినిస్టర్ కాలేజీకి ఎండి ఎవరో నిర్ణయించుకోండి లేదంటే గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుంది అని చెప్తాడు. మరోవైపు రాధమ్మ సరోజ రంగా ల పెళ్లి గురించి సరోజి తండ్రితో మాట్లాడుతుంది. కుదరదు అంటూ రాధమ్మని కించపరిచే లాగా మాట్లాడుతాడు సరోజ తండ్రి. తర్వాత శైలేంద్ర మను పై మర్డర్ అటాక్ చేయిస్తాడు. వాళ్ల నుంచి తప్పించుకున్న మను రౌడీలని తీసుకొని నేరుగా శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కదా ఇక జూలై 1 వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూలై 1 వ తేదీ 1115 ఎపిసోడ్ లో
రౌడీ ఇల్లు తీసుకొని నేరుగా శైలేంద్ర ఇంటికి వెళ్లిన మను ఫణీంద్ర గారికి జరిగిందంతా చెప్తాను అని బెదిరిస్తాడు. అయితే శైలేంద్ర బ్రతిమాలడంతో మరొకసారి ఇలాంటి వేషాలు వేయొద్దు అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు. మరోవైపు వెన్నెల్లో కూర్చున్న రంగాతో మా రిషి సార్ కి కూడా ఇలాగే వెన్నెల అంటే ఇష్టం అంటుంది వసుధార ప్రతిసారి అలా పోల్చకండి నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటాడు రంగా. తర్వాత రంగా ని తనకి బట్టలు కొనమని అడుగుతుంది వసుధార.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july1st to july6th episode

జూలై 2 వ తారీకు 1116 ఎపిసోడ్ లో
వసుధార బట్టలు కొనమని అడగటంతో బట్టలు కొనడానికి వెళ్తాడు రంగా ఈ విషయం తెలుసుకున్న సరోజ మా బావని పంపించడానికి నువ్వు ఎవరు అంటూ వసుధారపై కోప్పడుతుంది అతడు నా భర్త అంటూ వసుధార కూడా వాదిస్తుంది. వారిద్దరిని గొడవ పడొద్దని వారిస్తుంది రాధమ్మ. మరోవైపు మను మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు శైలేంద్ర. అతడిని వారించి మనకి కావలసింది ఎండి సీటు దానిని ఎలా చేసిన ఎక్కించుకోవాలో ఆలోచించు అని చెప్తుంది దేవయాని. మరోవైపు బట్టలు కొని తీసుకొచ్చిన రంగా పై కోప్పడుతుంది సరోజ.నాకు కూడా కావాలి అంటుంది. రంగా కుదరదు అనడంతో బాధపడుతుంది. మరోవైపు వసుధార రంగా దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్న నాలుగు బట్టల్ని చూసి ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉంటున్నారు ఎందుకు ఇదంతా అని అడుగుతుంది.

జూలై 3తేదీ 1117 ఎపిసోడ్ లో
మీ కలలో నేను ఎలా ఉండేవాడిని అంటాడు రంగా సూటు బూటు వేసుకొని దర్జాగా ఉండేవారు ఇప్పుడు కూడా మిమ్మల్ని అలాగే చూడాలని ఉంది అంటుంది వసుధార. మీరు మళ్లీ ఆ టాపిక్ తీసుకురావద్దు అని టాపిక్ కట్ చేసేస్తాడు రంగా.తర్వాత వసుధర తనకి పని చూపించమని అడుగుతుంది. మరుసటి రోజు స్కూల్లో టీచర్ పని ఉంది ప్రిన్సిపాల్ తో మాట్లాడదాం రండి అని చెప్పి సరోజని తీసుకుని వెళ్తాడు రంగా. అక్కడ ప్రిన్సిపల్ మాట్లాడుతూ మా స్కూల్లో చేర్చుకోవటానికి ఫార్మాలిటీస్ ఉంటాయి కానీ రంగా చెప్పాడు కాబట్టి నేరుగా తీసుకుంటున్నాము అని వసుధారతో చెప్పి ఆమె సర్టిఫికెట్స్ అడుగుతాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july1st to july6th episode

జూలై 4వ తారీకు 1118ఎపిసోడ్ లో

ప్రిన్సిపల్ వసుధర సర్టిఫికెట్స్ అడిగితే ప్రస్తుతానికి లేవు తర్వాత తీసుకు వస్తాను అంటాడు అయితే ఒక ఫార్ములా వేసి చూపించండి అంటాడు ప్రిన్సిపల్. ఫార్ములా తప్పు రాస్తుంది వసుధార దానిని కరెక్ట్ చేస్తాడు రంగా. బయటికి వచ్చిన వసుధార మీరు రిషి సార్ కాకపోతే ఫార్ములా ఎలా కరెక్ట్ గా రాశారు అని అడుగుతుంది. రంగా నేను రిషి సార్ ని కాదు అని చెప్తే మీరే రిషి సార్ అని నేను మీ నోటితోనే చెప్పిస్తాను అని చాలెంజ్ చేస్తుంది వసుధార. మరోవైపు కొడుకుని ఎండి చేయటానికి తన దగ్గర ఉన్న లెటర్ ని ఆయుధంగా వాడుకుందాము అని కొడుకుతో చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధరణి మళ్ళీ కుట్రలు,కుతంత్రాలు పన్నుతున్నారా అని తల్లీ కొడుకుల పై కోప్పడుతుంది.

జూలై 5వ తారీకు 1119 ఎపిసోడ్ లో
కాలేజీకి వచ్చిన దేవయాని మను ఏంజెల్ మాట్లాడుకోవడం చూసి వాళ్ళిద్దరి గురించి అసహ్యంగా మాట్లాడుతుంది తండ్రి ఎవడో తెలియని వాడితో మర్యాద ఏమిటి అయినా వాడితో ఎక్కువగా సంబంధం పెట్టుకోకు వాడు తండ్రి అనుపమని మోసం చేసినట్లు వీడు నిన్ను కూడా మోసం చేస్తాడు అని హెచ్చరిస్తుంది. మరోవైపు స్కూల్లో జరిగిందంతా రాధమ్మతో చెప్తూ పగిలిపోతుంది సరోజ. వసుధార,రంగాల గురించి తప్పుగా మాట్లాడుతుంది. అందుకు సరోజని కోప్పడతాడు రంగా. తనకోసం నన్ను ఎందుకు కోప్పడుతున్నావు తనని పంపించేయ్ అంటుంది సరోజ. ఆమె మన అతిధి కొన్ని రోజులు చూసే పంపించేద్దాం అంటాడు రంగా అంతలో నిన్ను నాకు కాకుండా చేసేస్తుంది అంటుంది సరోజ. నిన్ను చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు అంటాడు రంగా. బావా అలా అంటుంటే నువ్వు ఏమి మాట్లాడవేమి అని రాధమ్మని అడుగుతుంది సరోజ. సరోజని కోప్పడుతుంది రాధమ్మ నువ్వు ఇలాగే మారం చేస్తే వాడు నిజంగానే నిన్ను దూరం పెట్టేస్తాడు అంటుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 july1st to july6th episode

జూలై 6 వ తారీకు 1120 ఎపిసోడ్ లో
రేపు పెళ్లయ్యాక కూడా ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి ఓర్పుగా సమస్యలని చక్కదిద్దుకోవాలి. అందుకే కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండే లేదంటే మీ బావ నిన్ను దూరం పెట్టేస్తాడు అంటుంది రాధమ్మ. మరోవైపు దేవయాని చేసిన అవమానం గురించి ఏంజెల్ అనుపమ వాళ్లకి చెప్తుంది. కోపంతో రగిలిపోయిన మహేంద్ర అనుపమను తీసుకొని ఫణీంద్ర ఇంటికి వెళ్తాడు అక్కడ దేవయానికి నా బిడ్డ జోలికి రావద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది అనుపమ అనుపమకి భార్య తరపున క్షమాపణలు చెప్తాడు ఫణీంద్ర. వదిన అందని కాదు గాని మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు, అదేమిటి అని అడిగిన ఇంట్లో వాళ్లకి నేను సమాధానం చెప్పగలను కానీ బయట వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను త్వరగా ఈ సమస్యకి పరిష్కారం చూడండి అంటాడు ఫణీంద్ర. తర్వాత మీరు ఈ కుట్రలు, కుతంత్రాలు మానరా అని భర్త అత్తగారిపై కోప్పడుతుంది ధరణి. కుట్రలు చేయడం అంత ఈజీ కాదు అని పెద్ద క్లాస్ ఇస్తాడు శైలేంద్ర. అంత పెద్ద డైలాగులు చెప్పకండి ఊపిరి ఆగిపోగలదు అని భర్తని తీసిపారేసినట్లు మాట్లాడుతుంది ధరణి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X