Guppedantha Manasu Weekly Round up: శైలేంద్రని ఎండి ని చేయమంటున్న దేవయాని.. రిషి చాలా అదృష్టవంతుడు అంటున్న రంగ

రిషి చనిపోయాడని విషయాన్ని నమ్మాలి అంటూ వసుధారతో చెప్తాడు ఫణీంద్ర. అది తట్టుకోలేక ఎండి పదవికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోతుంది వసుధార. శైలేంద్ర ఆమెని కిడ్నాప్ చేయబోతే రిషి వచ్చి ఆమెని సేవ్ చేస్తాడు. ఆ ఫైటింగ్ లో వసుధారకి దెబ్బ తగిలితే ఇంటికి తీసుకెళ్ళి రిషి అయితే అతను రిషి కాదు అని రంగా అని తెలిసి షాక్ అవుతుంది వసుధార. వసుధార తప్పించుకుందని తెలిస్తే శైలేంద్ర కోప్పడతాడని అతడిని నమ్మించి మోసం చేస్తాడు పాండు. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కదా ఇక జూన్ 17వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూన్ 17వ తేదీ 1103 ఎపిసోడ్ లో
మను తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు శైలేంద్ర, దేవయాని. అయితే ఈ విషయాన్ని అప్పుడే ఎవరికీ చెప్పొద్దు లేదంటే ఆ మనోనే తీసుకొచ్చి ఎండిన చేస్తాడు మీ నాన్న అని కొడుకుని హెచ్చరిస్తుంది. మరోవైపు వసుధార నీ చూస్తూ కూర్చున్న రంగాతో నాకెందుకు ఈవిడ నీకు ముందే తెలుసనిపిస్తుంది నిజమైతే ఆవిడని ఇంట్లోంచి పంపించేస్తాను అంటుంది సరోజ.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 june 17th to june 22nd episode

జూన్ 18 వ తారీకు 1104 ఎపిసోడ్ లో
వసుధార గురించి ఏమైనా తెలిసిందా అని తమ్ముడిని అడుగుతాడు ఫణీంద్ర.లేదని చెప్తాడు మహేంద్ర. ఆ తర్వాత ఏమండి పదవి గురించి మాట్లాడుతూ మన ఇంట్లో వాళ్ళు ఎండి అవ్వాలి కాబట్టి ఇక నేనే ఎండిని ఇందులో ఆలోచించడానికి ఏముంది అంటాడు శైలేంద్ర. ఎండి అవ్వడానికి అర్హత కూడా కావాలి ఎండి ఎవరు అనేది మినిస్టర్ గారు నిర్ణయిస్తారు అంటాడు మహేంద్ర. మరోవైపు చంపలేదని తెలిస్తే శైలేంద్ర మనల్ని చంపుతాడు అందుకే వసుధారితోపాటు ఆమెని సేవ్ చేసిన ఆటో డ్రైవర్ ని కూడా చంపేయాలి అంటాడు పాండు. మరోవైపు వసుధార రంగ ని రిషి అని పిలుస్తుంది. ఆ మాటలకి కాపాడుతుంది సరోజ కానీ నేను రిషి సర్ నే అంటాడు రంగా.

జూన్ 19వ తేదీ 1105 ఎపిసోడ్ లో
రంగా నేను రిషి ని అని చెప్పటంతో ఆనందపడుతుంది వసుధార ఇంటికి వెళ్లి పోదాం పదండి అంటుంది. ముందు నీ ఆరోగ్యం కుదుటపడని తరువాత వెళ్దాం అంటాడు రిషి. మరోవైపు మన సైలేంద్రనే ఎండిని చేయండి అని భర్తని అడుగుతుంది దేవయాని కానీ అందుకు ఒప్పుకోడు ఫణీంద్ర. మరోవైపు సరోజ నువ్వు రిషి అని ఎందుకు చెప్పావు అని రంగాని నిలదీస్తుంది. ఆమె ఆరోగ్యం కోసమే అలా చెప్పాను అంటాడు రంగా. ఆ మాటలు అన్నీ విన్న వస ధార మీరే నిన్న రిషి సార్ అని నిరూపించే వరకు ఇంట్లోంచి వెళ్ళను అని శపధం చేస్తుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 june 17th to june 22nd episode

జూన్ 20 తారీకు 1106ఎపిసోడ్ లో
శైలేంద్ర మను తో మాట్లాడుతూ ఎండి కావటం అనేది నా కల నువ్వు నా కలకి అడ్డుపడకు అలా చేస్తే నీ తండ్రి ఎవరో నేను చెప్తాను అంటాడు. అతని మాటలు నమ్మకుండా తిరిగి శైలేంద్రకే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు మను. మరోవైపు వసుధారని వెతుకుతూ ఉంటారు పాండు గ్యాంగ్. మరోవైపు జరిగిందంతా తల్లికి చెప్తాడు శైలేంద్ర. అతనిని కోప్పడుతుంది దేవయాని మనం చేయాల్సింది అనుపమ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి ఎక్కడినుంచి పంపించేయాలి అంటుంది. మరోవైపు రంగా కోసం భోజనం తీసుకువచ్చిన సరోజ తో మళ్లీ అతను రిషి సార్ అంటుంది వసుధార. వసుధార పై కోప్పడి, ఆమె మనసు కష్టపెట్టేలాగా మాట్లాడుతుంది సరోజ. బాధపడిన వసుధర భోజనం చేయను అంటుంది. మా సరోజి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అంటాడు రంగా. అయినా భోజనం చేయకుండా బయటికి వెళ్ళిపోతుంది వసుధార.

జూన్ 21వ తారీకు 1107 ఎపిసోడ్ లో
వసుధార కోసం భోజనం తీసుకువెళ్తాడు రంగా. నేను బాధపడకూడదు అంటే మీరు భోజనం చేయండి అనటంతో వసుధార భోజనం చేస్తుంది. మరోవైపు మహేంద్రని ఓదార్చటానికి అతని ఇంటికి వస్తారు శైలేంద్ర దంపతులు. తర్వాత ఫణీంద్ర ఇంటికి వెళ్ళిపోతే దేవయాని మాత్రం మహేంద్ర కి ఇష్టమైన వంట చేసి వస్తాను అని భర్తని పంపించేస్తుంది తరువాత అనుపమతో మాట్లాడుతూ నీ కొడుకుని కామెడీని చేయాలనుకుంటున్నావా అని గొడవ పడుతుంది అప్పుడే మహేంద్ర వచ్చి దేవయానిపై కోప్పడతాడు. మరోవైపు రిషి వసుధార దగ్గరికి వచ్చి నేనే రిషిని ఇప్పుడే డాడ్ ని చూడాలనిపిస్తుంది పద అంటాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 june 17th to june 22nd episode

జూన్ 22వ తారీకు 1108 ఎపిసోడ్ లో
రిషి ని తనతో తీసుకు వెళుతుంది వసుధార కానీ తను కలగన్నాను కాని తెలుసుకుంటుంది. ఈ అమ్మాయి ఇంతలా పరితపిస్తుందంటే రిషిని ఎంతగా ప్రేమిస్తుందో అంటుంది రాధమ్మ. అవును ఇలాంటి భార్య దొరికినందుకు రిషి చాలా అదృష్టవంతుడు అని ఎమోషనల్ అవుతాడు రంగా. మరోవైపు శైలేంద్ర ఒక గ్యాంగ్ ని ఏర్పాటు చేసి తనే ఎండి కావాలి అని గొడవ చేయిస్తాడు. అది కనిపెట్టిన మను అతని ప్లాన్ తిప్పి కొడతాడు. ఇంతగా దిగజారిపోయావేంటి మీ నాన్నతో చెప్తాను అంటాడు మహేంద్ర వద్దని బ్రతిమాలుతాడు శైలేంద్ర. ఆ తర్వాత మను ని తనతో పాటు బయటకు రమ్మని బలవంత పెడుతుంది ఏంజెల్. అప్పుడే అక్కడికి వచ్చిన శైలేంద్ర ఏం జరుగుతుంది అని అడుగుతాడు ఏమీ లేదు నువ్వు బయటికి వెళ్ళు అంటాడు మనం నా తాత కట్టించిన కాలేజీలో నుంచి నన్ను బయటికి పొమ్మంటావేంటి అంటాడు శైలేంద్ర తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X