Guppedantha Manasu Weekly Round up: సరోజ, వసుధార మధ్య రిషి డ్రామా! సూసైడ్‌కు ప్రయత్నించిన మహేంద్ర!

గుప్పెడంత మనసు సీరియల్‌లో మన తండ్రి మహేంద్ర అని తెలుసుకొని షాక్ అవుతారు దేవయాని శైలేంద్ర అయితే ఆ విషయం అప్పుడే బయట పెట్టకూడదు అనుకుంటారు. కొడుకుని ఎండిన చేయమని భర్తని అడుగుతుంది దేవయాని. కానీ అర్హత ప్రకారం ఏదైనా జరుగుతుంది అంటాడు ఫణీంద్ర. మరోవైపు వసుధారణి చంపలేదని శైలేంద్రకి తెలిస్తే చంపేస్తాడని వసుధార వాళ్ళని వెతికే ప్రయత్నం చేస్తారు పాండు అండ్ గ్యాంగ్. మరోవైపు రంగా వసుధార దగ్గరికి వచ్చి నేనే రిషిని డాడ్ ని చూడాలనిపిస్తుంది పదా అంటాడు. కానీ అదంతా తన కల అని తరువాత తెలుసుకుంటుంది వసుధార. మరోవైపు తనతో పాటు బయటికి రమ్మని మనుని అడుగుతుంది ఏంజెల్. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కదా ఇక జూన్ 24వ తేదీ నుంచి జూన్ 29వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..

జూన్ 24వ తేదీ 1109 ఎపిసోడ్‌లో
మను తండ్రి గురించి తప్పుగా మాట్లాడిన శైలేంద్ర పై కోప్పడుతుంది ఏంజెల్. మీ ఇద్దరికీ నేను పెళ్లి చేస్తాను అందుకు బదులుగా ఈ ఎండి సీట్ నాకు వదిలేయ్ అని మనుతో బేరం పెడతాడు శైలేంద్ర. కుదరదని చెప్పి వెళ్ళిపోతారు మను,ఏంజెల్. మరోవైపు తనకి ఊరు చూపించమని రంగా ని అడుగుతుంది పసుధార. సరే అని రంగ ఊరు చూపించడానికి తీసుకువెళ్తే ఊరిని కాకుండా రంగాన్ని చూస్తూ కూర్చుంటుంది వసుధార ఆమె ప్రవర్తనకి ఇబ్బంది పడతారు రంగా, సరోజ. ఆ కోపంలో ఉన్న సరోజ ని వసుధార ఫోటో చూపించి నీకు తెలుసా అని అడుగుతారు పాండు గ్యాంగ్. మరోవైపు కొబ్బరి బొండం తాగుతూ దాని గురించి వివరిస్తుంది వసుధార అందుకు చిరాకుపడతాడు రంగా.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 june 24th to june 29th episode

జూన్ 25వ తారీకు 1110 ఎపిసోడ్‌లో
అప్పుడే అటుగా వచ్చిన ఒక వ్యక్తిని రంగా గురించి ఎంక్వయిరీ చేస్తుంది వసుధార అందుకు కోప్పడిన రంగా తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు.కోపంలో ఉన్న సరోజ వసుధారని పాండు వాళ్ళకి చూపిస్తుంది. రౌడీలు వసుధారని వెంబడిస్తుంటే రంగా కాపాడి ఇంటికి తీసుకువస్తాడు తర్వాత అలా చేసినందుకు సరోజని కోప్పడతాడు. మరోవైపు రంగా ఫోటో చూసి షాక్ అవుతాడు పాండు వాడు వీడేనా అంటూ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎవరు అని అసిస్టెంట్లు అడిగితే ఈ కథకి హీరో అని చెప్తాడు పాండు. మరోవైపు వసుధార దగ్గరికి వచ్చిన సరోజ తమ జీవితాల్లో నుంచి వెళ్ళిపోమంటుంది. 15 రోజుల్లో ఆయనే రిషి సార్ అని నిరూపించి ఆయనని తీసుకొని వెళ్ళిపోతాను అని సరోజితో ఛాలెంజ్ చేస్తుంది వసుధార.

జూన్ 26వ తేదీ 1111 ఎపిసోడ్‌లో
వసుధర మాటలకి భయపడిన సరోజ బావ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటుంది. మరోవైపు ఎండి సీటు తనకే దక్కడం లేదని ప్రెస్టేట్ అవుతూ తనని తానే హింసించుకుంటాడు శైలేంద్ర. మరోవైపు ఏంజెల్ మను దగ్గరికి వచ్చి తనకి ఐస్ క్రీమ్ తినాలని ఉందని చెప్పి మనోని తనతో పాటు తీసుకు వెళుతుంది అక్కడ మన తండ్రి గురించి ప్రస్తావన రావడంతో ఏంజెల్ ఏదో చెప్తుంది. ఆమె మీద ఫైర్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మను. మరోవైపు వసుధార వంట చేసిందని తెలుసుకొని ఆమె చేత వంట ఎందుకు చేయించావని రాధమ్మని మందలిస్తాడు రంగా. మరోవైపు మినిస్టర్ ఈ కాలేజీకి ఎండిగా ఎవరు కావాలో నిర్ణయించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ కాలేజీని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అంటాడు. కంగారుపడిన శైలేంద్ర ఈ కాలేజీకి వంశపారంపర్యంగా మేమే ఎండిగా ఉంటూ వస్తున్నాము కాబట్టి నేనే ఎండిగా ఉంటాను అంటాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 june 24th to june 29th episode

జూన్ 27 తేదీ 1112ఎపిసోడ్‌లో
వసుధార వచ్చి నిన్ను ఎండిగా పెట్టమని చెప్తే అప్పుడు నిన్ను ఎండిని చేస్తాము అంటాడు మినిస్టర్. అదెలా కుదురుతుంది అంటాడు శైలేంద్ర అందుకే వారం రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి లేదంటే కాలేజీకి మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అంటాడు మినిస్టర్. మరోవైపు ఇంట్లో వసుధార కనిపించకపోవడంతో ఆమెని వెతుకుతూ వెళ్తాడు రంగా తాపీగా బడ్డీలో టీ తాగుతున్న వసుధారని చూసి ఆమెని కోప్పడి తనతో పాటు ఇంటికి తీసుకువస్తాడు. మరోవైపు మినిస్టర్ అలా మాట్లాడటానికి కారణం మనం అని తెలుసుకుని అతడిని లేపేయటానికి సఫారీ మాట్లాడుతాడు శైలేంద్ర. మరోవైపు ఇంటికి వచ్చినా వసుధారని అలా ఎందుకు వెళ్లావు అని మందలించి తన గతం గురించి చెప్పమంటుంది రాధమ్మ.

జూన్ 28వ తేదీ 1113 ఎపిసోడ్‌లో
వసుధార తన కథంతా చెప్తే రంగ కన్నీరు పెట్టుకుంటాడు. మీరే నా రిషి సార్ అందుకే నాకు అది విని కన్నీరు పెట్టుకుంటున్నారు అంటుంది వసుధార. మీ కథ ఎమోషనల్ గా ఉంది అందుకే కన్నీరు పెట్టుకుంటున్నాను అంటాడు రిషి. మరోవైపు ఏంజెల్ మనుని ఇష్టపడుతుంది అని తెలుసుకుని మను కి దగ్గర అవ్వాలంటే అతని గతం గురించి తెలుసుకోవద్దు అతనికి కొత్త ప్రపంచం చూపించు, ఇద్దరు హాయిగా ఉండండి అని ఏంజెల్ కి చెప్తుంది అనుపమ. మరోవైపు సరోజ తనని పెళ్లి చేసుకోమని రంగాన్ని అడుగుతుంది మన ఇద్దరికీ సెట్ అవ్వదు అంటాడు రంగా. ఆయన నా రిషి సార్ అందుకే పెళ్లికి ఒప్పుకోవటం లేదు అంటుంది వసుధార. మరోవైపు కొడుకుని ఎండి చేస్తే తప్పేంటి అని భర్తని అడుగుతుంది దేవయాని. వసుధార వచ్చి చెప్తే అలాగే చేద్దాం అంటాడు ఫణీంద్ర. కాలేజీలో ఏ ఏ బ్రాంచ్ లో ఉన్నాయో కూడా తెలియని ఈ మనిషిని ఎండిగా చేయడానికి వసుధార ఎప్పటికీ ఒప్పుకోదు అంటుంది ధరణి.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 june 24th to june 29th episode

జూన్ 29వ తేదీ 1114 ఎపిసోడ్‌లో

అన్ని విషయాలు తల్లికి కంప్లైంట్ చేయడం కాదు సొంతంగా ఏదైనా సాధించు అని కొడుకుని చివాట్లు పెడతాడు ఫణీంద్ర. మరోవైపు వడ్డీ డబ్బుల కోసం వచ్చిన సరోజ తండ్రితో సరోజ, రంగాల పెళ్లి విషయం మాట్లాడుతుంది రాధమ్మ. రాధమ్మని కించపరిచేలాగా మాట్లాడి పెళ్లి జరగదు అంటాడు సరోజ తండ్రి. నువ్వు చేసినా, నేను చేసుకోను అంటాడు రంగా. ఆ మాట మీదే ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు సరోజ తండ్రి. మరోవైపు ఎవరు లేక ఒంటరివాడైనా మహేంద్ర నేను చనిపోతాను అంటూ తల గోడకేసి కొట్టుకుంటూ ఉంటాడు. అతడిని వారించి ధైర్యం చెప్తారు మను, అనుపమ. ఆ తర్వాత బయటకు వెళ్తున్న మనుని రౌడీలు అడ్డగిస్తారు. వాళ్ళని చిదగ్గొట్టి వాళ్లని శైలేంద్ర పంపించాడు అని తెలుసుకొని వాళ్ళని తీసుకొని శైలేంద్ర దగ్గరికి వెళ్తాడు మను. కానీ శైలేంద్ర ఏమీ తెలియనట్లు మాట్లాడటంతో రౌడీలని చూపిస్తాడు మను. ఒక్కసారిగా షాక్ అవుతాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X