Guppedantha Manasu Weekly Roundup: రిషి రాబోతున్నాడా.. అనుపమ గతం చెప్పిన మహేంద్ర!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 11వ తేదీ ఎపిసోడ్ లో.. కాలేజీకి వెళ్లిన వచ్చిన తర్వాత ధరణి తన భర్త శైలేంద్రను పొగడ్తలతో ముంచేస్తుంది. మీరే అలా వసు అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అనే పోస్టర్లు వేశారా.. మీరెంత మంచి వారు.. ముందు రోజే ఇలా చేస్తారని అస్సలే అనుకోలేదు అంటూ చెప్పుకొస్తూనే ఉంటుంది. మరోవైపు మహేంద్ర మనుకు ఫోన్ చేసి మరీ వసుధార పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరపాలని చెబుతాడు. మను కూడా ఓకే చెబుతాడు.

మార్చి 12వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర తన అన్నయ్య రవీంద్రకు ఫోన్ చేసి వసు బర్త్ డేకు రావాలని చెబుతాడు. సరే వస్తామని చెప్పిన రవీంద్ర.. దేవయాని, శైలేంద్ర, ధరణిలను పిలిచి మీరంతా రేపు కాలేజీకి రావాలంటాడు. వసుధార బర్త్ డే వేడుకలు చేస్తున్నారట.. మనుయే దగ్గరుండి ఆ పనులు చూసుకుంటున్నాడు.. మనం ఉదయాన్నే వెళ్లాలని వివరిస్తాడు. దేవయాని, శైలేంద్రలు రామని చెప్పగా వార్నింగ్ ఇస్తాడు రవీంద్ర. మరోవైపు విద్యార్థులు హ్యాపీ బర్త్ డే చెప్పగా వసు మనుపై ఫైర్ అవుతుంది.
మార్చి 13వ తేదీ ఎపిసోడ్ లో.. మను వసుధార పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాడు. ముఖ్యంగా విద్యార్థులు అందరూ రిషి మాస్క్ వేసుకుని రాగా.. స్క్రీన్ పై ఆయన ఫొటో పెట్టి మరీ వసు బర్త్ డే చేస్తారు. ఈక్రమంలోనే ఆమెకు నచ్చే విధంగా మను.. ఏవీ తయారు చేయిస్తాడు. విద్యార్థులతో పాటు ఇంట్లోని వాళ్లంతా ఆమె గురించి మాట్లడగా.. దాన్ని ప్లే చేస్తారు. అదంతా చూసిన వసు చాలా ఎమోషనల్ అవుతుంది. ముఖ్యంగా రిషి మాస్క్ లు పెట్టుకున్న విద్యార్థులను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మార్చి 14వ తేదీ ఎపిసోడ్ లో.. ఏంజెల్ అనుపమతో వాదిస్తుంది. ముఖ్యంగా మనును నీ పుట్టిన రోజు ఎప్పుడని అడగ్గగా.. ఆమె నీకెందుకు ఆయన చెప్పడు అంటూ అంటుంది. ఇలా ఏంజెల్, అనుపమల మధ్య గొడవ జరగ్గా.. మహేంద్ర మధ్యలో వచ్చి దాన్ని అక్కడికి ఆపేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వసుధార తన హ్యాపీనెస్ ను రిషి ఫొటోతో చెప్పుకుని మురిసిపోతుంది. మనును తప్పుగా అర్థం చేసుకున్నానని... కానీ ఆయన మంచితనం చూస్తే చాలా ముచ్చటేస్తుందంటూ మురిసిపోతుంది. అలాగే తన బర్త్ డే సెలబ్రేషన్స్ గురించి కూడా చెబుతుంది.
మార్చి 15వ తేదీ ఎపిసోడ్ లో.. మనుకు ఫోన్ చేసి రిషిని వెతికేందుకు తనకు సాయం చేయమని వసు అడుగుతుంది. దానికి అతను ఓకే చెప్పగా... వెంటనే వసు అనుపమ వద్దకు వస్తుంది. ఇదే విషయం చెప్పి అతడిపై మీ అభిప్రాయం ఏంటని, అతనికి మీకు ఉన్న బంధం ఏంటని ప్రశ్నిస్తుంది. అలాగే తాను గతంలో రిషి, జగతి మేడంలను చూసినప్పుడు కూడా ఇలాగే ఫీల్ అయ్యాయని.. కానీ ఆ తర్వాత కొంత కాలానికి వారి బంధం అర్థమైందని చెబుతుంది. కానీ మీ బంధం అర్థం కావట్లేదంటూ పదే పదే అడగ్గా.. నేను సమాధానం చెప్పను అంటూ అనుపమ వెళ్లిపోతుంది.
మార్చి 16వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర, వసులు అనుపమ గురించి మాట్లాడుకుంటారు. మన వచ్చినప్పటి నుంచి అనుపమ మేడం చాలా కంగారు పడుతున్నారని, ముఖ్యంగా ఆయనపై ప్రేమ చూపిస్తూనే అలా అంటున్నారని అంటుంది. ఆ తర్వాత మహేంద్ర కూడా అవునంటాడు. గతంలో జరిగిన విషయాల గురించి చెబుతాడు. ముఖ్యంగా తమ పెళ్లి చేసిన అనుపమ రిషి పుట్టేదాకా జగతిని చాలా బాగా చూసుకుందని కానీ ఆ తర్వాత కనిపించకుండా పోయిందని అంటాడు. ఆ తర్వాత రిషి ఉన్నట్లు తాను కూడా నమ్ముతున్నానని.. రిషిని త్వరలోనే తీసుకు వస్తావని అంటాడు.


Click it and Unblock the Notifications











