Guppedantha Manasu Weekly Roundup: అందుకే మను తండ్రి ఎవరో నీకు చెప్పను.. మహేంద్రతో అనుపమ!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మార్చి 18వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 18వ తేదీ ఎపిసోడ్ లో.. మను వద్దకు అనుపమ వస్తుంది. అతడి క్యాబిన్ లో కొత్త ప్రేమ జంట పోస్టర్ చూస్తుండగా.. వసు వస్తుంది. ఆ తర్వాత అక్కడకు వచ్చిన మనును ఇలా ఎందుకు చేశావు ఈ కాలేజీ నుంచి వెళ్లిపో అంటూ ఫైర్ అవుతుంది. నువ్వెందుకు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నావంటూ గొడవ చేయగా... నేను తప్పు చేయకపోయినా మీకోసం ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి బయటకు వస్తాడు.

మార్చి 19వ తేదీ ఎపిసోడ్ లో.. బయటకు వెళ్తున్న మనును పొడిచేందుకు ఓ రౌడీ వస్తాడు. అయితే దూరం నుంచి ఆ విషయం గుర్తించిన అనుపమ వెంటనే అక్కడకు పరిగెత్తుకుంటూ వస్తుంది. అతడిని పొడుస్తుండగా అడ్డుగా వెళ్తుంది. అలా ఆ రౌడీ కత్తిపోటుకు అనుపమ గురికాగా ఆమెను ఆస్పత్రిలో చేరుస్తారు. అంతకంటే ముందే మను అమ్మా అనగా.. వారిద్దరూ తల్లీకొడుకులు అని అంతా తెలుసుకుంటారు.
మార్చి 20వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర మనును ఓదారుస్తూ కనిపిస్తాడు. అనుపమకు త్వరలోనే నయం అవుతుందని చెబుతూ... అనుపమే నీ తల్లి అని ఎందుకు ఇంతకాలం దాచావని అడుగుతాడు. అందుకు మన తనే నన్ను అమ్మా అని పిలవకూడదు అంటూ ఒట్టు వేయించుకుందని.. అందుకే తాను ఇలా దూరంగా ఉంటున్నానంటూ వివరిస్తాడు. ముఖ్యంగా ఏంజెల్.. మను తనకు బావ అవుతాడని తెలిసి షాక్ అవుతుంది.
మార్చి 21వ తేదీ ఎపిసోడ్ లో.. వసుధార మను మంచితనం గురించి తెలుసుకుంటుంది. ముఖ్యంగా ఆ పోస్టర్లను రాజీవ్ క్రియేట్ చేయించి కాలేజీలో అతికించాడని.. వాటిని తొలగించి ఆ స్థానంలో తామే బర్త్ డే పోస్టర్లు పెట్టినట్లు మను పీఏ చెబుతాడు. ఇదంతా విన్న వసుధార వెంటనే వెళ్లి మనుకు సారీ చెబుతుంది. మీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా.. అలా ప్రవర్తించినందుకు సారీ అంటూ వివరిస్తుంది.

మార్చి 22వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర సోదరుడు రవీంద్ర తమ్ముడికి ఫోన్ చేసి.. అనుపమ పరిస్థితి ఎలా ఉందో తెలుసకుంటాడు. అలాగే నిందితులను త్వరగా పట్టుకోవాలని.. అంటాడు. చాలా కాలంగా తమపై శత్రువులు దాడి చేస్తూనే ఉన్నారని.. కాలేజీ కోసమే ఇదంతా జరుగుతున్నట్లు చూస్తుంటేనే అర్థం అవుతుందని అంటారు. మహేంద్ర కూడా తాను అదే పనిలో ఉన్నానని త్వరలోనే నిందితులను పట్టుకుంటానని చెబుతాడు.
మార్చి 23వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర అనుపమతో మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా మనుయే నీ కొడుకు అని ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, అసుల మీ మధ్య గొడవ ఏంటి... ఎందుకు దూరంగా ఉంచుతున్నావని అడుగుతాడు. ముఖ్యంగా తల్లిని నువ్వే అయితే మరి మను తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తాడు. అనుపమ మాత్రం తాను సమాధానం చెప్పదు.


Click it and Unblock the Notifications











