Guppedantha Manasu Weekly Roundup: మనుతో హ్యాపీగా వసు.. రిషి రీఎంట్రీ కష్టమేనా.. అసలేం జరగనుంది?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మార్చి 25వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి 25వ తేదీ ఎపిసోడ్ లో.. తన తల్లిపై రౌడీల చేత దాడి చేయించింది శైలేంద్ర, రాజీవ్ లేనంటూ మను ఫైర్ అవుతాడు. వారి వద్దకు వెళ్లి మరీ ఇంకోసారి ఇలా చేస్తే ప్రాణాలు తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇస్తాడు. ముఖ్యంగా శైలేంద్ర తలకు గన్ పాయింట్ చేసి మరీ మరోసారి తన తల్లి జోలికి రావద్దని హెచ్చరిస్తాడు. అలాగే దేవయాని మను తండ్రి ఎవరు అని తెలుసుకోవాలని కొత్త ప్లాన్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 March 25th to March 30th episode

మార్చి 26వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని అనుపమ వద్దకు వస్తుంది. నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతూనే.. మను నీ కొడుకు అంట కదా.. మరి నీ భర్త ఎవరు అంటూ ఆరా తీస్తుంది. ఆమె సమాధానం చెప్పకపోయినా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా మనుయేమైనా కుంతీ పుత్రుడా అంటూ కామెంట్లు చేస్తుంది. ఇదంతా వింటూ అనుపమ తెగ బాధపడగా.. వసుధార మధ్యలో వచ్చి దేవయానిని అడ్డుకుంటుంది. ఆమెకు ఇష్టం ఉన్నప్పుడే సమాధానం చెబుతుంది మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి అంటూ చెప్పి పంపిస్తుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 March 25th to March 30th episode

మార్చి 27వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర.. మను, అనుపమ మధ్య గొడవ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మను వద్దకు వెళ్లి మరీ ఏమైందని అడుగుతాడు. ఓ తండ్రి హోదాలో ఉండి అడుగుతున్నాను.. అసలేమైందో చెప్పమంటాడు. నాకు కొన్ని ప్రశ్నలకు పాతికేళ్లుగా సమాధానాలు దొరకట్లేదని.. అలాగే అది చెప్పమంటేనే అనుపమ తనను దూరం చేసుకుందని అంటాడు. ఇలా తన బాధనంతూ మహేంద్రతో పంచుకుంటాడు.

మార్చి 28వ తేదీ ఎపిసోడ్ లో.. అనుపమకు కావాల్సిన మందులు తీసుకుని మను ఇంటికి వస్తాడు. కానీ అనుపమ మాత్రం అతడిని వెళ్లిపోమని చెబుతుంది. ఇదంతా విన్న మహేంద్ర, వసుధారలు.. మను ఇక్కడే ఉంటాడని చెబుతారు. తన తల్లి గురించి చూసుకునే బాధ్యత అతడిపై ఉందని, ఓ తల్లిగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసే హక్కు మీకు లేదంటూ వివరిస్తుంది. మను ఇక్కడే ఉంటాడు, తిన్న తర్వాతే వెళ్తాడంటూ చెప్పగా.. ఆమె కూడా ఒప్పుకుంటుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 March 25th to March 30th episode

మార్చి 29వ తేదీ ఎపిసోడ్ లో.. మను, అనుమపలతో పాటు ఏంజెల్, వసు, మహేంద్రలు అంతా కలిసి భోజనం చేస్తారు. ఈక్రమంలోనే ఏంజెల్.. మనుకు ఏం ఇష్టమో అడగ్గా అనుపమ సమాధానం చెబుతుంది. అలాగే అత్తయ్యకు ఏమిష్టం అనగానే మను ఆమెకు ఇష్టమైన ఆహారం గురించి చెబుతాడు. అలాగే వసుధార మనుకు సారీ చెబుతుంది. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని క్షమించమని అడుగుతుంది.

మార్చి 30వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని మను, అనుపమ మధ్య ఎందుకు గొడవ జరిగిందో ఓ అంచనా వేస్తుంది. తండ్రి ఎవరో తెలియకే మను అడిగి ఉంటాడని.. అది చెప్పడం ఇష్టం లేకే అనుపమ అతడితో గొడవ పెట్టుకుని ఉంటుందని అంటుంది. వారిద్దరి మధ్య ఇంతకు మించి వేరే జరిగి ఉండదని.. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఈ విషయం అర్థం అవుతుందంటూ శైలేంద్రకు వివరిస్తుంది. అలాగే మనుపై ఎలా పగ తీర్చుకోవాలో కూడా ఓ స్పష్టత ఇస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X