Guppedantha Manasu Weekly Roundup: వసుపై ప్రేమ చూపిస్తున్న మను.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన వసు!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ అయిపోతుందని అనుకోలేపే కొత్త క్యారెక్టర్లను తీసుకు వచ్చి మరింత రసవత్తరంగా మార్చారు. ముఖ్యంగా ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇస్తూ.. సీరియల్ ను రక్తి కట్టిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మార్చి 4వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మార్చి 4వ తేదీ ఎపిసోడ్ లో.. వసు మిషన్ ఎడ్యుకేషన్ కోసం ఓ బస్తీకి వెళ్లాలనుకుంటుంది. బయలుదేరగానే కారు పాడవగా.. మను కనిపిస్తాడు. తన కారులో తీసుకెళ్తానని అంటాడు. నువ్వు రాలేవు అని చెప్పినా వినకుండా ఆమె వెంట వెళ్తాడు. వీరిద్దరూ కారులో వెళ్తుండగా చూసిన రాజీవ్ చాలా పైర్ అవుతాడు. తన మరదలు ఎవరితోనో తిరగడాన్ని జీర్ణించుకోలేక వారిని ఫాలో అవుతూ వెళ్లి ఫొటోలు తీస్తాడు. మను చేస్తున్న సపోర్ట్ చేసి వసు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంటికి వచ్చాక మహేంద్రకు కూడా అదే విషయాన్ని చెబుతుంది.

మార్చి 5వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్రకు అనుపమ, మనుల మధ్య ఏదో బంధం ఉందని అనుమానం కల్గుతుంది. అదే విషయాన్ని నేరుగా వెళ్లి అనుపమకు అడగగా ఆమె సమాధానం దాటవేస్తుంది. అతనెవరో తనకు తెలియదని చెబుతుంది. కానీ మహేంద్ర మాత్రం నమ్మడు. ఇంకా అక్కడే ఉంటే ఏం అడుగుతాడో అని భావించిన ఆమె నాకు నిద్దరస్తోంది అంటూ వెళ్లిపోతుంది. త్వరలోనే మీ ఇద్దరి మధ్య బంధం ఏంటో తెలుసుకుంటానంటూ మహేంద్ర అనుకుంటాడు. అలాగే వసు కూడా వీరిద్దరి మధ్య బంధం గురించి తెలుసుకునేందుకు తహతహలాడుతుంది.
మార్చి 6వ తేదీ ఎపిసోడ్ లో.. వసు ఏంజెల్ ను కాలేజీకి పిలిపించి మరీ మను గురించి ఆరా తీస్తుంది. ముఖ్యంగా అనుపమ, మనుల గురించి అడుగుతుంది. అంతలోనే మను అక్కడకు రావడంతో వసు టాపిక్ డైవర్ట్ చేస్తుంది. కానీ కారు దగ్గర అనుపమ, మనులు మాట్లాడుకోవడం చూసిన ఏంజెల్ కు కూడా వారిద్దరి మధ్య ఏదో బంధం ఉందని అనుమానం వస్తుంది. అదే విషయాన్ని ఏంజెల్ అనుపమను అడగ్గా.. నాకెవరూ తెలియదు, అతడి గురించి నన్ను మళ్లీ అడగొద్దు అంటూ చెప్పుకొస్తుంది.
మార్చి 7వ తేదీ ఎపిసోడ్ లో.. రాజీవ్ వసు, మనుల ఫొటోలు తీసి వాటిని కాలేజీలో అతికిస్తాడు. కొత్త ప్రేమ జంట అని రాయించి కాలేజీ అంతా అతికించి మరీ వీడియో తీస్తాడు. దాన్ని శైలేంద్రకు చూపించాలని ఆయన ఇంటికి వెళ్తాడు. అక్కడ ధరణి ఉండగా.. ఆమెకు కనిపించకుండా శైలేంద్రను పిలుస్తాడు. బెడ్ కింద దూరి మరీ ఆమె బయటకు వెళ్లగానే వీడియో చూపిస్తాడు. అది చూసిన శైలేంద్ర తెగ సంబుర పడిపోతాడు. భార్యకు రేపు పొద్దున నువ్వు కూడా కాలేజీకి రావాలంటూ వివరిస్తాడు.

మార్చి 8వ తేదీ ఎపిసోడ్ లో.. వసు, మనుల పోస్టర్లు చూసిన కాలేజీ విద్యార్థులు స్టాఫ్ అంతా వారిద్దరి మధ్య ఏదో బంధం ఉందంటూ కామెంట్లు చేస్తారు. మహేంద్ర, అనుపమలతో పాటు వసు కూడా వాటిని చూడగా.. అంతా కలిసి వారిని నిలదీస్తారు. దీంతో వసుధార నా పరువు పోయిన చోటు నేను ఉండను, కాలేజీ ఎండీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానంటూ చెప్పుకొస్తుంది. ఇక ఆ తర్వాత ఎండీ బాధ్యతలను శైలేంద్ర తీసుకోవడానికి సిద్ధం అవుతాడు.
మార్చి 9వ తేదీ ఎపిసోడ్ లో.. ముందురోజు జరిగిందంతా కళగా చూపిస్తారు. ఆ తర్వాత కాలేజీకి వచ్చి పోస్టర్లు చూసిన శైలేంద్ర షాక్ అవుతాడు. ముఖ్యంగా మను, వసుల పోస్టర్లకు బదులుగా హ్యాపీ బర్త్ డే వసు అని రాసి ఉన్నవి చూసి షాక్ అవుతాడు. ఈ పోస్టర్లపై కూడా వసు మనుపై ఫైర్ అవుతుంది. ఇలాంటివి ఇంకోసారి చేయొద్దని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత శైలేంద్ర రాజీవ్ కు ఫోన్ చేయగా.. వాళ్లు పోస్టర్లు చూస్తారు. ఇవెలా మారాయి అనుకుంటుండగా... మను వచ్చి నేనే చేశానంటాడు. మీరు మరీ ఇంత చీపా అంటూ జరిగిన విషయం వివరిస్తాడు.


Click it and Unblock the Notifications











