Guppedantha Manasu Weekly Roundup: హీరోలా మారిన మహేంద్ర.. వసు, మనులు సేఫ్.. మురిసిపోతున్న శైలేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మే 13వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 13వ తేదీ ఎపిసోడ్ లో.. దేవయాని శైలేంద్రను అనుమానిస్తుంది. తనకు తెలియకుండా శైలేంద్ర ఏదో చేస్తున్నాడని.. అయితే ఆ విషయం ఏంటో కానీ తనకు చెప్పకుండా దాస్తున్నాడని పసిగడుతుంది. అదే విషయం శైలేంద్రను అడగ్గా.. అదేం లేదని చెబుతూ ఆమెను తప్పించుకుని తిరుగుతాడు. మరోవైపు మహేంద్ర... వసుకు జాగ్రత్తలు చెబుతాడు. శైలేంద్రపై ఓ కన్నేసి ఉంచాలని తను వాళ్లను పూర్తిగా నమ్మేలా చేసుకోవాలని అంటాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 May 13th to May 18th episode

మే 14వ తేదీ ఎపిసోడ్ లో.. వసు, మహేంద్రలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా వారిద్దరూ తమ మాటలు శైలేంద్ర వింటున్నాడని గ్రహించే.. తాను ఎండీ పదవి నుంచి తప్పుకుంటానంటూ చెబుతుంది. తనకు ఈ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని వివరిస్తుంది. తామిద్దరమూ కలిసి కాలేజీ నుంచి వెళ్లిపోవాలని.. డిసైడ్ అవుతున్నట్లు మాట్లాడుకుంటారు. ఇదంతా చాటు నుంచి విన్నే శైలేంద్ర వారి మాటలు నమ్ముతాడు.

మే 15వ తేదీ ఎపిసోడ్ లో.. మహంద్ర, వసులతో శైలేంద్ర మాట్లాడుతూ కనిపిస్తాడు. ముఖ్యంగా ఎండీ పదవికి శైలేంద్ర అర్హుడేనంటూ మహేంద్ర చెబుతాడు. కానీ వసుధార మాత్రం అస్సలే కుదరదని అతడికి కాలేజీలో ఎన్ని గ్రూపులు ఉంటాయో కూడా తెలియదంటూ వివరిస్తుంది. కనీసం ఎంత మంది విద్యార్థులు ఉన్నారో కూడా తెలియదంటూ చెప్పగా.. ఏదీ తెలియకపోయినా త్వరలోనే తెలుసుకుంటాడంటూ చెప్పుకొస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర వెళ్లి తన సంతోషాన్ని భార్య, తల్లితో పంచుకుంటాడు.

మే 16వ తేదీ ఎపిసోడ్ లో.. మను కానిస్టేబుల్ ఫోన్ నుంచి వసుధార, మహేంద్రలకు ఫోన్ చేస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని.. అసలే శైలేంద్ర, రాజీవ్ లు మంచి వాళ్లు కాదని చెబుతాడు. నా గురించి మీరంతా సమస్యలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదంటూ అంటాడు. కానీ మహేంద్ర మాత్రం.. నేను నీకోసం ఏదైనా చేస్తాను, నీకు తండ్రి స్థానంలో ఉండి నిన్ను బయటకు తీసుకు వస్తానంటూ చెప్పుకొస్తాడు. అలాగే అనుపమ వినేలా స్పీకర్ ఆన్ చేయమని చెప్పి మరీ మను.. నేను ధైర్యంగా ఉన్నాను, ఎలాంటి బాధ లేదంటూ చెబుతాడు.

మే 17వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర రాజీవ్ ను పట్టించే ప్లాన్ చేయగా.. రాజీవ్ మాత్రం మధ్యలోనే వసు, శైలేంద్రలను తన స్థావరానికి తీసుకు వెళ్తాడు. అక్కడే శైలేంద్రను గన్ తో బెదిరించి మరీ వసును పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సరైన ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెబుతూ.. రచ్చ చేస్తాడు. వద్దని శైలేంద్ర చెబుతున్నా వినకుండా రచ్చ చేస్తాడు.

మే 18వ తేదీ ఎపిసోడ్ లో.. రాజీవ్ వసుధార మెడలో రిషి కట్టిన తాళి తెంచే ప్రయత్నం చేస్తాడు. వద్దని వసు బతిమాలుతున్నా, పాపం అని శైలేంద్ర అంటున్నా వినకుండా పెనుగులాడుతాడు. అప్పుడే మహేంద్ర హీరోలా ఎంట్రీ ఇస్తాడు. రాజీవ్ తలపై కొట్టి వసును కాపాడుతాడు. ఆ తర్వాత లేచిన రాజీవ్ గన్ తో మహేంద్రను బెదిరిస్తాడు. అప్పుడే శైలేంద్ర గన్ లాక్కొని రాజీవ్ ను బెదిరించగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి అతడిని అరెస్ట్ చేస్తారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X