Guppedantha Manasu WeeklyRoundup:శైలేంద్ర ఆశలపై నీళ్లు..బోర్డు మీటింగ్‌లో పోయిన పరువు..నిజం చెప్పనున్న అనుపమ!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మే 20వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మే 20వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర కళ గంటాడు. ముఖ్యంగా తాను రాజీవ్ ను పోలీసులను పట్టించునందుకు గాను తనను చంపేందుకు వచ్చినట్లు చూపిస్తారు. దీంతో శైలేంద్ర చాలా భయపడిపోతూ.. రాజీవ్ కాళ్లపై పడతాడు. కానీ తన భార్య కాళ్లపై పడి రాజీవ్ అనుకుని తప్పైంది, తప్పైంది అంటాడు. ఆ తర్వాత ఫణీంద్ర చూసి వీడికి పిచ్చెక్కిందంటూ గొడవ చేస్తాడు. ఈక్రమంలోనే దేవయాని నా కడుపును చెడ పుట్టావురా అంటూ మరింత గొడవ చేస్తుంది.

మే 21వ తేదీ ఎపిసోడ్ లో.. మను, వసు, మహేంద్రలు బోర్డు మీటింగ్ పెడతారు. ఈక్రమంలోనే వసు మాట్లాడుతూ.. మను ఏ తప్పు చేయకపోవడం వల్లే బయటకు వచ్చారని చెబుతుంది. తనకు సంతోషంగా ఉందని వివరిస్తుంది. మను మాట్లాడుతూ.. నేను తీసుకున్న అప్పు మాఫీ చేస్తున్నానంటూ ప్రకటిస్తాడు. ఆ తర్వాత మీటింగ్ అయిపోయిందని చెప్పగా.. శైలేంద్ర తనను ఎండీగా ఎందుకు ప్రకటించలేదని అడుగుతాడు. ఫణీంద్ర నువ్వు ఎండీ ఏంట్రా అనగా.. మీరెళ్లండి డాడీ నేను మాట్లాడుకుంటానంటూ వసు వాళ్లతో గొడవ పడతాడు.
మే 22వ తేదీ ఎపిసోడ్ లో.. మను వసుధార వాళ్ల ఇంటికి వస్తాడు. ఈక్రమంలోనే అనుపమను చూస్తూ తన తండ్రి గురించి ఇంకా తెలిసేలా లేదంటూ రచ్చ చేస్తాడు. అనుపమ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. తన తండ్రి గురించి ఇంకెప్పడికీ తనకు తెలిసేలా లేదని మను ఫీల్ కాగా.. త్వరలోనే తెలుస్తుందంటూ వసు, మహేంద్రలు చెబుతారు. ఆ తర్వాత శైలేంద్ర ఇంటికి తాగి వెళ్తాడు. ముఖ్యంగా తనకు ఎండీ పదవి దక్కకపోవడంతో చాలా కోపంగా ఉంటాడు.

మే 23వ తేదీ ఎపిసోడ్ లో.. వసుధార అనుపమ వద్దకు వెళ్తుంది. మనుకు తన తండ్రి ఎవరో చెప్పడం మంచిదని.. ఆయనే తెలుసుకుంటనే పెద్ద సమస్య వస్తుందని అంటుంది. మీరు చెప్పడం వల్లే ఆయన కోపం చల్లారుతుందని... కానీ చెప్పాల్సిన పద్ధతిలో చెబితే ఆయన అర్థం చేసుకుంటారంటూ వివరిస్తుంది. అప్పుడే మహేంద్ర వచ్చి ఈమె చెప్పదు, మనుయే తెలుసుకుని తన తండ్రిని చంపేస్తాడంటూ కామెంట్లు చేస్తాడు.
మే 24వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర వసు, మహేంద్ర, మనులను తెగ ఇరిటేట్ చేస్తాడు. ముఖ్యంగా రిషి చనిపోయాడని ఇక తిరిగి రాడంటూ వాళ్లకు కోపం వచ్చేలా చేస్తాడు. రిషి వచ్చినా తాను మళ్లీ చంపేస్తానని చెప్పుకొస్తాడు. ఆ తర్వాత మను వద్దకు వెళ్లి నిన్ను నేను దత్తత తీసుకుంటాను.. ఎలాగూ నీకు నీ తండ్రి ఎవరో తెలియదు కదా అంటూ కామెంట్లు చేస్తాడు. ఆయనకు కూడా కోపం తెప్పిస్తాడు. అలాగే మహేంద్ర నిన్ను దత్తత తీసుకుంటే నువ్వు నీ తండ్రి గురించి మర్చిపోతావంటూ చెప్పుకస్తాడు.

మే 25వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర.. రాజీవ్ వద్దకు వెళ్తాడు. నిన్ను పోలీసులకు ఎవరు పట్టించారో తెలుసా అనగా.. వసు, మహేంద్రలే కదా అంటాడు రాజీవ్. అయితే వాళ్లకు ఎవరో సాయం చేశారు వాడెవడో పట్టుకోమని శైలేంద్రకు చెబుతాడు. అప్పుడే శైలేంద్ర నేను కాదంటూ భయ పడతాడు. నువ్వు కాదు బ్రదర్.. నువ్వు నాకు మిత్రుడివి ఇలా ఎందుకు చేస్తావంటూ రాజీవ్ అంటాడు. దేవయాని మేడమ్ కు మనం ఇద్దరం రెండు కళ్ల లాంటి వాళ్లం.. మీరు నన్నెప్పుడూ మోసం చేయరంటూ వివరిస్తాడు. తనపై రాజీవ్ కు ఉన్న నమ్మకం చూసి శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.


Click it and Unblock the Notifications











