Guppedantha Manasu Weekly Roundup: రిషి రీఎంట్రీకి టైమొచ్చింది.. వసుకు అవమానంలో ఈ హింట్ పట్టేశారా?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మే 27వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 27వ తేదీ ఎపిసోడ్ లో.. వసుధార అనుపమ వద్దకు వెళ్లి మనుకు ఆయన తండ్రి ఎవరో చెప్పాలని చెబుతుంది. తనంతటే తానే తెలుసుకుంటే మరింత సమస్య అవుతుందని.. మీరు చెప్పడమే సమంజసం అని వివరిస్తుంది. అప్పుడే మహేంద్ర, మనులు ఎంట్రీ ఇస్తారు. అయితే అనుపమ చెప్పేలా లేదని మీరే మా నాన్న ఎవరో తెలుసుకుని చెప్పాలని మను.. మహేంద్రను మాటివ్వమంటాడు. మహేంద్ర కూడా కచ్చితంగా తెలుసుకని చెబుతానంటూ మనుకు మాట ఇస్తాడు. అది చూసిన వసు, అనుపమలు షాక్ అవుతారు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 May 27th to June 1st episode

మే 28వ తేదీ ఎపిసోడ్ లో.. మనుకు మాట ఇచ్చిన మహేంద్రను మాట వెనక్కి తీసుకోమంటూ అనుపమ చెబుతుంది. నువ్వు మను తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని, అది ఎంత త్వరగా ఆపేస్తే అంత మంచిదని చెబుతుంది. కానీ ఆయమ మాత్రం అస్సలే ఒప్పుకోడు. మరోవైపు ఏంజెల్.. మనుతో పాటు కలిసి ఉండేందుకు, కాలేజీలో పని చేస్తానని వసుకు ఫోన్ చేస్తుంది. మనుకు దగ్గరయ్యేందుకు కాలేజీలో జాయిన్ అయ్యేందుకు వసు కూడా ఓకే చెబుతుంది. ఇలా మను, ఏంజెల్ లు కలిసేందుకు ఛాన్స్ వస్తుంది.

మే 29వ తేదీ ఎపిసోడ్ లో.. మహేంద్ర మను అసలు తండ్రి ఎవరో తెలుసుకునేందుకు నేరుగా అనుపమ పెద్దమ్మ వద్దకు వెళ్తాడు. మీకు అన్ని విషయాలు తెలుసు కదా.. మను కన్నతండ్రి ఎవరో చెప్పమని అంటాడు. కానీ ఆమె మాత్రం నేను చెప్పలేనంటూ తెగేసి చెబుతుంది. అప్పుడే అనుపమ ఎంట్రీ ఇస్తుంది. నువ్వు మను తండ్రి గురించి తెలుసుకోవద్దంటూ గట్టిగా గొడవ పడుతుంది. మహేంద్ర కూడా అస్సలే వెనక్కి తగ్గడు. ఏదో పెద్ద గొడవ అయ్యేలా ఉందని వసుధార.. తన మామయ్య మహేంద్రను బలవంతంగా ఇంటికి తీసుకు వెళ్తుంది.

మే 30వ తేదీ ఎపిసోడ్ లో.. వసుకు ఓ విద్యార్థితో ఫోన్ చేయించి స్టోర్ రూంలో విద్యార్థులు కొట్టుకుంటున్నారని చెప్పిస్తాడు. అది నమ్మిన వసు గదిలోకి రాగానే మత్తు మందు చల్లి పడిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ నుంచి మనుకు మెసేజ్ పెట్టగా... అతడు అక్కడికి వస్తాడు. దీంతో శైలేంద్ర బయట గడియ పెట్టి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అక్కడ వారిద్దరూ ఏదో చేస్తున్నారంటూ క్రియేట్ చేసి అందరినీ తీసుకు వచ్చి చూస్తారు. కానీ లోపల ఏంజెల్ ఉంటుంది. ఎవర్రా నన్ను లోపల వేసి తలుపు పెట్టిందంటూ పెద్ద గొడవ చేస్తుంది.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 May 27th to June 1st episode

మే 31వ తేదీ ఎపిసోడ్ లో.. జైలు నుంచి తప్పించుకున్న రాజీవ్ ముందుగా వసుధార ఇంటికి వెళ్తాడు. అప్పటికే వారికి పోలీసులు ఫోన్ చేసి విషయం చెప్పగా వసు వణికిపోతూ ఉంటుంది. మహేంద్ర మాత్రం రాజీవ్ ను పట్టించింది శైలేంద్ర.. వారిద్దరూ పెద్ద వెదవలు, వారి వల్ల ఏదీ కాదంటూ కామెంట్లు చేస్తాడు. అది విన్న రాజీవ్ వెంటనే శైలేంద్ర వద్దకు వెళ్లి చంపాలని చూస్తాడు. అప్పుడే దేవయాని వచ్చి మీరు గొడవ పడితే ఎలాంటి ఉపయోగం లేదని.. మళ్లీ కలిసి శత్రువులపై పగ తీర్చుకోవాలని చెబుతుంది. ఆమె మాటతో శాంతించిన రాజీవ్ శైలేంద్రతో కలిసిపోతాడు.

మే 1వ తేదీ ఎపిసోడ్ లో.. వసుధార.. దేవయాని ఇంటికి వ్రతానికి వెళ్తుంది. పిల్లల కోసం ధరణి, శైలేంద్రలు చేసిన వ్రతం చక్కగా ముగుస్తుంది. కానీ తంబూలాలు ఇచ్చే దగ్గర వసుధారకు అవమానం జరుగుతుంది. భర్త చనిపోయిన అమ్మాయికి తాంబూలం ఇవ్వొద్దని పలువురు చెప్పగా.. ధరణి ఆమెకు అండగా నిలుస్తుంది. నేను ఇస్తాను, నాకు పిల్లలు పుట్టకపోయినా ఫర్వాలేదంటూ చెప్పుకొస్తుంది. అలా ఏడుస్తూ తాంబూలం తీసుకున్న ఈమె అవమానం భారంతో ఇంటికి వెళ్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X