Guppedantha Manasu Weekly Roundup: వసుకు మను షాక్.. ఎండీ పదవికోసం స్నేహితుడిని మోసం చేయబోతున్న శైలేంద్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ లో రిషి వచ్చేస్తే సీరియల్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మధ్యలో మను రావడంతో సీరియల్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కొత్త క్యారెక్టర్ రావడంతో.. సీరియల్ అద్భుతంగా సాగుతోంది. అయితే ఎప్పటిలాగే ఈ వారం కూడా సీరియల్ అదిరిపోయింది. ముఖ్యంగా ఈ వారం కూడా సీరియల్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. మే 6వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు ఈ సీరియల్ లో అసలు ఏం జరిగింది, ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మే 6వ తేదీ ఎపిసోడ్ లో.. శైలేంద్ర చాటుగా రాజీవ్ తో ఫోన్ మాట్లాడడం చూస్తాడు. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని దగ్గరగా వెళ్లి వినే ప్రయత్నం చేస్తుంది. కానీ అది గుర్తించిన శైలేంద్ర తనను వెనక్కు పంపిస్తాడు. ఇక ఆ తర్వాత రాజీవ్ తో మాట్లాడుతూ.. వసు, మహేంద్రలకు తమపై అనుమానం వచ్చిందని అంటాడు.

Guppedantha Manasu Telugu Serial Weekly Roundup 2024 May 6th to May 11th episode

మే 7వ తేదీ ఎపిసోడ్ లో.. వసు, మహేంద్ర, అనుపమలు పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అప్పుడే ఎస్సై వచ్చి రాజీవ్ డెడ్ బాడీ దొరికిందని.. డీఎన్ఏ టెస్టులో అది అతడి శవమే అని తేలిందని అంటాడు. అదంతా విన్న వసు, మనులు షాక్ అవుతారు. కానీ రాజీవ్ బతికే ఉన్నాడని అయితే దాన్ని ఎలా నిరూపించాలా అని వసు ఆలోచిస్తూ ఉంటుంది. అనుపమ కూడా మనును ధైర్యంగా ఉండాలని, తాను అలాగే పెంచినట్లు వివరిస్తుంది.

మే 8వ తేదీ ఎపిసోడ్ లో.. రాజీవ్ తో మాట్లాడుతున్న శైలేంద్రను చూసిన ధరణి తన భర్త ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడని గొడవ చేస్తుంది. దేవయాని, ఫణీంద్రలను పిలిచి.. ఆయనేదో సీక్రెట్ గా మాట్లాడుతున్నాడని, ఇల్లీగల్ రిలేషన్ మెయింటేన్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తుంది. అలాగే మనును ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది.

మే 9వ తేదీ ఎపిసోడ్ లో.. రాజీవ్ పాల వాడిని వేషం వేసుకుని మరీ వసుధార ఇంటికి వస్తాడు. కర్చీఫ్ మీద మత్తు మందు చల్లి ఆమెను కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. అయితే లోపలి నుంచి ఆమె వస్తుందనుకోగా.. బయట నుంచి వచ్చి రాజీవ్ కు షాక్ ఇస్తుంది. దీంతో వెంటనే అతడి మాస్కు తీయగా.. వసు షాక్ అవుతుంది. వెంటనే తన మామయ్యను పిలిచి అతడిని పట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది. అది గుర్తించిన రాజీవ్ అక్కడి నుంచి పారిపోతాడు.

మే 10వ తేదీ ఎపిసోడ్ లో.. మను కాలేజీకి నోటీసులు పంపిస్తాడు. ముఖ్యంగా 50 కోట్లు కట్టాలని అంటాడు. ఆ నోటీసులు చూసిన శైలేంద్ర వెంటనే మనును కలిసేందుకు పోలీస్ స్టేషన్ కు వస్తాడు. నువ్వేంటి ఇలా చేశావు.. అసలు ఆ 50 కోట్ల అప్పు నువ్వు కట్టనేలేదు కదా అంటూ అడుగుతాడు. ఆ విషయం నీకు, నాకు తెలుసు కానీ వాళ్లకు తెలియదు కదా నన్ను బయటకు తీసుకు వస్తానంటే నీకు ఎండీ పదవి ఇస్తానంటూ ఆశ పెడతాడు. రాజీవ్ ను తీసుకువచ్చి నన్ను బయటకు తీసుకు రా అంటూ అడుగుతాడు.

మే 11వ తేదీ ఎపిసోడ్ లో.. అయితే శైలేంద్ర కాలేజీకి వెళ్లి వసు, మహేంద్రలకు మను మోసం గురించి వివరిస్తాడు. అతడు మనల్ని... చాలా మోసం చేశాడంటూ చెబుతాడు. ఆతర్వాత వసుధార పోలీస్ స్టేషన్ కు వెళ్లి మనుపై ఫైర్ అవుతుంది. ఇదంతా వాళ్లు ఆడే నాటకమే అయినా కానిస్టేబుల్ తాము మాట్లాడుకునేదంతా శైలేంద్రకు వినిపించడం చూసి మను, వసులు రెచ్చిపోతారు. తిట్టినట్లు వసు, కచ్చితంగా డబ్బులు కట్టమని మను గొడవ పడతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X