Guppedantha Manasu Weekly Roundup: వసుధారపై ఫైర్ అయిన మినిస్టర్.. అదిరిపోయే రేంజ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన రిషి!
రిషి రీఎంట్రీ కి రంగం సిద్ధం చేయడంలో భాగంగా మళ్లీ రిషి కర్మాకాండ అంశం తెరపైకి వస్తుంది. రిషి గురించి పేపర్లో ప్రకటన ఇస్తుంది వసుధార ఆ నెంబర్ కి కాల్ చేసి వసుధారని ఒక ఆట ఆడుకుంటాడు శైలేంద్ర. ఆ తర్వాత కాలేజీ గురించి ఎంక్వైరీ కమిషన్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కాలేజీకి ఎగ్జామినేషన్ సెంటర్ రాకుండా చేస్తాడు శైలేంద్ర. ఇదంతా గత ఎపిసోడ్ లో జరిగిన కదా ఇక జూన్ పదవ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరిగిన ఎపిసోడ్స్ వివరాల్లోకి వెళితే..
జూన్ 10వ తేదీ 1097 ఎపిసోడ్ లో
రిషి ఉన్నారు అనే విషయాన్ని నేను నమ్ముతున్నాను అంటూ కోపంగా మీటింగ్ నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఆమెపై ఫైర్ అవుతాడు మినిస్టర్. నేను సర్ది చెప్తాను అంటాడు ఫణీంద్ర. తర్వాత తమ్ముడు దగ్గరికి వెళ్లి వస్తారని తీసుకొని ఇంటికి రమ్మని చెప్తాడు. ఇంటికి వెళ్ళినా వసుధార వాళ్లతో రిషి లేడనే విషయాన్ని నువ్వు నమ్మాలి వచ్చే వాడే అయితే ఎప్పుడో వచ్చేవాడు అంటాడు ఫణీంద్ర.

జూన్ 11 వ తారీకు 1098 ఎపిసోడ్ లో
రిషి చనిపోయాడు అనే విషయాన్ని ఒప్పుకోమని ఫణీంద్ర కుటుంబ సభ్యులందరూ చెప్పటంతో నేను బ్రతికే ఉన్నాను అంటే రిషి సార్ కూడా బ్రతికే ఉన్నారని అర్థం అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. ఇంటికి వచ్చిన తర్వాత మహేంద్ర తో నేను బ్రతికి ఉన్నాను అంటే కచ్చితంగా రిషి సార్ కూడా బ్రతికే ఉన్నట్లు లెక్క నేను నా నిర్ణయాన్ని రేపు బోర్డు మీటింగ్ లో చెప్తాను రేపు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయండి మినిస్టర్ గారిని కూడా రమ్మనండి అంటుంది. బోర్డు మీటింగ్ లో కూర్చున్న వాళ్లందరికీ వసుధార ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని క్యూరియాసిటీతో ఉంటారు.
జూన్ 12వ తేదీ 1099 ఎపిసోడ్ లో
మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ముందుగా నాకు చెప్పండి అంటాడు మను అందరిలోనూ చెప్తేనే బాగుంటుంది ఈ సాయంత్రం లోపు మీ అన్వేషణ ఫలిస్తుంది అంటూ మీటింగ్ కి వెళ్ళిపోతుంది వసుధార. మీటింగులో కాలేజీ గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అవుతుంది తరువాత రిషి సార్ ఉన్నారు అని నమ్మలేని మనుషుల దగ్గర నేను ఉండలేను అంటూ తన రెజిగ్నేషన్ లెటర్ ఇస్తుంది. ఆమె చేత రిజర్వేషన్ లెటర్ ని వెనక్కి తీసుకునేలా చేయాలని మినిస్టర్ వాళ్లు చాలా ప్రయత్నిస్తారు కానీ ఆమె ఒప్పుకోకుండా అక్కడినుంచి వెళ్ళిపోతుంది వస్తే రిషి సార్ తో కలిసి వస్తాను లేదంటే నాకోసం వెతకండి అని మహేంద్ర కి చెప్పి వెళ్ళిపోతుంది వసుధార.
జూన్ 13 తారీకు 11 ఎపిసోడ్ లో
వసుధార నిజంగానే కాలేజీ వదిలి వెళ్ళిపోయిందా క్యాబిన్ కి వెళ్తాడు శైలేంద్ర అక్కడ అతనికి ఒక లెటర్ దొరుకుతుంది అది చదివి షాక్ అవుతాడు శైలేంద్ర. అవసరమైనప్పుడు దీన్ని ఆయుధంగా వాడుకుంటాను అని జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత వసుధార వెళ్ళిపోవటంలో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ శైలేంద్ర కి వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర. ఇంతకుముందు అవ్వలేదు కానీ ఇప్పుడు అవుతాను అంటూ పాండుకు చెప్పి వసుధారని కిడ్నాప్ చేయిస్తాడు శైలేంద్ర. మెలకువ వచ్చిన వసుధారా తనని గోతిలో పాతి పెట్టేయబోతున్నారు అని గ్రహించి అక్కడి నుంచే పారిపోతుంది. ఆమెని వెంబడిస్తారు రౌడీలు అప్పుడే రిషి రీ యంట్రీ ఇచ్చి ఆమెని కాపాడుతాడు.

జూన్ 14వ తారీకు 1101 ఎపిసోడ్ లో
తనకోసమే ఫైట్ చేస్తున్న రిషి ని చూసి షాక్ అవుతుంది వసుధార. అతడిని రౌడీలు కొట్టబోతుంటే అడ్డుపడి ఆమె తలకి దెబ్బ తగిలించుకుంటుంది ఆమెని హాస్పిటల్ కి తీసుకు వెళ్తే డాక్టర్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు అని అసిస్టెంట్ కి చెప్పి ఇంటికి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తాడు రిషి. మరోవైపు కాలేజీని ఎట్టి పరిస్థితులలోనూ వదలనని మనం దగ్గర మాట తీసుకుంటాడు మహేంద్ర. మహేంద్ర కోసం అనుపమ, అనుపమ కోసం మను ఇద్దరూ మహేంద్ర దగ్గరే ఉండిపోవడానికి నిశ్చయించుకుంటారు. మరోవైపు ఈ అమ్మాయి ఎక్కడ దొరికింది అని రంగాని ( రిషి ) నీ అడుగుతుంది వాళ్ళ బామ్మ జరిగిందంతా చెప్తాడు రిషి. అప్పుడే అక్కడికి వచ్చిన రంగా మరదలితో ఆమెకి నీ బట్టలు ఇవ్వు అని చెప్తాడు.
జూన్ 15వ తారీకు 1102 ఎపిసోడ్ లో
స్పృహలోకి వచ్చిన వసుధార రంగాన్ని చూసి రిషి సార్ అంటూ ఆమెని హగ్ చేసుకుంటుంది. అది చూసి కంగారుపడిన రంగ మరదలు సరోజా అతను రిషి సార్ కాదు మా బావ రంగా అంటుంది. రిషి కూడా నేను రిషి ని కాదు రంగాని అని చెప్పడంతో కన్ఫ్యూజన్లో మళ్ళీ స్పృహ కోల్పోతుంది. మరోవైపు వసుధార తప్పించుకుంది అని చెప్తే శైలేంద్ర ఎక్కడ కోప్పడతాడు అని ఒక బొమ్మని సమాధి చేస్తూ వీడియో కాల్ లో చూపించి శైలేంద్రని చీట్ చేస్తాడు పాండు. శైలేంద్ర ముందు నమ్మకపోయినా తర్వాత నమ్ముతాడు ఇంట్లో వాళ్ళందరినీ తల స్నానం చేయమని చెప్తాడు ఏం జరిగింది అని అడుగుతుంది దేవయాని జరిగిందంతా చెప్తాడు శైలేంద్ర, తండ్రి ఈ స్నానాల కూడా ఏమిటి అంటాడు.
ఈరోజు గ్రహాలన్నీ ఓకే దిశలో ప్రయాణిస్తాయట ఈరోజు స్నానం చేస్తే మంచిది అంటూ కొడుకుని కవర్ చేసేస్తుంది దేవయాని. ఆ తర్వాత మనుకి తండ్రి మహేంద్ర అనే విషయం శైలేంద్ర తల్లికి చెప్తాడు. నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది దేవయాని. నిజమే అంటూ తనకి వసుధర్ క్యాబిన్లో దొరికిన లెటర్ ని చూపిస్తాడు శైలేంద్ర. అందులో మను తండ్రి మహేంద్ర అని వసుధార ఉండటంతో ఆశ్చర్య పోతుంది దేవయాని. ఉత్తరం చదివిన వసుధార తర్వాత ఏం చేయబోతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











