Guppedantha Manasu March 5th: మనుతో అనుపమ బంధంపై వసు డౌట్.. మరదలి పొందేందుకు రాజీవ్ కుట్ర!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజురూ అద్భుతంగా సాగుతోంది. ఈరోజుటి ఎపిసోడ్ లో ముందుగా రాజీవ్ ను చూపిస్తారు. వసు, మనులు కలిసి పొలం గట్లపై తిరుగతున్నప్పుడు తీసిన ఫొటోను చూస్తూ ఫుల్ ఫైర్ అవుతాడు. వీడితో నువ్వు తిరగడం ఏంటి, చనిపోయిన రిషిని తీసుకు వస్తానని అనడం ఏంటంటూ కోపంతో ఊగిపోతాడు. నువ్వు ఇలాగే చేస్తే మనను చంపేస్తానంటూ చెప్పుకొస్తాడు. మరోవైపు వసుధారను చూపిస్తారు. ఫోన్ లో రిషి ఫొటో చూస్తూ లోలోపల మాట్లాడుకుంటూ ఉంటుంది. మిమ్మల్ని ఎలాగైనా పట్టుకుంటానని అంటుంది.

అలాగే మను తమ ప్రేమను చాలా బాగా అర్థం చేసుకుని, మిషన్ ఎడ్యుకేషన్ కు సాయం చేయబోతున్నాడని చెబుతుంది. అలాగే తమ అనుపమ, మనుల మధ్య బంధాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నానని.. వారిద్దరూ కూడా మంచి వాళ్లేనని అంటుంది. అలాగే మీకు, జగతి మేడంకు మధ్య ఉన్న బంధాన్ని నేను సులువుగానే అర్థం చేసుకోగలిగానని.. కానీ వీరిద్దరి మధ్య బంధమే అర్థం కావట్లేదంటూ చెప్పుకొస్తుంది. మీ మధ్య కోపం, ధ్వేషం ప్రేమగా మారడాన్ని కళ్లారా చూశానని.. అలాగే మను, అనుపమల మధ్య బంధం ఏంటో తాను కచ్చితంగా తెలుసుకుంటానని రిషి ఫొటోకు చెబుతుంది.

Guppedantha Manasu Vasu And Mahendra Doubt Abour Anupama Relation With mano

ఆ తర్వాత మను భోజనం చేస్తూ కనిపిస్తాడు. అంతోలనే అతడికి పౌలమారగా.. తన తల్లిని గుర్తు చేసుకుంటాడు. పొలమారగానే తల్లి వచ్చి నీళ్లు తాగించి.. తినేటప్పుడు మాట్లాడకూడదని తెలియదా అంటూ చెప్పిన మాటలు తలుచుకుంటాడు. ఆ తర్వాత తన నానమ్మ.. ఎవరు తలుచుకున్నారో అంటూ చెబుతుంది. మొన్న మహేంద్ర వాళ్ల ఇంట్లో నన్ను తలుచుకోవడానికి ఎవరూ లేరని అన్నావట అంటూ అడుగుతుంది. దానికి మను.. ఆ విషయాన్ని నీ వరకూ మోసుకు వచ్చారా అంటూ అడుగుతాడు. వార్తలు ఆగిపోవచ్చు కానీ.. భావోద్వేగాలు తెలుస్తాయంటుంది.

ఇలా ప్రేమ ఉండి.. దూరంగా, వేర్వేరుగా ఎందుకు ఉంటున్నారని నానమ్మ అడగుతుంది. తన దగ్గర నుంచి ఓ సమాధానం రావాలని, అది చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. ఆమె ఆన్సర్ చెబితే మేము కలిసిపోవడం ఖాయం అంటూ వివరిస్తాడు. తన సమాధానం వచ్చే వరకూ ఆ బాధ అనుభవిస్తానని అంటాడు. నువ్వు వెతుకుతున్న సమాధానం కచ్చితంగా దొరుకుతుందని చెప్పగా.. ఇప్పటికే పాతికేళ్లు అవుతుందని అంటాడు. ఆ తర్వాత అనుపమను చూపిస్తారు. మనును తలుచుకుంటా ఆమె బాధధ పడుతూ ఉంటుంది.

ఈలోపే మహేంద్ర వచ్చి అనుపమను పిలుస్తాడు. ఏమైంది అలా ఉన్నావని అడగ్గా.. ఏం లేదని చెబుతుంది. మరెందుకు పరధ్యానం, అసలు ఈ మను ఎవరు అని అడగ్గా.. నీకు మను ఎలా తెలుసో నాకు కూడా అలాగే తెలుసు అంటూ చెబుతుంది. నువ్వు ఏదో దాస్తున్నావు అనుపమ, జగతి విషయంలో నన్ను నిలదీసి అనుపమవేనా అంటూ అడగ్గా.. నీకెవరూ లేరని అన్నావుగా, విశ్వనాథం మీ నాన్న, ఏంజెల్ మీ అన్నకూతురు అని చూపించావుగా అంటూ చెప్పుకొచ్చాడు. అసలు అయిన వాళ్లు ఉన్నా లేరని ఎందుకు చెబుతున్నావంటూ ప్రశ్నిస్తాడు.

కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు అని.. నాకసలు పెళ్లి కాలేదంటూ వివరిస్తుంది. మరి మను వచ్చినప్పుడు అతడికి పొలమారితే నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడ్డావు, ఎమోషనల్ అయ్యావు అంటూ ప్రశ్నిస్తాడు. అలా ఏం లేదు, మా మధ్య బంధం ఏం లేదని చెబుతుంది. ఆ స్థానంలో నువ్వు ఉన్నా వసు ఉన్నా నేను అలాగే ప్రవర్తించేదానని అని చెబుతుంది. మరి మను నన్ను తలుచుకునేవాళ్లు ఎవరూ లేరని అన్నప్పుడు తినే అన్నం ఎందుకు కింద పడేశావని అడుగుతాడు. మను ఎవరు చెప్పు అంటాడు మళ్లీ మళ్లీ. సమాధానం చెప్పకుండా నిద్ర వస్తుంది నేను వెళ్తున్నానంటూ లోపలికి వెళ్తుంది.

ఆ తర్వాత శైలేంద్ర కారుకు అడ్డంగా రాజీవ్ బండి ఆపుకుని ఉంటాడు. కోపంతో రాజీవ్ వద్దకు వచ్చిన అతడికి.. మను, వసు ఫొటోలను చూపిస్తాడు. బాగున్నాయని అనగా.. మను స్థానంలో నేను ఉండాల్సింది వాడున్నాడేంటంటూ ప్రశ్నిస్తాడు. వాళ్లను ఫాలో అవుతూ వెళ్లి మరీ ఫొటోలు తీశానని అంటాడు. వాటిని పోస్టర్లుగా చేసి కాలేజీ మొత్తం అంటిస్తానని.. దీంతో తనకు చెడ్డపేరు వచ్చి మనును కాలేజీ నుంచి తొలగిస్తారని అంటాడు. అప్పుడు వసుకు నేనే దిక్కు అవుతానని అంటాడు. ఆ తర్వత మను, అనుపమల మధ్య బంధం గురించి వసు వెళ్తుంది. ఇలా ఈ సీరియల్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X