Jyothi Rai: 38 కాదు.. 30యే అంటూ షాకిచ్చిన జ్యోతి రాయ్... మరి అదేలా సాధ్యం అంటున్న నెటిజన్స్?

టీవీ ప్రేక్షకులకు, సోషల్​ మీడియా యూజర్స్​కు పరిచయం అక్కర్లేని లేని నటి జ్యోతి రాయ్. 'గుప్పెడంత మనస్సు' సీరియల్​తో ట్రెడిషనల్​గా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె బయట మాత్రం హాట్ డాల్​గా కుర్రాళ్లను కవ్విస్తుంటుంది. అయితే ఆమె వయసు వికిపీడియా ప్రకారం 38ఏళ్లు. ఆమెను చూసిన వాళ్లు కూడా 35 నుంచి 38 ఉంటుందనే అనుకుంటారు. కానీ తాజాగా ఆమె అభిమానులతో మాట్లాడుతూ తన అసలు వయస్సును ఫ్రూఫ్​తో సహా చెప్పింది. ఇది తెలుసుకుంటున్న ఫ్యాన్స్​ షాక్ అయిపోతున్నారు. వివరాళ్లోకి వెళితే...

మొదట ట్రెడిషనల్​గా​ : కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫుల్​ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. మొదట గుప్పెడంత మనసు సీరియల్​లో ట్రెడిషనల్​గా రిషికి తల్లి పాత్రలో మెప్పించింది. జగతి అనే రోల్​లో సంప్రదాయంగా తన నటనతో పాపులారిటినీ బాగా దక్కించుకుంది. ప్రేక్షకులందరూ ఆమె నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్​కు ఫుల్ కనెక్ట్ అయ్యారు కూడా.

Guppedentha Manasu Fame Jyothi Rai Reveals Her Real Age And Netizens Crazy Comments Full Details Here

తనకన్నా చిన్నవాడితో హాట్​టాపిక్​గా : అయితే జ్యోతి రాయ్ రియల్ లైఫ్​లో తన భర్తతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యంగ్​ డైరెక్టర్​ పూర్వజ్​తో ప్రేమాయణం నడిపి పెళ్లి కూడా చేసుకుంది! ఆ సమయంలో వీళ్ల రిలేషన్​ షిప్​ కూడా బాగా హాట్​ టాపిక్​గా మారింది. అందుకు కారణం ఆమె వయసే(వికిపీడియా ప్రకారం 38). తన కన్నా చిన్న వాడైన దర్శకుడితో ప్రేమలో పడి డేటింగ్ చేసిందని తెగ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు.

Guppedentha Manasu Fame Jyothi Rai Reveals Her Real Age And Netizens Crazy Comments Full Details Here

సోషల్ మీడియాలో హాట్ డాల్​గా : అలా పెళ్లి టాపిక్​తో చర్చనీయాంశమైన జ్యోతి రాయ్​ సోషల్​ మీడియాలోనూ హాట్ టాపిక్​గా మారింది. సీరియల్ లో తల్లి పాత్రలో ట్రెడిషనల్​గా కనిపించినప్పటికీ బయట మాత్రం చాలా చాలా గ్లామరస్​గా అందాలను వలకబోసింది. హాట్ డాల్​గా కనిపించి కుర్రాళ్లకు చెమటలు పట్టించేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే తన అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసేసింది.

38 కాదు 30యే అంటూ షాక్​ : అయితే తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. అందరూ జ్యోతి రాయి వయసు 35 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉంటుందని అనుకున్నారు. వికిపీడియా కూడా అంతే చూపించింది. కానీ ఆమె మాత్రం తన వయసు 30 అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఆమె తన పాన్ కార్డును చూపిస్తూ అందులోని డేట్ అఫ్ బర్త్ కూడా ప్రూఫ్​గా చూపించింది.

Guppedentha Manasu Fame Jyothi Rai Reveals Her Real Age And Netizens Crazy Comments Full Details Here

జ్యోతి రాయ్ 1994లో జూలై 4న జన్మించినట్లు అందులో ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పాన్ కార్డ్ ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అండ్ సర్​ప్రైజ్ అయిపోతున్నారు. అయితే జ్యోతిరాయ్ కు 16ఏళ్ల కొడుకు ఉన్నాడు. మరి ఆమె వయసు 30ఏళ్లు అయితే... 16ఏళ్ల కొడుకు ఎలా సాధ్యం అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నప్పుడే పెళ్లి అయినా.. ఇది సాధ్యం కాదంటూ.. షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X