Jyothi Rai: ప్రియుడితో అక్కడ అలాంటి టాటూ వేయించుకున్న జ్యోతి రాయ్... దాని అర్థం ఏంటో తెలుసా?

బుల్లితెరపై సీరియల్స్ చూసే వారికి జ్యోతిరాయ్ అంటే గుర్తు పట్టకపోవచ్చు కానీ.. జగతి మేడం అనగానే గుర్తు పట్టేస్తారు. ఆమె నటించిన సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్‏తో దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం జగతి క్యారెక్టర్ చనిపోయినప్పటికీ.. ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. జ్యోతిరాయ్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...

గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెరపై టాప్ రేటింగుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కుమార్ పంతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీరియల్లోని ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాయి. రిషి, వసుధార, మహేంద్ర, జగతి మేడమ్ పాత్రలకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. గత కొన్నాళ్ల క్రితం జగతి మేడం క్యారెక్టర్ ను చంపేశారు. ఇక ఇప్పుడు రిషి సార్ క్యారెక్టర్ కూడా కనిపించడం లేదు. దీంతో రేటింగ్ క్రమంగా తగ్గుతుంది.

Guppendantha Manasu Serial Fame Jagathi Alias Jyothi Rai Shares Tattoo Video and That Tattoo Meaning is Full Details Here

ఆ విషయం పక్కన పెడితే... గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో దగ్గరయ్యింది జగతి మేడమ్. ఈమె అసలు పేరు జ్యోతిరాయ్. అయితే సీరియల్లో సంప్రదాయ కట్టు బొట్టుతో కనిపిస్తుండే ఈ బ్యూటీ.. బయట మాత్రం హద్దులు దాటి మరీ అందాలు ఆరబోస్తుంది. ఆమె సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తన ఇన్ స్టా చూస్తే మాత్రం జనాలు షాక్ అవ్వాల్సిందే.

Guppendantha Manasu Serial Fame Jagathi Alias Jyothi Rai Shares Tattoo Video and That Tattoo Meaning is Full Details Here

సోషల్ మీడియాలో మాత్రం హీరోయిన్ రేంజ్ లో గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తుంటుంది. ఇప్పుడు సీరియల్ నుంచి బయటకు వచ్చేసిన జగతి.. ఓటీటీలో వెబ్ సిరీసులు, సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. కన్నడ సినిమా మాస్టర్ పీస్ అనే సినిమాతో పాటు.. ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. ప్రెట్టి గర్ల్ అనే వెబ్ సిరీసులో నటిస్తుండగా.. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Guppendantha Manasu Serial Fame Jagathi Alias Jyothi Rai Shares Tattoo Video and That Tattoo Meaning is Full Details Here

ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ భామ.. తాజాగా తన టాటూ వీడియోను పంచుకుంది. ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో తన ఎదపై బట్టర్ ఫ్లై టాటూ వేయించుకుంది. లాస్ట్ నైట్ ఇలా టాటూ వేయించుకున్నాని... ఎంతో నొప్పిగా అనిపించిందని.. తన ప్రియుడు సుకుపుర్వాజ్ ఈ టాటూ వేశాడని వెల్లడించింది. టాటూను గమనిస్తే.. సీతకోక చిలుక.. దాని పక్కన హోప్ అనే ఇంగ్లీషు అక్షరాలు ఉన్నాయి.

ఇక ఈ టాటూ మీనింగ్ హోప్ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. అందులో టాటూ వేస్తున్న సమయంలో ఎంతో బాధను భరించినట్లుగా జ్యోతిరాయ్ కనిపించింది. జ్యోతిరాయ్ ప్రస్తుతం డైరెక్టర్ సురేష్ కుమార్ తో ప్రేమలో ఉంది. అప్పట్లో వీరి ప్రేమాయణం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఇన్ స్టాలో తమ బంధం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ ఫోటోస్ పంచుకుంటారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X