బిగ్‌బాస్ 4లోకి నలుగురు టాప్ హీరోయిన్లు.. జిగేల్‌మనిపించే అందాలతో భామలు రెడీ

బిగ్‌బాస్ షో అంటే ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకు ముందు బిగ్‌బాస్ అంటే కేవలం హిందీలోనే హవా ఉండేది. అయితే ప్రస్తుతం దక్షిణాదిలోనూ బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ రియాల్టీ షోకు విపరీతమైన ఆదరణ దక్కింది. ఇప్పటికే మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక నాల్గో సీజన్‌కు కూడా సర్వం సిద్దమైంది. కంటెస్టెంట్ల పేరు కూడా ఒక్కొక్కటిగా లీకవుతూనే ఉంది. తాజాగా అందాల భామల పేర్లు బయటకు వచ్చాయి. వారెవరో ఓ సారి చూద్దాం.

Recommended Video

Bigg Boss 4 Telugu : Bigg Boss 4 రచ్చ రచ్చే.. కంటెస్టెంట్లు గా జిగేల్‌మనిపించే అందాలు..!
ఎన్నో రూమర్లు..

ఎన్నో రూమర్లు..

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌పై లెక్కలేనన్ని రూమర్స్ బయటకు వస్తున్నాయి. హోస్ట్ విషయంలోనూ నిన్నటి వరకు నానా రచ్చ జరిగింది. ఈసారి లేడీ హోస్ట్ ఉండబోతోందని వార్తలు గుప్పుమన్నాయి. సమంత హోస్ట్‌గా వ్యవహరించబోతోందని వార్తలు వచ్చినా.. అవి వట్టి రూమర్సేనని నిర్దారణ అయింది.

బిగ్‌బాస్‌లో బిత్తిరిసత్తి...

బిగ్‌బాస్‌లో బిత్తిరిసత్తి...

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో బిత్తిరి సత్తి పాల్గొనబోతోన్నాడని సమాచారం. ఈ మేరకు ఆయన తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడని టాక్. బిత్తిరి సత్తి బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేయబోతోన్నాడనే వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. మరి వీటిపై ఇంతవరకు బిత్తిరి సత్తి స్పందించలేదు.

మార్పులు చేర్పులు..

మార్పులు చేర్పులు..

ఈసారి బిగ్‌బాస్ షో మొత్తం మారిపోబోతోంది. కాన్సెప్ట్, లివింగ్ స్టైల్, సెట్ ఇలా ప్రతీ ఒక్కటి మార్పులకు లోను కాబోతోంది. కరోనా వైరస్ ప్రభావంతో ఈ సారి టాస్కులు కూడా గతంలో మాదిరి ఉండోబోవని తెలుస్తోంది. సోషల్ డిస్టన్స్‌‌ను పాటించేలా దూరంగా బెడ్స్, సపరేట్ బాత్రూమ్స్ ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకోబోతోన్నారని టాక్.

యాభై రోజులేనని..

యాభై రోజులేనని..

అయితే ఈ సారి బిగ్ బాస్ షో కేవలం యాభై రోజులే ఉండోబోతోందని సమాచారం. ఈ సారి లిస్ట్ మాత్రం మరింత కలర్ ఫుల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. కరోనా వల్ల అంతా ఖాళీగానే ఉండటంతో బిగ్‌బాస్ షోలోకి వచ్చేందుకు చాలా మంది సుముఖత వ్యక్తం చేస్తున్నారట. దీంతో వారి రెమ్యూనరేషన్‌లో భారీ తేడాలు కూడా వస్తున్నాయట. గతంలో లాగా కంటెస్టెంట్లు డిమాండ్ చేసే పరిస్థితి లేనట్టు కనిపిస్తోంది.

జిగేల్‌మనిపించే అందాలు..

జిగేల్‌మనిపించే అందాలు..


బిగ్‌బాస్ నాలుగో సీజన్‌ను అందాల విందుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హంసా నందిని, శ్రద్దా దాస్, యామిని భాస్కర్, ప్రియా వడ్లమాని, మోనాలు నాల్లో సీజన్‌లో దర్శనమివ్వ బోతోన్నారని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే.. బిగ్‌బాస్ షో రక్తికట్టినట్టే. అయితే ఇదంతా జరగాలంటే.. బిగ్‌బాస్ నాల్గో సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X