హన్సిక వెంటపడుతున్న హైపర్ ఆది.. అప్పుడే శేఖర్ మాస్టర్ పులిహోర..!
ప్రస్తుతం అందాల భామలు రీఎంట్రీల కోసం తెగ ఆరాటపడుతున్నారు. పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అయిపోయిన స్టార్ హీరోయిన్స్.. కొన్నేళ్ల తరువాత మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చూస్తున్నారు. ఇంకొంతమంది హీరోయిన్లు సినిమాలు కాకపోయినా కొన్ని షోస్ కు జడ్జీలుగా అయినా పర్లేదని సై అంటున్నారు. కొంతమంది స్టార్ హీరోయిన్లు అలా ఫేమస్ అయినావారే. అందుకు కూడా వారు బాగానే పారితోషికాలను పుచ్చుకుంటున్నారు.
తెలుగులో డ్యాన్స్ షోలకు కరువు లేదు.. ప్రతి ఒక్క డ్యాన్స్ షోలో కూడా ఒక డ్యాన్స్ మాస్టర్, ఒక హీరోయిన్ కంపల్సరీ. అలా ఇప్పటివరకు చాలామంది హీరోయిన్లు ఈ డ్యాన్స్ షోల వలనే ఇంకా స్టార్ డమ్ అందుకుంటున్నారు. సదా, శ్రీదేవి, ప్రియమణి.. ఇలా వీరందరూ అలా వచ్చినవారే. వీరి లిస్ట్ లో చేరిపోయింది బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వానీ.

దేశముదురు సినిమాతో కటాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. పెళ్లి తరువాత సినిమాలకు కొద్దిగా బ్రేక్ ఇచ్చింది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు మాత్రం ఏ లోటు లేకుండా చేస్తోంది. పెళ్లి తరువాత కూడా అమ్మడు అంతే హాట్ గా, యాక్టివ్ గా కనిపిస్తూ కుర్రకారును కవ్విస్తోంది. ఇక ఈ చిన్నది.. బుల్లితెర షోలో జడ్జిగా అడుగుపెట్టింది.
ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2 సీజన్ కు అమ్మడు గెస్ట్ గా వచ్చింది. సీజన్ 1 లో అందరూ కొద్దిగా తెల్సిన సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సుజన్ లో కొంతమంది తెలియని వారు కూడా ఉన్నారు. తాజాగా కంటెస్టెంట్స్ ను పరిచయం చేసే ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హోస్ట్ గా నందు, కమెడియన్ హైపర్ ఆది, శేఖర్ మాస్టర్ కామన్ గా ఉండగా వారి మధ్యలోకి అందాల ముద్దుగుమ్మ హన్సిక వచ్చి చేరింది. రావడం రావడమే డ్యాన్స్ తో అదరగొట్టిన ఈ చిన్నది.. వచ్చిరాని తెలుగులో క్యూట్ గా మాట్లాడి మెస్మరైజ్ చేసింది.
ఇక కంటెస్టెంట్ శ్రేయా రాణి రెడ్డి డ్యాన్స్ కు శేఖర్ మాస్టర్ ఫిదా కావడంతో ఆమె తన రీల్స్ ను శేఖర్ మాస్టర్ కు చూపించగా .. హైపర్ ఆది.. మొదలెట్టేశారా.. రీల్స్ చూసారా.. ఫోన్ నెంబర్ తీసుకున్నారా అంటూ పంచ్ లు వేశాడు. ఇక షోకు ఏ హీరోయిన్ వస్తే ఆ హీరోయిన్ వెంటపడే హైపర్ ఆది.. ఇప్పుడు హన్సిక చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఈ షోలో హన్సికకు మంచి గౌరవం దక్కింది.
సీరియల్ నటుడు మధుబాబు.. తన కూతురుకు పేరు పెట్టమని హన్సికను కోరగా ఆమె ఎమోషనల్ అయ్యింది. ఒక అద్భుతమైన పేరును ఆ పాపకు పెట్టినట్లు చూపించారు. ఇక ఈ షోలో పండు చేరిన రచ్చ అంతా ఇంతా కాదు. పండు డ్యాన్స్ కు.. హన్సిక ఫిదా అయ్యినట్లు చెప్పడంతో మనోడు ప్రేమ సాంగ్స్ వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ షోతో హన్సిక జడ్జిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











