OTT కంటే ముందే అందరి ఇళ్లలోకి హనుమాన్.. ఇలా షాక్ ఇచ్చారేంటి బాసు!
సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది హనుమాన్. ఇక ఈ మూవీ ఇంకా థియేటర్లలో రన్ అవుతూ కలెక్షన్లు కొల్లగొడుతుంది. తేజ సజ్జా హీరోగా నటించిగా, ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా హక్కులను ప్రమఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే జీ5 ఓటీటీలోకి రాక ముందే హనుమాన్ అందరి ఇళ్లలోకి వచ్చేశాడు. అదేంటి అనుకుంటున్నారా.. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి.
సూపర్ హీరో హనుమాన్ సినిమా ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ మూవీ కేవలం 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగ వంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నప్పటికీ.. హనుమాన్ సినిమా భారీ విజయాన్ని సాధించింది.

ఇక హనుమాన్ సినిమాతో సూపర్ క్రేజ్ కొట్టేశాడు తేజ సజ్జా. అయితే హనుమాన్ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 కొనుగొలు చేసింది. మార్చి 2వ వారంలో జీ5 ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ లోపే హనుమాన్ అందరి ఇళ్లలోకి వచ్చేశాడు. దానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.
వెండితెరపై 'హనుమాన్'గా ఆకట్టుకున్న తేజ సజ్జ.. బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయం ఏంటంటే... ఇటీవల తేజ సజ్జ ఓ సీరియల్ లో స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఫన్నీగా మీమర్స్ మీమ్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
జీ తెలుగులో ప్రసారం అయ్యే నిండు నూరేళ్ల సావాసం సీరియలో తేజ సజ్జా ఇటీవల స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అందులో గాయంతో చిన్నారి విలవిల్లాడుతుంటే.. ఆమె తల్లి ఆ చిన్నారి బాధను తీర్చడం కోసం హనుమాన్ అంటూ వేడుకుంటుంది. హే హనుమా... ఇప్పుడు నా బిడ్డ బాధని తీర్చే శక్తి నాకు ఇవ్వు అని అడుగుతుంది. హనుమాన్ (తేజ సజ్జ) మంచు పర్వతాన్ని చీల్చుకుంటూ వస్తాడు.
ఇక ఆ విషయం పక్కన పెడితే... హనుమాన్ సినిమా ఎలాగూ జీ5 ఓటీటీ హక్కులను కొనుక్కుంది. ఇక జీ5 సీరియల్ ప్రమోషన్స్ కూడా ఇలా కూడా వాడారా అంటూ నెటిజన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ సీరియల్ సీన్ అయితే కామెడీగా ఉందని అంటున్నారు. అయితే హనుమాన్ రిలీజ్ కు ముందే ఈ సీరియల్ లో తేజ సజ్జా నటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కాగా.. సీరియల్ లో హనుమాన్ వీడియోపై ట్రోలింగ్ అవుతుంది.


Click it and Unblock the Notifications











