HanuMan: బుల్లితెరపై హనుమాన్ రికార్డు.. ప్రభాస్ కంటే డబుల్.. టాలీవుడ్‌లో 2వ మూవీగా!
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే చిత్రాలు విజయాన్ని అందుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు. కానీ, కొన్నిసార్లు అసలు అలాంటివి ఏమీ లేకుండానే రూపొంది.. విడుదలైన సినిమాలు సంచలనం సృష్టిస్తుంటాయి. అలాంటి ఓ సినిమానే 'హనుమాన్'. పురాణాల్లోని రియల్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమానే 'హనుమాన్'. గతంలో తెలుగులో టచ్ చేయని కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రం క్రమంగా అంచనాలను ఏర్పరచుకుని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల అయింది. తర్వాత ఎవరూ ఊహించని విధంగా రూ. 300 కోట్లు గ్రాస్ రాబట్టి ఎన్నో రికార్డులను సైతం ఇది సృష్టించింది.

విజువల్ వండర్‌గా రూపొందిన 'హనుమాన్' మూవీ థియేటర్లలో విడుదలైన యాభై రోజుల తర్వాతనే జీ 5లో స్ట్రీమింగ్‌కు తీసుకు వచ్చారు. ఇందులో థియేటర్లలో మాదిరిగానే ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ఇండియాలోని బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇలా చాలా వారాల పాటు హనుమాన్ సినిమా టాప్‌లో ట్రెండింగ్ అయింది.
థియేటర్లలో, ఓటీటీలోనూ సక్సెస్ అయిన 'హనుమాన్' మూవీ.. కొద్ది రోజుల క్రితమే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శితం అయింది. అక్కడ కూడా దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ సినిమా ఏకంగా 10.26 టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

సూపర్ హీరో స్టోరీతో రూపొందిన 'హనుమాన్' చిత్రానికి అర్బన్ ఏరియాలో 10.26 రేటింగ్ దక్కింది. అలాగే, అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి 10 వరకూ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తద్వారా 2024లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన చిత్రాల్లో 'ఆదికేశవ' (10.47) తర్వాతి స్థానంలో హనుమాన్ నిలిచింది. ఇటీవలే ప్రభాస్ 'సలార్' 6 రేటింగ్‌ను అందుకున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా.. తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'హనుమాన్' మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇక, ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్‌ను ఇచ్చారు.


Click it and Unblock the Notifications











